ఫీడర్‌! | - | Sakshi
Sakshi News home page

ఫీడర్‌!

Published Sun, Apr 20 2025 7:52 AM | Last Updated on Sun, Apr 20 2025 7:52 AM

ఫీడర్

ఫీడర్‌!

ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు, ఇంటర్నెట్‌, టీవీ కేబుళ్లు విద్యుత్‌ తీగల పాలిట శాపంగా మారుతున్నాయి. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు ఎప్పుడు.. ఎక్కడ.. ఏ చెట్టుకొమ్మ విరిగి మీద పడుతుందో.. ఏ వైపు నుంచి ఫ్లెక్సీ/బ్యానర్‌ గాలికి ఎగిరివచ్చి పడుతుందో.. ఏ హోర్డింగ్‌ విరిగి పడుతుందో.. తెలియని పరిస్థితి. ఫలితంగా 33/11 కేవీ ఓవర్‌హెడ్‌ లైన్లు తెగిపడుతుండటంతో పాటు విద్యుత్‌ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటున్నాయి. లైన్లపై పడిన చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల తొలగింపు ఆపరేషన్‌/ సెంట్రల్‌ బ్రెక్‌డౌన్‌(సీబీడీ)/డీఆర్‌ఎఫ్‌ బృందాలకు పెద్ద సవాల్‌గా మారింది.

ఈదురు గాలులతో బెంబేలు..

వరుస ఈదురు గాలులు బెంబేలెత్తిస్తున్నాయి. ఈనెల 3న భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి నగరంలో 57 విద్యుత్‌ స్తంభాలు సహా 44 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 449 ఫీడర్ల పరిధిలో సరఫరా నిలిచిపోయింది. తాజాగా శుక్రవారం ఈదురుగాలితో కూడిన వర్షానికి గ్రేటర్‌లో మొత్తం 359 ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లోని చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడ్డాయి. భారీ ఈదురు గాలులు వీస్తుండటం, తరచూ ఫ్లెక్సీలు, బ్యానర్లు, చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతుండటం, ఫీడర్లు ట్రిప్పై సరఫరాలో అంతరాయాలు తలెత్తుతుండటం సంస్థకు, సిబ్బందికి ఇబ్బందిగా మారింది.

● జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీల సిబ్బంది ఎప్పటికప్పుడు రోడ్లకు ఇరువైపులా వెలసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు తొలగిస్తున్నప్పటికీ.. మళ్లీ వాటిని ఏర్పాటు చేస్తుండటం, సాయంత్రం ఈదురుగాలితో కూడిన వర్షానికి ఎగిరి లైన్లపై చిక్కుకుంటుండటం, అత్యవసర పరిస్థితుల్లో వాటిని తొలగించాల్సి వస్తుండటం డిస్కం సిబ్బందికి సవాల్‌గా మారింది. ఈ పనుల కోసం డిస్కం భారీగా ఖర్చు చేస్తోంది.

విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగిస్తున్న సిబ్బంది

న్యూస్‌రీల్‌

చినుకు వేళ తీగల వణుకు

తరచూ షార్ట్‌ సర్క్యూట్‌లు

ట్రిప్పవుతున్న ఫీడర్లు

విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం

గంటల తరబడి పునరుద్ధరణ పనులు

అంధకారంలో పలు కాలనీలు

క్షేత్రస్థాయిలోనే సీఎండీ, సిబ్బంది

ప్రస్తుత సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ ప్రతి రోజూ ఉదయం అన్ని విభాగాల డైరెక్టర్లు, సీజీఎంలు, ఎస్‌ఈలు సహా డీఈలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. రోజువారీ ప్రగతిని సమీక్షిస్తున్నారు. సర్కిళ్ల వారీగా బిల్లింగ్‌ నమోదు, రెవెన్యూ వసూళ్లతో పాటు కొత్త కనెక్షన్ల జారీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విపత్తుల సమయంలో స్వయంగా ఆయనే ఫీల్డ్‌లోకి వెళ్తున్నారు. దగ్గరుండి పునరుద్ధరణ పనులను సమీక్షిస్తున్నారు. ఫలితంగా అంతరాయాల సంఖ్య కొంత తగ్గు ముఖం పట్టడం శుభపరిణామం.

ఫీడర్‌! 1
1/1

ఫీడర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement