
అగ్ని ప్రమాదాలతో జాగ్రత్త
షాద్‌నగర్: అగ్ని ప్రమాదాలపై అందరు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను సోమవారం పట్టణంలోని ఫైర్ స్టేషన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలం ప్రారంభం కావడంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు అధికారులు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రమాద రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే ప్రతాప్‌రెడ్డి, నాయకులు బాబర్‌ఖాన్, రఘు నాయక్, మంగులాల్ నాయక్, కరుణాకర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జగన్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్