
వ్యాపారం కోసం యువతుల ఎర
చైతన్యపురి: వ్యాపారాన్ని పెంచుకునేందుకు కస్టమర్లకు యువతులను ఎరవేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ పబ్‌పై చైతన్యపురి పోలీసులు దాడి చేశారు. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కొత్తపేట కిలా మైసమ్మ దేవాలయ సమీపంలోని వైల్డ్ హార్ట్ పబ్‌లో యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా డీజే సౌండ్‌లో యువతులతో అర్దనగ్న నృత్యాలు చేయిస్తుండటమేగాక, నిబంధనలకు విరుద్ధంగా అధిక సమయం పబ్ తెరిచి ఉంచుతున్నట్లు గుర్తించారు. 16 మంది యువతులను డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒంటరి యువకులే టార్గెట్..
పబ్‌కు వెళ్లాంటే కస్టమర్ల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేస్తారు. జంటలుగా వచ్చిన వారిని కాకుండా మద్యం సేవించేందుకు ఒంటరిగా వచ్చిన యువకుల వద్దకు యువతులు వచ్చి వారికి కంపెనీ ఇస్తారు. అసభ్యంగా డాన్సులు చేస్తూ తాము సేవించే మద్యం, ఆహారం కూడా సదరు యువకుల బిల్‌లోనే వేస్తారు. వ్యాపారం పెంచుకునేందుకు మోసపూరితంగా పబ్ నిర్వాహకులే యువతులకు ఫ్రీ పాస్ ఇచ్చి లోపలికి పంపిస్తారు. తద్వారా బిల్లు ఎక్కువ అయ్యేలా చేసి వ్యాపారాన్ని పెంచుకుంటారు. ఇందుకు గాను ముంబై నుంచే కాక నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యవతులను పబ్ నిర్వాహకలు ఎంగేజ్ చేసుకుంటున్నట్లు తెలిపారు. బ్యూటీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులను ఎంచుకుని ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. పట్టుపడిన యువతులను వనస్థలిపురం, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించామన్నారు. 16 మంది యువతులతో పాటు డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, పబ్ యజమాని రాము, మేనేజర్ సంతోష్ పరారీలో ఉన్నట్లు ఆయన వివరించారు.
పబ్ యాజమాన్యం నిర్వాకం
డీజే సాంగ్స్, అసభ్య నృత్యాలు
వైల్డ్ హార్ట్ పబ్‌ౖపైచెతన్యపురి పోలీసుల దాడి
16 మంది యువతుల అరెస్ట్,
పరారీలో పబ్ నిర్వాహకులు