
పిడుగుపాటుతో ఆవుదూడ మృతి
మాడ్గుల: పిడుగుపాటుతో ఆవుదూడ మృతిచెందిన సంఘటన మండలంలోని నల్లవారిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బలగొనిచంద్రయ్య సోమవారం సాయంత్రం తన ఆవు దూడకు మేత వేసి, పొలం పనులు చేసుకుంటున్నాడు. ఈ సమయంలో వర్షం మొదలై, ఆవుదూడ సమీపంలో పిడుగు పడింది. దీంతో అది అక్కడికక్కడే మృత్యువాత పడింది. ప్రభుత్వం స్పందించి పరిహారం అందజేయాలని బాధిత రైతు కోరాడు.
చలివేంద్రం ప్రారంభోత్సవం
పూడూరు: ప్రతీ ఒక్కరు సేవాభావాన్ని అలవర్చుకోవాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కెరవెళ్లి గేటువద్ద కాంగ్రెస్ నాయకుడు అలీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డిసీసీ ఉపాధ్యక్షుడు ఆనందం, రఘునాథ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, కార్యదర్శి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.