కాంగ్రెస్‌తోనే రాజ్యాంగ స్ఫూర్తికి రక్షణ
కొత్తూరు: రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పనిచేస్తోందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తూ మంగళవారం చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని వైఎం తండా, పులిచర్లకుంట తండా, చింతగట్టు తండా, సిద్ధాపూర్, ఎస్‌బీపల్లి, కొడిచర్ల గ్రామాల్లో నిర్వహించిన సమా వేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ రాజ్యాంగంలో పొందుపర్చిన పలు చట్టాలను సవరణ చేస్తూ నిర్వీర్యం చేస్తోందని మండి పడ్డారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి తాము రాజ్యాంగ రక్షణకు కృషి చేస్తున్నామన్నారు. చట్టాల సవరణతో ప్రజలు ప్రశ్నించే హక్కుకు దూరమవుతున్నారని వివరించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
అక్రమాలకు పాల్పడిన వారిని వదలం
గత ప్రభుత్వ హయాంలో సిద్ధాపూర్‌లో టీజీఐఐసీకి కేటాయించిన భూముల అక్రమాలపై విచారణ సా గుతోందని ఎమ్మెల్యే వెల్లడించారు. కొందరు ఈ విషయమై అసత్య ప్రచారం చేస్తున్నారని వారి ఆరో పణలకు త్వరలోనే సమాధానం చెప్తామన్నా రు. భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఇన్‌చార్జి జైపాల్, మాజీ ఎమ్మె ల్యే ప్రతాప్‌రెడ్డి, నాయకులు శ్యాంసుందర్‌రె డ్డి, శివశంకర్‌గౌడ్, శేఖర్‌రెడ్డి, ప్రభాకర్, రవీందర్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, సుదర్శన్‌గౌడ్, మల్లారెడ్డి, జంగ య్య, రాంచందర్, దయానంద్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్


