ప్రసవాల సంఖ్య పెంచాలి
కేశంపేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్‌రావు సిబ్బందికి సూచించారు. మండల పీహెచ్‌సీని ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులతో పాటు పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... టీకాల కార్యక్రమం సకాలంలో జరిగే విధంగా చూడాలన్నారు. డ్రాప్ అవుట్లు, లెఫ్ట్ అవుట్లను గుర్తించి వెంటనే టీకాలను వేయాలని చెప్పారు. ఆరోగ్య కార్యక్రమాలను మెరుగుపర్చుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో పరిశుభ్రతపైన ప్రత్యేక దృషి పెట్టాలన్నారు. సిబ్బంది రోగుల ఆరోగ్యం కోసం నిబద్ధతతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి నిఖిత, సిబ్బంది ఉపేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మెరిక్లిన్, సంగీత, చంద్రశేఖర్, హనుమంతు, సుజాత, సుమతి, వసంత, గీత, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్‌రావు


