హీమోఫిలియాతో జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

హీమోఫిలియాతో జాగ్రత్త

Apr 18 2025 5:33 AM | Updated on Apr 18 2025 7:41 AM

హీమోఫిలియాతో జాగ్రత్త

హీమోఫిలియాతో జాగ్రత్త

జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు

హుడాకాంప్లెక్స్‌: రక్తం సరిగ్గా గడ్డకట్టకపోవడాన్ని హీమోఫిలియా అంటారని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. సరూర్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం హీమోఫిలియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాయాలు అయినప్పుడు రక్తం గడ్డకట్టకపోవడంతో అధిక రక్తస్రావం జరుగుతుందని, ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుందని అన్నారు. ఇది అరుదైన జన్యు రక్త రుగ్మత అని తెలిపారు. మృదు కణజాలంలో గాయాలు అయినప్పుడు కీళ్లు, మోకాళ్లు, మోచేతుల్లో రక్తస్రావం జరిగి నొప్పి, వాపులు వస్తుంటాయని, గాయాలు కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డా.గీత, మెడికల్‌ ఆఫీసర్‌ అర్చన, డా.వినోద్‌ పాల్గొన్నారు.

వ్యాధి నిర్మూలనకు కృషి

షాద్‌నగర్‌: ప్రతిఒక్కరూ హీమోఫిలియా నిర్మూలనకు కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి అన్నారు. గురువారం ప్రపంచ హీమోఫిలియా దినోత్సవాన్ని పురస్కరించుకొని చించోడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ స్రవంతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ... హీమోఫిలియా అనేది వంశపారపర్యంగా వస్తుందని, ఇది రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు జగదీష్‌, సంధ్య, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాసులు, డీపీఎంఓ వెంకటేశ్వర్లు, హెల్త్‌ సూపర్‌వైజర్లు చంద్రకళ, శ్రీరామ, అమృత, ల్యాబ్‌ టెక్నీషియన్‌ శివ పాల్గొన్నారు. పట్టణ సమీపంలో గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ చైర్మన్‌ డాక్టర్‌ నీతాపోలే ఆధ్వర్యంలో ప్రపంచ హెమోఫిలియా దినోత్సవాన్ని నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement