
విక్రయానికి యత్నం
బాలికను కిడ్నాప్ చేసి
చాంద్రాయణగుట్ట: ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఓ ముఠాను చాంద్రాయణగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్, చాంద్రాయణగుట్ట డివిజన్ ఏసీపీ మనోజ్ కుమార్‌తో కలిసి గురువారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 20న బార్కాస్ ప్రాంతానికి చెందిన మరియం భాను(5) చాక్లెట్ ఇప్పించాలని మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్తున్న పెద్దనాన్న బాబాసాదితో మారాం చేయడంతో తన వాహనంపై తీసుకెళ్లాడు. బాలికను వైన్స్ బయట ఉంచి మద్యం తీసుకొచ్చే సరికి బాలిక కనిపించలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మలక్‌పేట్ సలీంనగర్ కాలనీకి చెందిన భార్యాభర్తలు సయ్యద్ జావిద్ పాషా(51), షహిస్తా పర్వీన్(40)ను అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం అంగీకరించారు. బాలికను కిడ్నాప్ చేసి ఉప్పల్ ప్రాంతానికి చెందిన పర్వీన్ భాను(40)కు రూ.1.30 లక్షలకు విక్రయించారు. పర్వీన్ భాను ఆ చిన్నారిని ఉప్పల్ చిలుకానగర్‌లో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వహించే సునీతా కుమారి(50), బంజారాహిల్స్‌లోని నోవా ఫర్టిలిటీ సెంటర్‌లో ఏజెంట్‌గా పనిచేసే కప్పల రాజేంద్ర ప్రసాద్(39) వద్ద అమ్మేందుకు బేరం పెట్టింది. సునీతా కుమారి, రాజేంద్రప్రసాద్ గతంలో ఈస్ట్ ముంబయ్‌లో ఇదే తరహా చిన్నారులను విక్రయిస్తూ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చారు. ఈ ఐదుగురు ముఠాగా ఏర్పడి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. నిందితుల వద్ద నుంచి యాక్టివా ద్విచక్ర వాహనం, ఆటో, రూ.76 వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
చిన్నారిని రక్షించిన పోలీసులు
ఐదుగురి రిమాండ్