ఉమ్మడి ఆవిష్కరణలకు ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి ఆవిష్కరణలకు ఒప్పందం

Apr 19 2025 9:48 AM | Updated on Apr 19 2025 9:48 AM

ఉమ్మడి ఆవిష్కరణలకు ఒప్పందం

ఉమ్మడి ఆవిష్కరణలకు ఒప్పందం

శంకర్‌పల్లి: భారతదేశ భద్రత, నైపుణ్య అభివృద్ధి పెంపొందించేందుకు ఇక్ఫాయ్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, బిట్స్‌ పిలానీ సంస్థలు ఉమ్మడిగా ఆవిష్కరణలు చేసేందుకుగాను ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు ఇక్ఫాయ్‌ వైస్‌ చాన్స్‌లర్‌ ఎల్‌ఎస్‌ గణేశ్‌, బిట్స్‌ పిలానీ వైస్‌ చాన్స్‌లర్‌ రాంగోపాల్‌రావు ఎంఓయూపై సంతకాలు చేసి, ఫైళ్లు మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి డీఆర్‌డీఓ మాజీ చైర్మన్‌ సతీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులలో నైపుణ్యాలను వెలికితీసేందుకు గాను సంస్థలు చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం ఇరు సంస్థల వైస్‌ చాన్స్‌లర్లు మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థల్లోని విద్యార్థులు ఉమ్మడిగా ఆవిష్కరణలు చేయవచ్చని స్పష్టం చేశారు. దీంతో సమయంతో పాటు, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిట్స్‌ పిలానీ ప్రొఫెసర్లు సౌమ్యా ముఖర్జీ, సీఆర్‌ఈఎన్‌ఎస్‌ అధిపతి ప్రొ.రాంమనోహర్‌బాబు, ఇక్ఫాయ్‌ రిజిస్ట్రార్‌ విజయలక్ష్మి, ప్రొఫెసర్లు సీఎస్‌ శైలజన్‌ తదితరులు పాల్గొన్నారు.

సంతకాలు చేసుకున్న ఇక్ఫాయ్‌, బిట్స్‌ పిలానీ వైస్‌ చాన్స్‌లర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement