
విద్యతోనే మార్పు సాధ్యం
మంచాల: విద్యతోనే మార్పు సాధ్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర విద్య శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఆరుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం రాత్రి పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో పిల్లల తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పిల్లలను బడికి పంపించి చేతులు దులుపుకోకుండా పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఏ రకంగా తమ పిల్లలకు విద్యను అందిస్తున్నారు తదితర విషయాలు గమనించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పాఠశాలల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్, ప్రధానోపాధ్యాయుడు గిరధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి