
కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం పోయింది
మొయినాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం మాజీ సర్పంచ్, సర్పంచ్‌ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు కోట్ల నరోత్తంరెడ్డి, వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆదివారం మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కేటీఆర్‌ని కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి స్వాగతించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేవెళ్ల, రాజేంద్రనగర్ స్థానాల్లో త్వరలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని.. ప్రజలు బీఆర్‌ఎస్‌నే కోరుకుంటున్నారన్నారు. పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకుడు కార్తీక్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు మాణిక్‌రెడ్డి, శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు శ్రీహరియాదవ్, సుధాకర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు
జిల్లాలో రెండు స్థానాలకు ఉపఎన్నికలు ఖాయం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్