అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను హైకోర్టులో జస్టిస్ సూరేపల్లి నందా ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రాణాలను త్యాగం చేసిన అగ్నిమాపక సిబ్బందికి నివాళులర్పించనున్నారు. బాంబే డాక్ యార్డులో ‘ఫోర్ట్ స్టికిన్’అనే నౌకలో 1944లో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలను ఆర్పే క్రమంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారి వీరత్వాన్ని స్మరించుకుంటూ వారోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.


