
వైద్య రంగంలో అపార అవకాశాలు
చేవెళ్ల: దేశంలో వైద్యరంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కళాశాల మొదటి బ్యాచ్ (2019) విద్యార్థుల స్నాతకోత్సవం (గ్రాడ్యుయేషన్ డే) వేడుకలను గురువారం పద్మావతి కన్వెన్షన్‌లో కళాశాల చైర్మన్, మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, కనిపించే దేవుడు వైద్యడేనని ప్రజలు నమ్ముతారన్నారు. ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. మండలి చీఫ్‌విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే వైద్య కళాశాలను యూనివర్సిటీగా తీర్చి దిద్దేంకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శాంతా బయోటెక్ ఫార్మా వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎస్సార్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ వరదారెడ్డి, కళాశాల డైరెక్టర్లు సంతోష్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కళాశాల డీన్ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ జోయారాణి, సూపరింటిండెంట్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్