
దంపతుల మధ్య తగాదా
భర్త అదృశ్యం
శంకర్‌పల్లి: దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా మనస్తాపానికి గురైన భర్త అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మోకిల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన ప్రకారం.. కొండకల్ తండాకు చెందిన పి.రవి(33), తేజశ్రీ దంపతుల మధ్య ఆర్థిక అంశాల్లో తరచూ గొడవపడుతున్నారు. ఈ క్రమంలో 7న మరో మారు గొడవ పడడంతో రవి.. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆయన సోదరుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు మోకిల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.