
పౌరసరఫరాల అధికారికి సన్మానం
బడంగ్‌పేట్: నూతనంగా బాధ్యతలు చేపట్టిన పౌరసరఫరాల జిల్లా అధికారిని వనజాతరెడ్డి(డీఎస్‌ఓ)ను సోమవారం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షుడు పి.లక్ష్మీనారాయణగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాలని డీలర్లు కోరారు. ఇందులో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శశిధర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సి.సత్తయ్య, కార్యవర్గ సభ్యులు భానుగౌడ్, విజయ్‌సూర్య, కృష్ణగౌడ్, సందీప్‌గౌడ్, సంఘం మహేశ్వరం మండల అధ్యక్షుడు ఎంఏ సత్తార్, మోయినాబాద్ డీలర్ల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, బాలాపూర్ రేషన్ డీలర్లు సురేష్‌గుప్తా, వినయ్‌గౌడ్, రాజుయాదవ్, శ్రీనివాస్, భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధం
కేతేపల్లి: ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధమైంది. ఈ ఘటన విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండలం ఇస్నాపూర్‌లో నివాసముంటున్న వి.వెంకట్రావు చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తన భార్యతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరాడు. మార్గమధ్యలో కొర్లపహాడ్ వద్దకు రాగానే కారు ఏసీలో నుంచి నుంచి పొగలు వచ్చాయి. ఇది గమనించిన వెంకట్రావు దంపతులు కారును రోడ్డు పక్కకు నిలిపి కిందకు దిగారు. వెంటనే ఇంజన్‌లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే కారుకు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. నకిరేకల్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివతేజ తెలిపారు.
నీటి సంపులో యువతి అస్తిపంజరం
కవాడిగూడ: లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్‌లోని నీటి సంపులో గుర్తుతెలియని యువతి అస్తిపంజరం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆదివారం దోమల గూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. డీఆర్‌ఆర్‌మిల్స్ 40 ఏళ్ల క్రితమే మూతపడింది. సెక్యురిటీ సిబ్బంది ఆదివారం సాయంత్రం మూత్ర విసర్జన కోసం పురాతన భవనం వైపు వెళ్లాడు. అనంతరం నీటి కోసం 3వ అంతస్తులో ఉన్న సంపు మూత తెరిచి చూడగా యువతి మృత దేహం కనిపించింది. దీంతో అతను వెంటనే దోమల గూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, సంపులో పడవేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మృత దేహం పూర్తిగా కుళ్లిపోవడంతో నీటి సంపును పగల గొట్టారు. క్లుస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు సదరు యువతిని ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తీసుకెళ్లలేని పరిస్థితి ఉండటంతో గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్ సిబ్బందిని రప్పించి సోమవారం మధ్యాహ్నం అక్కడే పోస్టు మార్టం నిర్వహించారు.

పౌరసరఫరాల అధికారికి సన్మానం

పౌరసరఫరాల అధికారికి సన్మానం