
అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
కందుకూరు: అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకుసాగాలని ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం మండల పరిధిలోని కొత్తూర్ గేట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా కేసీఆర్ హయాంలో సెక్రటేరియట్‌కు ఆయన పేరు పెట్టారని అన్నారు. ఎవరి వద్దా చేయి చాపొద్దనే ఉద్దేశంతో దళితులకు దళిత బంధు పథకం తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోపెట్టిన విధంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, సీనియర్ నాయకులు కాకి దశరథ, జి.సామయ్య, జంగయ్య, రాంరెడ్డి, ఆనంద్, జైపాల్, ఇందిర, కృష్ణ, సురేష్, వెంకటేశ్, నర్సింహ, నవీన్, మేఘనాథ్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, దీక్షిత్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, శ్రీహరి, లచ్చానాయక్, శ్రీనివాస్, యాదయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
● ఎమ్మెల్యే సబితారెడ్డి