
నేటి నుంచి బాబూజీ మహరాజ్ ఉత్సవాలు
నందిగామ: కన్హా శాంతి వనంలో మంగళవారం నుంచి మే 1వ తేదీ వరకు బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పీఆర్‌ఓ చంద్రారెడ్డి తెలిపారు. భారతీయ సాంస్కృతిక శాఖ సహకారంతో హార్ట్ ఫుల్‌నెస్ గ్లోబల్‌గైడ్ కమ్లేష్ డి.పటేల్(దాజీ) ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అభ్యాసీలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.
ఇళ్ల స్థలాలకు
పొజిషన్ చూపించండి
కందుకూరు: కందుకూరు రెవెన్యూ సర్వే నంబర్ల (788, 107)లో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు పొజిషన్ చూపించాలని సీపీఎం మండల కార్యదర్శి బుట్టి బాల్‌రాజ్ కోరారు. ఈ మేరకు సోమవారం కందుకూరుకు వచ్చిన కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. త్వరలో సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులు ర్యాలీగా భూముల వద్దకు వెళ్లి, చదను చేసే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, లబ్ధిదారులు జి.శ్రీశైలం, చిన్నమయ్య, ఆర్.శేఖర్, దాసు, యాదమ్మ, సక్కుబాయి, రామలక్ష్మీ, జంగమ్మ, శంకరమ్మ, బాలమణి, అలివేలు పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత
● అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
● ప్రజావాణికి 51 ఫిర్యాదులు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి ఆమె అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా.. సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 51 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండలాల తహసీల్దార్లు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
రేపు ‘సారథి’ ప్రారంభం
సికింద్రాబాద్ ఆర్టీఏలో ప్రారంభించనున్న మంత్రి పొన్నం
సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖ ఆన్‌లైన్ సేవలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో చేపట్టిన అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ‘వాహన్ సారథి’ ఈ నెల 30వ తేదీన సికింద్రాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ప్రారంభం కానుంది. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారథిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. వాహనాల వివరాల నమోదు కోసం ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా ‘వాహన్’ పోర్టల్ సేవలను అందజేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ‘సారథి’ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులను ఈ పోర్టల్‌లో నిక్షిప్తం చేయడం ద్వారా వాహనదారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లినప్పుడు ఎన్‌ఓసీలతో నిమిత్తం లేకుండా నేరుగా కొత్త ప్రాంతంలో డ్రైవింగ్ లైసెన్సులను పొందవచ్చు. ‘సారథి’ ద్వారా డ్రైవింగ్ లైసెన్సుల వివరాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే దీని సేవలను మరింత విస్తృతం చేసి ఇంటి నుంచే లెర్న్గింగ్ లైసెన్సుల కోసం పరీక్షలు రాసి ఎల్‌ఎల్‌ఆర్‌లు పొందేవిధంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది.

నేటి నుంచి బాబూజీ మహరాజ్ ఉత్సవాలు

నేటి నుంచి బాబూజీ మహరాజ్ ఉత్సవాలు