
‘ఫార్మా‘ సర్వేను అడ్డుకోవద్దు
యాచారం: ఫార్మాసిటీ భూముల సర్వే, ఫెన్సింగ్ పనులను అడ్డుకోవద్దని, అర్హులైన రైతులకు న్యాయం చేస్తామని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామంలోని సర్వేనంబర్ 109, 114లోని రైతులతో మంగళవారం యాచారం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ కేపీవీ రాజుతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. రెండు రోజుల్లో రెవెన్యూ, అటవీ శాఖ, టీజీఐఐసీ అధికారులతో ఉమ్మడి సర్వే నిర్వహిస్తామని, ఏఏ సర్వే నంబర్లలో ఏ భూములున్నాయో గుర్తిస్తామని తెలిపారు. దీంతో అర్హులైన రైతులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి వెళ్లిపోయారు. సమావేశంలో తాడిపర్తి మాజీ సర్పంచ్ దూస రమేష్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ముప్పిడి బావయ్య, స్థానిక టీజేఎస్ నాయకుడు నిరంజన్ పాల్గొన్నారు.
కొనసాగుతున్న సర్వే, ఫెన్సింగ్ పనులు
ఫార్మాసిటీ భూముల సర్వే, ఫెన్సింగ్ పనుల సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. పది రోజుల క్రితం నక్కర్తమేడిపల్లి నుంచి పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారానికి దాదాపు 35 కిలోమీటర్ల మేర సర్వే జరిగింది. ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు మధ్య పనులు చేస్తున్నారు.
ఇబ్రహీంట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి