
ఆయిల్‌పామ్‌తో అధిక లాభాలు
షాద్‌నగర్: ఆయిల్‌పామ్‌తో రైతులు అధిక లాభాలు పొందొచ్చని ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ పొన్ను స్వామి అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని వెలిజర్లలో రైతు నర్సింహారెడ్డి సాగు చేసిన ఆయిల్‌పామ్‌ను పంటను కేంద్రం బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ పొన్ను స్వామి మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుకు చాలా మంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. నీటి వసతులు ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో సాగు చేస్తే ఎక్కువ లాభాలు ఆర్జించ వచ్చని చెప్పారు. ఈ తోటలకు చీడపీడలు సోకే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. తోట సాగులో ఎదురయ్యే సవాళ్లను గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ విజయకృష్ణ, ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్ సరోజిని, వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ సంస్థ ఉపాధ్యక్షుడు రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరం పరిధిలో పంటల పరిశీలన
మహేశ్వరం: మండల పరిధిలోని మన్సాన్‌పల్లి, ఘట్టుపల్లి గ్రామాల్లో సాగు చేసిన ఆయిల్ పామ్ తోటలను మంగళవారం ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ పొన్ను స్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ పంటకు లేని విధంగా ఆయిల్‌పామ్‌కు చట్టం ఉందన్నారు. జిల్లాలో వ్యాల్యూ అనే కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్ సరోజిని, వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ సంస్థ ఉపాధ్యక్షుడు రామ్మోహన్‌రావు, జిల్లా ఉద్యాన అధికారి సురేష్, ఏడీహెచ్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.