పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
కొత్తూరు: గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ పంచాయతీ కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన కార్మికులతో కలిసి ఎంపీడీఓ అరుంధతికి వినతిపత్రం అందజేశారు. అనంతరం నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు నూతన జీఓల ప్రకారం వేతనాలు పెంచి ఇవ్వాలని కోరా రు. ఉధ్యోగ భద్రత, ఈఎస్‌ఐ, పీఎఫ్, సౌకర్యాలు కల్పించాలన్నారు. విధుల్లో భాగంగా, సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు బీమా సౌకర్యం, కార్మికులకు రక్షణ పరికరాలు, బూట్లు, మాస్కులు ఇవ్వాలని విన్నవించారు. తరచుగా ఆరోగ్య పరీక్షలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్‌రెడ్డి, భిక్షపతి, దేవయ్య, సురే శ్, జంగయ్య, రాములు, కృష్ణయ్య పాల్గొన్నారు.
యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి


