
విద్యారంగ పరిరక్షణకు కృషి
యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య
ఇబ్రహీంపట్నం రూరల్: విద్యారంగం అభివృద్ధి, పరిరక్షణ కోసం టీఎస్ యూటీఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య పేర్కొన్నారు. సంఘం 12వ ఆవిర్భావ వేడుకలను ఆదివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సెమినార్‌లో మాట్లాడారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి నిరంతరం పోరాడుతున్న సంఘం యూటీఎఫ్ మాత్రమేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని వచ్చే జూన్ లో బడిబాట, కళాజాత నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదరణ లభించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి బి.రాములయ్య, కోశాధికారి జగన్నాథ శర్మ, ఎఫ్‌డబ్ల్యూఎఫ్ కన్వీనర్ కిషన్ చౌహాన్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుగంధ, సీనియర్ నాయకులు నాగేంద్రం, ఆయా మండలాల మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
నీటి బకెట్‌లో
పడి బాలుడి దుర్మరణం
నందిగామ: ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలుడు నీటి బకెట్‌లో పడి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని చేగూరులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటాచారి కుమారుడు ఆద్యుత్ (15 నెలలు) ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు అక్కడే నీటితో నిండి ఉన్న బకెట్‌లో పడిపోయాడు. అదే సమయంలో బయ ట నుంచి వచ్చి చూసిన తండ్రి వెంటనే సమీపంలోని కన్హా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలి పారు. అప్పటిదాక బుడిబుడి అడుగులతో సందడి చేసిన బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అంబేడ్కర్ జయంతి సందర్భంగా భారీ ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: రాజ్యాంగ నిర్మాత బాబా సాహెచ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా హెచ్‌ఎండీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. నెక్లెస్ రోడ్డులోని 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ పరిసరాలను శోభాయమా నంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా అంబేడ్కర్ సిద్ధాంతాలను, ఆలోచనలను భావితరాలకు పరిచయం చేసేలా వినూత్నమైన కళా ప్రదర్శన నిర్వహించనున్నారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రూపొందిన ఈ ప్రదర్శనలో యువత తన కళాత్మకతను, సృజనాత్మకతను సమున్నతంగా ఆవిష్కరించనుంది. అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా సమానత్వం, సామాజిక న్యాయం, సాధికారత వంటి అంశాలను ప్రతింబింబించేలా ప్రముఖ ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ విద్యా సంస్థలకు చెందిన 90 మంది విద్యార్థులు రూపొందించిన అనేక రకాల కళాకృతులను ప్రదర్శించనున్నారు.
ప్రాణం తీసిన తనిఖీల భయం
● ట్రాఫిక్ పోలీసులను చూసి.. బైక్ వెనక్కి మళ్లించి వెళ్తుండగా ప్రమాదం
బాలానగర్: బాలానగర్ డివిజన్ పరిధిలోని ఐడీపీఎల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి తన ౖబైక్‌ను వేగంగా వెనక్కి మళ్లించి వేగంగా వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందిన ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ నరసింహ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్ నగర్‌లో నివసించే జోషిబాబు (35) కార్పెంటర్ పని చేస్తున్నాడు. జీడిమెట్ల నుంచి బాలానగర్ వైపు వస్తున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. వీరిని చూసి భయపడి తిరిగి వేగంగా వెనక్కి వెళ్లే క్రమంలో తన ద్విచక్ర వాహనం పడిపోయింది. దీంతో అతని తలపై నుంచి ఆర్టీసీ దూసుపోయింది. తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు.

విద్యారంగ పరిరక్షణకు కృషి

విద్యారంగ పరిరక్షణకు కృషి