
సీనియర్ సివిల్ జడ్జికి ఘనంగా వీడ్కోలు
షాద్‌నగర్: షాద్‌నగర్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో సోమవారం సిద్దిపేట కోర్టులో జడ్జిగా పని చేసిన స్వాతిరెడ్డి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న రాజ్యలక్ష్మికి బార్ అసోసియేషన్ సభ్యులు వీడ్కోలు పలికారు. బదిలీపై వచ్చిన స్వాతిరెడ్డికి న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్వ వేణుగోపాల్‌రావు, న్యాయవాదులు కంచి రాజగోపాల్, గుండుబాయి శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలకు
ప్రాధాన్యత ఇవ్వాలి
అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో శాఖల వారీగా అందిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడే పరిష్కరించే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. ఈ వారం ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 68 అర్జీలు వచ్చాయని, వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 27, ఇతర శాఖలకు సంబంధించి 41 ఉన్నట్టు తెలిపారు. వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
రాచకొండ సీపీ సుధీర్‌బాబు
ఇబ్రహీంపట్నం: పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసు అధికారుల పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలు సమీక్షించేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, రికార్డుల నిర్వహ ణ, పెట్రోలింగ్, సిబ్బంది పనితీరుపై ఆయన ఆరా తీశారు. సమస్యాత్మక ప్రాంతాల సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని, మహిళా భద్రతకు అధి క ప్రాధాన్యత ఇవ్వాలని సీపీ సూచించారు. సీపీ వెంట ఏసీపీ రాజు, సీఐ జగదీశ్ ఉన్నారు.
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
మీర్‌పేట: ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హస్తినాపురం టీచర్స్ కాలనీలో నివసించే ఆకుల దీపిక (38) రెండున్నరేళ్లుగా నాగోలు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు భర్త రవికుమార్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏంజరిగిందో తెలియదు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కుమార్తె విషయాన్ని గమనించి వెంటనే తండ్రికి సమాచారం అందించింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీపిక ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులా, మరేవైనా కారణాలా అనేది తెలియరాలేదు. ఆమె తండ్రి సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు.

సీనియర్ సివిల్ జడ్జికి ఘనంగా వీడ్కోలు

సీనియర్ సివిల్ జడ్జికి ఘనంగా వీడ్కోలు

సీనియర్ సివిల్ జడ్జికి ఘనంగా వీడ్కోలు