మొక్కజొన్న ఉత్తమ హైబ్రీడ్‌ రకాల విడుదల | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న ఉత్తమ హైబ్రీడ్‌ రకాల విడుదల

Published Mon, Apr 14 2025 7:15 AM | Last Updated on Mon, Apr 14 2025 7:15 AM

మొక్క

మొక్కజొన్న ఉత్తమ హైబ్రీడ్‌ రకాల విడుదల

మేలు రకాలను గుర్తించాలి

రైతులకు తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడులు రావడం తక్కువ నీటితో పంట సాగయ్యేలా వంగడాలను తీసుకొచ్చేందుకు విశ్వవిద్యాలయంలో నిరంతరం కృషి చేస్తున్నాం. ఇందు కోసం వర్సిటీ శాస్త్రవేత్తలు తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు చాలా వరి వంగడాలను తీసుకొచ్చాం. ఇప్పుడు మొక్కజొన్న డీహెచ్‌ఎం చాలా మంచి రకాలు. ఇందులో 6 రకాలు మంచి దిగుబడి ఇస్తాయి. రైతులు ఈ విషయాలను గుర్తించి ఆయా రకాలను సాగు చేస్తుకోవాలి. ఇవి మెట్ట సాగుకు చాలా అనుకూలం. నీరు తక్కువగా ఉన్నా సాగు చేసుకోవచ్చు.

– అల్దాస్‌ జానయ్య,

ఉప కులపతి, పీజేటీఎస్‌యూ

ఏజీవర్సిటీ: ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఐదు ఉత్తమ హైబ్రీడ్‌ మొక్క జొన్న రకాలను విడుదల చేసింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ఇటీవల తమిళనాడులో నిర్వహించిన అభిల భారత మొక్క జొన్న పరిశోధన సమన్వయ సమావేశంలో విడుదల చేశారు.

హైబ్రీడ్‌ మొక్క జొన్న రకాలు ఇవీ...

వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఉత్తమ హైబ్రిడ్‌ మొక్కజొన్న రకాలు దక్కన్‌ హైబ్రిడ్‌ మక్క 144, ఈహెచ్‌ఎం 182, డీహెచ్‌ఎం193, డీహెచ్‌ఎం 206, డీహెచ్‌ఎం218లో కలిపి ఈ విశ్వవిద్యాలయం నుంచి మొత్తం 24 మొక్కజొన్న హైబ్రిడ్‌ రకాలు విడుదల అయ్యాయి. ఇందులో డీహెచ్‌ఎం 144 (తెలంగాణ మక్క–6) రకంలో అధిక పిండి పదార్థాలు ఉండటం వలన ఇథనాల్‌ ఉత్పత్తికి బాగా అనుకూలంగా ఉంటుందని విశ్వవిద్యాలయం అధికారులు వెల్లడించారు. దీంతో పాటు డీహెచ్‌ఎం 206 (తెలంగాణ మక్క–3) మెట్ట సాగుకు అనుకూలమైనదని తెలిపారు. ఎండు తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుందన్నారు. ప్రస్తుతం రైతాంగానికి అందుబాటులో ఉన్న వివిధ మొక్కజొన్న వంగడాలతో పోల్చితే డీహెచ్‌ఎం అన్ని విధాలా మేలైందని వారు స్పష్టం చేశారు. పరిశోధనలో రాబోయే కాలంలో రైతాంగం వినియోగించుకోవలసిందిగా విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

16 పంట రకాలకు కేంద్రం గుర్తింపు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం కాలంలో విడుదల చేసిన 16 రకాల వివిధ పంటలను ఇటీవల కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారిక ప్రకటిత రకాలుగా (నోటిఫైడ్‌ వైరెటీస్‌) గుర్తిస్తూ ప్రకటన విడుదల చేసింది. జయశంకర్‌ విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఆయా పంట రకాలను కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ వంత్రిత్వ శాఖ విత్తనోత్పత్తి ప్రణాళికలు రూపొందించి ఈ రకాలను రైతాంగానికి అందుబాటులోనికి తెవడానికి సహకరిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ విత్తన సంస్థలు ఈ రకాల మూల విత్తన సరఫరాకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ మక్క–6

తెలంగాణ మక్క–3

ఆవిష్కరించిన వ్యవసాయ విశ్వవిద్యాలయం

అధిక దిగుబడితోపాటు రైతులకు ఎంతో మేలు చేసే రకాలు

ఏజీ వర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్య

మొక్కజొన్న ఉత్తమ హైబ్రీడ్‌ రకాల విడుదల 1
1/2

మొక్కజొన్న ఉత్తమ హైబ్రీడ్‌ రకాల విడుదల

మొక్కజొన్న ఉత్తమ హైబ్రీడ్‌ రకాల విడుదల 2
2/2

మొక్కజొన్న ఉత్తమ హైబ్రీడ్‌ రకాల విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement