చేవెళ్ల పీఎస్‌కు జీవన్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

చేవెళ్ల పీఎస్‌కు జీవన్‌రెడ్డి

Apr 17 2025 7:07 AM | Updated on Apr 17 2025 7:07 AM

చేవెళ్ల పీఎస్‌కు జీవన్‌రెడ్డి

చేవెళ్ల పీఎస్‌కు జీవన్‌రెడ్డి

అప్రమత్తతే ముఖ్యం జాతీయ అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాల సందర్భంగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

8లోu

చేవెళ్ల: మండల పరిధిలోని ఈర్లపల్లి భూములకు సంబంధించిన కేసులో ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత జీవన్‌రెడ్డి చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సీఐ భూపాల్‌రెడ్డి బుధవారం ఆయన్ను రెండున్నర గంటల పాటు విచారించారు. శంకర్‌పల్లి మండలం టంగటూరు, చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామాల పరిధిలోని తనకున్న 170 ఎకరాల భూమిని కబ్జాచేసి ఆక్రమించుకున్నాడని సామ దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు జీవన్‌రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై మోకిల, చేవెళ్ల పీఎస్‌లలో 2024మే 22, 27 తేదీల్లో కేసులు నమోదయ్యాయి. దీనిపై జీవన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ఆయన తల్లి రాజుబాయి, భార్య రజితకు బెయిల్‌ మంజూరైంది. జీవన్‌రెడ్డికి బెయిల్‌ రాకపోవటంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో జీవన్‌రెడ్డిని అరెస్ట్‌ చేయొద్దని, ఆయన విచారణకు సహకరించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఇప్పటికే మూడుసార్లు మోకిల పీఎస్‌లో విచారణకు హాజరైన జీవన్‌రెడ్డి రెండోసారి చేవెళ్ల పీఎస్‌కు వచ్చారు. రెండున్నర గంటల పాటు సుదీర్ఘ విచారణ కొనసాగింది. ఈర్లపల్లి పరిధిలో ఉన్న 14.30 ఎకరాల భూమికి సంబంధించి జీవన్‌రెడ్డిని పలు ప్రశ్నలు అడగ్గా ఆయన కొన్నింటికి సమాధానాలు చెప్పడంతో పాటు కొన్ని కోర్టు పరిధిలో ఉన్నాయంటూ దాటవేసినట్లు తెలిసింది.

కక్ష సాధింపు..

జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలకులు తనపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తనను విచారణ పేరిట పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని తెలిపారు.

విచారణకు హాజరైన బీఆర్‌ఎస్‌ నేత

పలు అంశాలపై రెండున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు

అవసరమైతే మళ్లీ పిలుస్తాం

సీఐ భూపాల్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ.. ఈర్లపల్లిలోని దామోదర్‌రెడ్డికి సంబంధించిన 14.30 ఎకరాల భూమిని కబ్జా చేయడంతో పాటు కాంపౌండ్‌ ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడనే కేసు విచారణలో భాగంగా జీవన్‌రెడ్డిని పిలిపించామన్నారు. కేసుకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నామని, ఈ సమాధానాలతో కేసును పరిశీలిస్తామని, అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని సీఐ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement