విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలి
మొయినాబాద్‌రూరల్: విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని డీఎస్పీలు హరీశ్‌చంద్రారెడ్డి, సుబ్బరామిరెడ్డి అన్నారు. శుక్రవారం జేబీఆర్ ఎడ్యూకేషన్ సోసైటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆర్కిటెక్చర్ కళాశాలలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీఎస్పీలు హరీశ్‌చంద్రారెడ్డి, సుబ్బరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్య విద్యార్థికి బంగారు భవిష్యత్ అందిస్తుందన్నారు. విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తెచ్చేలా ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో జోగిన్‌పల్లి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటరమణారెడ్డి, ఆర్కిటెక్చర్ ప్రిన్సిపాల్ సునీల్‌కుమార్, ఫార్మసీ ప్రిన్సిపాల్ శర్మ, మెడికల్ కళాశాల సీఏఓ మాజీ డీఎస్పీ యాదయ్య, వైస్ ప్రిన్సిపాల్ అరుణ్‌మూర్తి, యాంటీ ర్యాగింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్, రమేష్, యాంటీ డ్రగ్ కోఆర్డినేటర్ ప్రత్యూష, ఎన్‌సీసీ కోఆర్డినేటర్ గంగారామ్, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ హరీశ్‌చంద్రారెడ్డి


