
సన్న బియ్యం.. స్పందన భేష్
బడంగ్‌పేట్: బాలాపూర్ మండలంలోని పలు రేషన్ దుకాణాలను హైదరాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారులు శనివారం పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ ఎలా కొనసాగుతోందని ఆరా తీశారు. కోటా వచ్చిన రెండు రోజుల్లోనే లబ్ధిదారులు అందరూ బియ్యం తీసుకెళ్లడంపై సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని డీలర్లు తెలిపారు. బాలాపూర్‌లోని రేషన్ దుకాణాలతోపాటు బడంగ్‌పేట్‌లోని రేషన్ షాప్ నంబర్– 4, 11, 22లో రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. అన్ని దుకాణాలకు సకాలంలో కోటా అందేలా చూస్తామని సివిల్ సప్లై టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్లు బాల్‌రెడ్డి, కల్యాణి స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ మండల రేషన్ దుకాణాల సంఘం అధ్యక్షుడు టేకుల శశిధర్‌రెడ్డి, డీలర్లు బి.నర్సింహారెడ్డి, భీమిడి నర్సింహారెడ్డి, అవుల పావని పాల్గొన్నారు.