ప్రైవేటు పాఠశాలలు వద్దు..
ౄనందిగామ: అన్ని వసతులు, అర్హతగల ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులను చేర్పించాలని టీజీయూఎస్(తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం) జిల్లా అధ్యక్షుడు తవుర్యా నాయక్ అన్నారు. ఇప్పటికే సర్కారు బడుల్లో చదువుతున్న వారిని ప్రైవేటు బాట పట్టించవద్దని కోరారు. మండల పరిధి బండకుంటతండా, బండమీదితండాలలోని ప్రాథమిక పాఠశాలలకు సోమవారం సంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాలలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వాటిని బలోపేతం చేసేందుకు ప్రజలు సహకరించాలని సూచించారు. నిరుపేదలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తూ అప్పుల బారిన పడుతున్నారని, అలా కాకుండా నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం, వారానికి రెండు సార్లు గుడ్లు, రాగి జావ, డిజిటల్ టీచింగ్, వర్క్ బుక్కులు, ఏఐ టీచింగ్ తదితర అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ రాథోడ్, దీప్తి నాయక్, రాజశేఖర్, చందు నాయక్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించండి
టీజీయూఎస్ జిల్లా అధ్యక్షుడుతవుర్యానాయక్


