
‘భూ భారతి’తో భూ హక్కుల పరిరక్షణ
మొయినాబాద్: భూ భారతి చట్టంతో భూమి హక్కులు పరిరక్షించబడతాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మొయినాబాద్‌లోని సురంగల్ రోడ్డులో ఉన్న ఓ కన్వెన్షన్ హాల్‌లో గురువారం తహసీల్దార్ గౌతమ్‌కుమార్ అధ్యక్షతన భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలన్నీ సత్వరం పరిష్కరించబడుతాయన్నారు. వ్యవసాయ, వాణిజ్య భూములను పక్కాగా పరిరక్షించే అవకాశం భూ భారతి చట్టం కల్పిస్తుందన్నారు. దీనిపై మే 1 నుంచి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్పారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. భూ సమస్యలు పరిష్కరించి రైతుల ఇబ్బందులు తీర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి భూ భారతి చట్టం తీసుకురావడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ గౌతమ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ జంగయ్య, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్, ఎంపీఓ వెంకటేశ్వరరెడ్డి, ఏఓ అనురాధ, ఏపీఎం రవీందర్, టీపీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్ తదితరులు పాల్గొన్నారు.
భూ సమస్యలకు పరిష్కారం
షాబాద్: భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు హక్కులు భద్రంగా ఉంటాయని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ గార్డెన్‌లో గురువారం భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చట్టం విధి విధానాలను రైతులకు వివరించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ధరణిని రద్దు చేసి కొత్త చట్టం తెచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ అన్వర్, డిప్యూటీ తహసీల్దార్ మధు, సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్‌రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, టీపీసీసీ కార్యదర్శి ఎన్.రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ నారాయణరెడ్డి