
నినదించి.. హోరెత్తించి
మొయినాబాద్: రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్‌కీ అంటూ వీర హనుమాన్ శోభాయాత్ర వైభవోపేతంగా కొనసాగింది. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయం నుంచి మొయినాబాద్ శివాలయం వరకు భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ఇందులో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంతో నృత్యాలు చేశారు. మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆధిత్య పరాశ్రీ స్వామి, చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుడురంగరాజన్ పాల్గొని ప్రసంగించారు. హిదూధర్మాన్ని రక్షించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు గున్నాల గోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నాయకులు శ్రీరాములు, నరేందర్, రాజు, గణేష్, రాజమల్లేష్, శ్రీకాంత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శోభాయమానంగా వీర హనుమాన్ శోభాయాత్ర