
మణికొండలో జలమండలి తనిఖీలు
మణికొండ: తాగునీటి కనెక్షన్‌లకు మోటార్లను బిగించి అధిక మొత్తంలో నీటిని తీసుకుంటున్న వారిపై జలమండలి విజిలెన్స్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. మంగళవారం నుంచి మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల పరిధిలో అధికారులు బృందాలు తనిఖీలు చేస్తున్నారు. మొదటి రోజు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఎంప్లాయిస్ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, నేతాజీ కాలనీలలో నల్లా కనెక్షన్‌లకు ఏర్పాటు చేసిన మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఏర్పాటు చేసిన వారికి రూ.5వేల చొప్పున జరిమానాలను విధిస్తున్నామని విజిలెన్స్ సిబ్బంది తెలిపారు. మరోసారి అదే పద్ధతిలో మోటార్లను ఏర్పాటు చేస్తే వారి నీటి కనెక్షన్‌లను తొలగించడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.