
భవిష్యత్తుకు టెక్నాలజీ కీలకం
ఇబ్రహీంపట్నం రూరల్: భవిష్యత్తును రూపొందించడానికి టెక్నాలజీ ఎంతో కీలకమని ఈసీఐఎల్ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ అనిష్‌కుమార్ శర్మ పేర్కొన్నారు. మంగళ్‌పల్లి సమీపంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో శ్రీరీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఎంబిడెడ్ కంప్యూటింగ్, కంట్రోల్ ఆటోమేషన్‌శ్రీ అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అనిష్‌కుమార్ శర్మ మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక అంశాల్లో అధిక నాణ్యత గల పరిశోధన.. ఎంబిడెడ్ సిస్టం, డిజైన్, రోబోటిక్స్, ఆటోమేషన్, సెన్సార్ నెట్వర్క్, రియల్ టైం సిస్టమ్ అవసరమన్నారు. కార్యక్రమంలో గౌరవ అథితి డాక్టర్ భోజన్న పాసిక్, కీనోట్ స్పీకర్ సుమన్‌సనం, కళాశాల చైర్మన్ డాక్టర్ రాఘవ, డైరెక్టర్ రామశాస్త్రి, ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి, డీన్ లాల్‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.