
కడుపులో పొడిచి.. గొంతుకోసి
షాద్‌నగర్: గుర్తు తెలియని యువకుడిని కత్తితో కడుపులో పొడిచి, గొంతుకోసి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన ఫరూఖ్‌నగర్ మండలంలింగారెడ్డిగూడ శివారులో చోటు చేసుకుంది. పట్టణ సీఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. గుర్తు తెలియని యువకుడిని (30)ని కొందరు దుండగులు శనివారం అర్ధరాత్రి ఎంఎస్‌ఎన్ పరిశ్రమ సమీపంలోని జాతీయ రహదారి పక్కకు తీసుకువచ్చారు. కత్తితో కడుపులో పొడిచి, గొంతు కోసి పరారయ్యారు. సమాచారం అందుకున్న ఏసీపీ రంగస్వామి పట్టణ సీఐ విజయ్‌కుమార్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. మృతుడి శరీరంపై నలుపు రంగు కార్గో ప్యాంటు, నీలం రంగు షర్టు ఉన్నాయి. మెడలో వేంకటేశ్వరస్వామి లాకెట్‌తో పసుపు, ఎరుపు రంగు దారం దండ ఉంది. ఛాతి ఎడమ వైపున పచ్చబొట్టు, కుడి చేతిపై జై బాలయ్య పేరుతో పచ్చబొట్టు ఉన్నాయి. హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసినవారు పోలీస్ స్టేషన్‌లో సమా చారం అందించాలని సీఐ విజయ్‌కుమార్ సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని యువకుడి దారుణ హత్య