ఉగ్రవాదం అణచివేతలో కేంద్రం విఫలం | - | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదం అణచివేతలో కేంద్రం విఫలం

Apr 26 2025 8:02 AM | Updated on Apr 26 2025 8:02 AM

ఉగ్రవాదం అణచివేతలో కేంద్రం విఫలం

ఉగ్రవాదం అణచివేతలో కేంద్రం విఫలం

షాబాద్‌: పహల్గాం ఉగ్రవాదదాడిలో పర్యాటకులు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కుర్వగూడ, మన్‌మర్రి గ్రామాల్లో సీపీఐ శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి కులం, మతం, జాతి ఉండదని మానవ మృగాల్లాగా మానవజాతిని అంతం చేయడమే లక్ష్యంగా పనిచేసే ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంగా ఎదుర్కోవలసిన అవసరం ఉందన్నారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాద సంస్థల కదలికలను పసిగట్టడంలో కేంద్ర నిఘా వర్గాలు తీవ్రంగా విఫలం చెందాయన్నారు. ఉగ్రవాద దాడిలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు ప్రాణాలు కోల్పోయారని.. బీజేపీ నాయకులు సోషల్‌ మీడియా ద్వారా ఇది హిందువుల మీద జరిగిన దాడిగా చిత్రీకరించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి నక్కలి జంగయ్య, తదితరులున్నారు.

కుర్వగూడ, మన్‌మర్రి సీపీఐ గ్రామ శాఖల నూతన కమిటీల ఎన్నిక

సీపీఐ శాఖ మన్‌మర్రి, కుర్వగూడ కార్యదర్శులుగా వెంకటయ్య, శ్రీనివాస్‌ సహాయ కార్యదర్శులుగా వెంకటేష్‌, రాజు, మన్‌మర్రి కోశాధికారిగా నాగేష్‌, కమిటీ సభ్యులుగా బాలమణి, లక్ష్మమ్మ, శంకరయ్యను ఏకగ్రీవంగా నియమితులయ్యారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement