పంట మార్పిడి విధానం మేలు
చేవెళ్ల: రైతులు వ్యవసాయంలో పంట మార్పిడి విధానాలను పాటిస్తే అధిక దిగుబడులతో పాటు లాభాలు పొందవచ్చని మోజర్ల కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు పేర్కొన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని కందవాడలో శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటలో భాగంగా పంటలను వారు పరిశీలించారు. రైతులు సాగు చేస్తున్న పొలాలు పరిశీలించి అవలంబించే పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని రైతులతో సమావేశమై సాగుపై పలు సలహాలు, సూచనలు అందజేశారు. వ్యవసాయ రంగంలో నూతనంగా వస్తున్న విధానాల గురించి వివరించారు. ఒకే రకం పంటల సాగు చేయటంతో పంటల దిగుబడులు తగ్గటంతోపాటు చీడపీడల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పంట మార్పిడిలతో రైతులకు మేలు జరుగుతుందని సూచించారు. సాగు పద్ధతులను తెలుసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. విద్యార్థులు స్వాతి, ప్రీతి, అఖిల, లావణ్య, గ్రామ రైతులు ఉన్నారు.
కందవాడలో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ విద్యార్థుల పర్యటన


