
మహాసభలను జయప్రదం చేయండి
చేవెళ్ల: ఎస్‌ఎఫ్‌ఐ 5వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ అన్నారు. చేవెళ్ల మండల కేంద్రం అంబేడ్కర్ భవన్‌లో సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి అరుణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, దీనికి నిరసనగా రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అరకొర నిధులతో విద్యాభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానం అమలు చేయాలంటే దేశ వ్యాప్తంగా రూ.4లక్షల 82వేల కోట్లు అవసరమని, కానీ బడ్జెట్‌లో రూ.125 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. విద్యారంగానికి జరుగుతున్న అన్యాయంపై చర్చించి, భవిష్యత్ పోరాటాల కోసం జిల్లాలో అన్ని స్థాయిల్లో మహాసభలు జరుపుకొని, రాష్ట్ర మహాసభలను ఖమ్మంలో ఈ నెల 25,26,27 తేదీలలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సభకు విద్యార్థులు, మేధావులు, పుర ప్రముఖలు, ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
నూతన కమిటీ..
సమావేశంలో ఫెడరేషన్ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. చేవెళ్ల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా ఎ.శ్రీనివాస్, అరుణ్‌కుమార్‌లు, ఉపాధ్యక్షులుగా సమీర్, యశ్వంత్, వివేకానంద, దిలీప్, సహాయ కార్యదర్శిలుగా చరణ్‌గౌడ్, చందు, తేజ, పండు, సోషల్‌మీడియా కన్వీనర్‌గా చిరంజీవి, సాయి గణేశ్, డివిజన్ కమిటీ సభ్యులు దేవేందర్, సాయిగౌడ్, రాహుల్, హరికృష్ణ, బన్నీ, నవీణ్, శశాంక్లను నియమించారు.
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్