
ఘరానా దొంగ అరెస్టు
జీడిమెట్ల: ఇంట్లో ఎవరూలేని సమయంలో కిటీకీ గ్రిల్స్ తొలగించి ఇంట్లో ఉన్న బంగారు, వెండి నగలు దోచుకెళ్లే గజదొంగను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రూ.11.5లక్షల సొత్తు రికవరీ చేశారు. గురువారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో జీడిమెట్ల ఇన్స్‌పెక్టర్ గడ్డం మల్లేష్, డీఐ కనకయ్య వివరాలను వెల్లడించారు. అపురూప కాలనీకి చెందిన పింటూ మార్చి 5న కుటుంబ సభ్యులతో కలిసి కలకత్తా వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. ఇది సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంది. ఉదయం సీసీ కెమరాలను పరిశీలించిన పింటూ ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంబించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడు వేణుగోపాల్(26), సంపత్‌సాయి(20)గా గుర్తించారు. బుధవారం సాయంత్రం వేణుగోపాల్‌ను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి రూ.11.5లక్షలు విలువచేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. కాగా మరో నిందితుడు సంపత్ సాయి పరారీలో ఉన్నాడు. ఈమేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి వేణుగోపాల్‌ను రిమాండుకు తరలించారు. వేణుగోపాల్ సైబరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇప్పటికే 44కేసుల్లో నిందితుడుగా ఉండగా గతంలో దుండిగల్ పీఎస్ నుండి పీడీయాక్టు ద్వారా సంవత్సరం జైలుశిక్ష అనుభవించాడు.
● 44 కేసుల్లో నిందితుడు