
వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తీవ్ర నిరాశపరిచాడు. 7 బంతులు ఆడిన గిల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టీమిండియా బ్యాటింగ్‌ను ఆహ్హనించాడు. ఈ క్రమంలో భారత్ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రెండో బంతిని గిల్ మిడాన్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి మిడాన్‌లో ఉన్న ఆడమ్ జంపా చేతికి బంతి వెళ్లింది. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ గిల్ వైపు కోపంతో చూశాడు. ఎందుకంటే స్టార్క్ వేసిన షార్ట్ లెంగ్త్ బాల్‌కు గిల్ ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు.
కీలక మ్యాచ్‌లో అనవసర షాట్ ఆడి గిల్ తన వికెట్ కోల్పోయాడు. ఈ క్రమంలోనే రోహిత్ గిల్ వైపు సీరియస్‌గా చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 18 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(35), కేఎల్ రాహుల్ (15) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ(47), శుబ్‌మన్ గిల్(4), శ్రేయస్ అయ్యర్(4) పరుగులు చేసి ఔటయ్యారు.
చదవండి: ODI World Cup Final: రోహిత్ శర్మ- గిల్ అరుదైన రికార్డు.. వరల్డ్‌కప్ చరిత్రలోనే
— Sitaraman (@Sitaraman112971) November 19, 2023