kale yadaiah
-
బీఆర్ఎస్ను వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదు: కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: పార్టీని వీడి దొంగలతో కలిసెటోళ్ల గురించి బాధలేదని అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మనకు ఇదో లెక్కనా అని పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో శుక్రవారం సమవేశమయ్యారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీయే నాయకులను తయారు చేస్తుంది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని తెలిపారు.. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుంది అని చెప్పారు.రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇంకా నెరవేరని ప్రజా ఆకాంక్షలను భవిష్యత్తులో నెరవేర్చే సత్తా, డెప్త్ మనకే ఉన్నదని చెప్పారు.బీఆర్ఎస్ శ్రేణులకు ప్రస్తుత పరిస్థితులు ఒక లెక్క కాదు. ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుంది. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకునే సత్తా.. బీఆర్ఎస్కు మాత్రమే ఉంది. కొన్ని సార్లు అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు మోసపోతారు. మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది. మనం ఏ హోదాలో ఉన్న ప్రజల కోసం పని చేయాల్సిందే అని కేసీఆర్ స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
-
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లోకి చేరారు. కాలె యాదయ్యకు సీఎం రేవంత్.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కాగా, ఇటీవల మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లోకి చేరారు. తాజాగా, బీఆర్ఎస్కు చెందిన మరో ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ బాట పట్టారు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా నాలుగు రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది.కాగా, యాదయ్య చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023లలో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. -
దమ్ముంటే రండి.. ప్రతిపక్ష నేతలకు ఎమ్మెల్యే సవాల్
-
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన చేవేళ్ల ఎమ్మెల్యే
సాక్షి, చేవెళ్ల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైవీ సుబ్బారెడ్డిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో బుధవారం టీటీడీ చైర్మన్ ఇంట్లో ఆయను కలిసిన ఎమ్మెల్యే పలు విషయాలపై చర్చించినట్లు తెలిపారు. తన నియోజకవర్గంలోని నవాబుపేట మండలంలో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి కృషి చేయాలని టీటీడీ చైర్మన్‌ను కోరినట్లు వివరించారు. అలాగే నియోజకవర్గంలో పలు ఆలయాల జీర్ణోద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని తప్పకుండా మండపం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారన్నారు. -
కాలె యాదయ్య వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తలు
మెయినాబాద్(చేవెళ్ల): 111 జీవో, ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్ సమస్యలపై మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మంగళవారం ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు, నిరసనకారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కాలె యాదయ్య కారులో రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ చౌరస్తా మీదుగా వెళుతుండ గా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. 84 గ్రామాలకు గుదిబండగా మారిన 111 జీవోతోపాటు, ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్ సమస్యలపై సమాధానం చెప్పాలంటూ ఆయన్ని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే కారు దిగి వారిని పరుష పదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకులు కొందరు నిరసనకారులను అడ్డుకుని ఎమ్మెల్యేను అక్కడి నుంచి మండల పరిష త్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. -
‘అమెరికా నుంచి గాంధీ ఆస్పత్రి వరకు ఒకే చికిత్స’
సాక్షి, రంగారెడ్డి : కరోనా వైరస్‌కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనాతో ఎవరూ ఆందోళనకు గురి కావొద్దని సూచించారు. చేవెళ్ళ ప్రభుత్వ ఆస్పత్రికి కన్సర్న్ సంస్థ అందించిన నూతన అంబులెన్స్‌ను శాసన సభ్యులు కాలే యాదయ్య, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డితో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఆస్పత్రిలో ఐసీయూ సెంటర్‌కు ఏడూ బెడ్లతో పాటు, 25 లక్షల విలువైన అంబులెన్స్ ఇచ్చిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. సోమవారం మంత్రి మాట్లాడుతూ.. అమెరికా నుంచి గాంధీ ఆస్పత్రి వరకు ఓకే చికిత్స అని, అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రులకు లక్షలు ఖర్చు చేయవద్దని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్‌లో ఒకే రకమైన వైద్యం అందిస్తున్నామని, పాజిటివ్ వస్తే భయానికి గురి కావొద్దని, ధైర్యంగా ఎదురుకోవాలని సూచించారు. (కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు: జేపీ నడ్డా) వీటితోపాటు కొండాపూర్, షాద్ నగర్ ఆస్పత్రులకు అంబులెన్స్‌లు ఇవ్వటంతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు మూడు కోట్లతో వివిధ ఆస్పత్రుల్లో అంబులెన్స్‌లతో పాటు సౌకర్యాల కల్పనకు కన్సర్న్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రతి సీహెచ్సీలలో కోవిడ్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతమందికి అయిన టెస్టులు చేయటానికి సిద్ధంగా ఉందన్నారు. టిమ్స్ ఆస్పత్రితో పాటు జిల్లాలో కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కోవిడ్‌కు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవటానికి అను నిత్యం కృషి చేస్తుందని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని నిధులు అయిన వెచ్చించి ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చేవెళ్ల ఆస్పత్రి సౌకర్యాల కల్పనకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థ సేవలు గొప్పవని చేవెళ్ల శాసన సభ్యులు కాలే యాదయ్య తెలిపారు. చుట్టూ పక్కల గ్రామాల ప్రజలకు ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. (అంజలికి మంత్రి కేటీఆర్ చేయూత) -
మహేందర్‌రెడ్డి, సబితారెడ్డిలను కలిసిన ఎమ్మెల్యే
చేవెళ్ల: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కుటుంబ సభ్యులతో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ హోంశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డిలను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే భార్య జయమ్మ నవాబుపేట జెడ్పీటీసీగా, కోడలు భవాని నవాబుపేట ఎంపీపీగా, కొడుకు శ్రీకాంత్ మొయినాబాద్ జెడ్పీటీసీగా గెలుపొందడంతో వారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఎంపీ రంజిత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల జెడ్పీటీసీ.. నూతనంగా టీఆర్ఎస్ జెడ్పీటీసీగా గెలిచిన మర్పల్లి మాలతీ క్రిష్ణారెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిని కలిశారు. సోమవారం నగరంలోని ఆయన నివాసానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీకి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఎంపీ జెడ్పీటీసీని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు క్రిష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
భార్య జెడ్పీటీసీ.. కోడలు ఎంపీటీసీ
నవాబుపేట/మొయినాబాద్ రూరల్: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కుటుంబానికి అదృష్టం బాగానే కలిసి వచ్చింది. ఆయన భార్య, కుమారుడు జెడ్పీటీసీలుగా, కోడలు ఎంపీటీసీగా విజయం సాధించారు. నవాబుపేట మండలం చించల్‌పేట గ్రామానికి చెందిన యాదయ్య పేద కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. పీఏసీఎస్ డైరెక్టర్‌గా అడుగుపెట్టిన ఆయనకు అవకాశాలు కలిసి వచ్చాయి. సొసైటీ డైరెక్టర్ నుంచి సింగిల్ విండో చైర్మన్‌గా, అనంతరం ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్సార్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్‌గా వ్యవహరించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి చేవెళ్ల నుంచి గెలుపొందారు. యాదయ్య ప్రాదేశిక ఎన్నికల బరిలో తన భార్య కాలె జయమ్మ నవాబుపేట జెడ్పీటీసీగా విజయం సాధించారు. మొయినాబాద్ జెడ్పీటీసీగా కొడుకు శ్రీకాంత్ గెలిచారు. ఆయన రెండో కోడలు దుర్గాభవాని నవాబుపేట మండలం చించల్‌పేట ఎంపీటీసీగా విజయాన్ని కైవసం చేసుకున్నారు. నవాబుపేట ఎంపీపీ బరిలో దుర్గాభవాని ఉందని విశ్వసనీయ సమాచారం. -
నాకు వ్యవసాయమంటే.. ప్రాణం
‘అందరితో కలిసిమెలిసి.. అందరిలో ఒక్కడిగా ఉండటమంటేనే నాకు ఇష్టం. నేను గొప్ప అనే భావన నాలో లేదు. కిందిస్థాయి నుంచి వచ్చాను కాబట్టి నాకు ప్రజలతో అనుబంధం ఎక్కువ’ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చెప్పారు. వ్యవసాయం అంటే ప్రాణమని, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా సమయం దొరికినప్పుడు పొలం వద్దకు వెళ్లి పనులు చేస్తానని వెల్లడించారు. తన కుటుంబానికి సగం బలం తన భార్య జయమ్మ అని, ఆమెనే కుటుంబాన్ని చూసుకుంటుందన్నారు. యాదయ్య శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తన కుటుంబ విషయాలను పంచుకున్నారు. చేవెళ్ల: వికారాబాద్ జిల్లా నవాబుపే మండలం చించల్‌పేట గ్రామం మాది. అమ్మ లక్ష్మమ్మ, నాన్న మల్లయ్య. నాన్న రైల్వే ఉద్యోగి. మేము ఇద్దరం సోదరులం. తమ్ముడు సాయన్న ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూ చనిపోయాడు. నేను 7వ తరగతి వరకు చించల్పేటలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాను. 8నుంచి 10వ తరగతి వరకు వికారాబాద్‌లో చదివి ఆ తర్వాత ఐటీఐ చేశాను. ఇంటర్ హైదరాబాద్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ కళాశాలలో చదివాను. డిగ్రీ డిస్కంటున్యూ చేశాను. ఐటీఐ చేయటంతో ఏపీఎస్ఆర్టీసీలో మోటర్ మోకానిక్‌గా అప్రెంటీస్‌గా పనిచేశాను. చదవుకునే సమయంలోనే 1980లో నాకు వివాహమైంది. పెద్దలు కుదిర్చిన వివాహమే. మేనత్త కూతురునే చేసుకున్నా. అప్పటి వరకు చదువుకున్న చదువుతో ఏదైనా ఉద్యోగం చేయాలనే ఆలోచనతో ఉండేవాడిని. కానీ, 1990లో మా తమ్ముడు సాయన్న మరణించిన తరువాత గ్రామంలోనే ఉంటూ డీలర్‌గా పనిచేశాను. అప్పటి నుంచే రాజకీయంలోకి ప్రవేశించాను. అప్పట్లో వికారాబాద్ నియోజకవర్గంలో నవాబుపేట మండలం ఉండేది. ఆ నియోజకవర్గానికి ఎక్కువగా వలస నేతలే ఉండేవారు. దీంతో మన నియోజకర్గానికి మనమే నాయకులం కావాలనే ఆలోచన మొదలైంది. అప్పుడే రాజకీయాల్లోకి రావాలనే బీజం పడింది. పీఏసీఎస్ డైరెక్టర్‌గా, చైర్మన్‌గా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా గెలిచి ఎమ్మెల్యే అయ్యాను. వికారాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కావాలని 20 ఏళ్లు పోరాడాను. కానీ, 2009లో చేవెళ్ల నియోజకవర్గానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అవకాశం ఇచ్చారు. అప్పుడు ఓడిపోయినా.. తరువాత రెండుసార్లు గెలిచాను. చదువుకునే రోజుల్లో కబడ్డీ, వాలీబాల్ బాగా ఆడేవాడిని. ప్రజాసేవలోనే నా జీవితం నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో సేవ చేయాలనేదే నా ఆలోచన. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజాసేవలోనే ఉన్నా. ఇక ముందు కూడా ఉంటా. కిందిస్థాయి నుంచి నాయకుడిగా ఎదిగా. అందుకే ప్రజల సమస్యలు ఏమిటో బాగా తెలుసు. యాదన్న అని పిలిస్తే పలుకుతా. నేను ఎమ్మెల్యేను.. నేను పెద్ద అని ఏనాడూ ఫీలవ్వలేదు. ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నా. కుటుంబ బాధ్యత నా భర్యే చూసుకుంటుంది నా భార్య జయమ్మ ఇంటర్ వరకు చదువుకుంది. ఇంటి బాధ్యతలన్నీ ఆమే చూసుకుంటుంది. పిల్లల చదువు అన్నీ ఆమే చూసుకునేది. నాకు ముగ్గురు కుమారులు శ్రీకాంత్, రవికాంత్, చంద్రకాంత్, కూతురు ప్రియాంక. చిన్న కుమారుడు చంద్రకాంత్ వివాహం కావాల్సింది ఉంది. పిల్లలు పెద్దవారైనా ఇప్పటికీ స్వగ్రామంలోనే ఉంటున్నా. సాగుపై మక్కువ గ్రామంలో నాన్న వాటాగా వచ్చిన ఐదెకరాల భూమిని నేనే సాగు చేసుకుంటున్నా. అప్పట్లో నాన్న రైల్వే ఉద్యోగి కావటంతో వేరే వారికి కౌలుకు ఇచ్చే వారు. కానీ, నేను ఎమ్మెల్యే అయిన తరువాత వ్యవసాయంపై ఉన్న మక్కువతో నేనే సాగుచేసుకుంటున్నా. ఎమ్మెల్యేగా ఎప్పుడు బిజీగా ఉంటున్నా సమయం ఉన్నప్పుడాల్లా పొలానికి వెళ్లి పనులు చేస్తుంటాను. ఉదయం వాకింగ్ చేస్తూ కూడా పొలం వద్దకు వెళ్లి వస్తాను. చిన్నప్పటి నుంచి గ్రామంలోనే పుట్టి పెరిగినందుకు వల్ల అన్ని పనులు తెలుసు. గ్రామానికి సమీపంలోనే పొలం ఉండటంతో నేను లేనప్పుడు నా భార్య చూసుకుంటుంది. టమాట, మిర్చి, చిక్కుడు పంటలు సాగు చేస్తున్నాం. ఆయనకు ప్రజాసేవ ఎంతో ఇష్టం నా భర్త యాదయ్యకు రాజకీయలు అంటే ఎంతో ఇష్టం. పెళ్లి అయిన నాటినుంచి కూడా ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు. అయినా, ఆయన కుటుంబాన్ని ఎప్పుడూ మరిచిపోలేదు. ఎన్ని పనులు ఉన్నా.. ఎంత దూరం వెళ్లినా.. రాత్రి వరకు తప్పని సరిగా ఇంటికి వచ్చేవారు. ఏదైనా అనుకోని పరిస్థితులు ఉంటే ఫోన్ చేసి చెప్పేవారు. కుటుంబ బాధ్యత నేనే చూసుకున్నా.. ప్రతి విషయం ఆయనకు చెప్పేదాన్ని. నా మాట ఎప్పుడూ కాదనే వారు కాదు. పిల్లల చదువు, పెంపకంలో కూడా ఎక్కవగా నా బాధ్యతే ఉండేది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా పూర్తిగా ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఎవరు వచ్చి పిలిచినా పలుకుతూ.. వారి కష్టాన్ని విని ఓదార్చాటం ఆయనకు ఉన్న మంచి గుణం. ఎవరి మనస్సూ నొప్పించరు. అందరికి అందుబాటులో ఉండాలనే ఆలోచనే ఎప్పుడు ఆయనకు ఉంటుంది. అవే ఆయనను ఎమ్మెల్యే స్థాయికి తీసుకువచ్చాయి. – జయమ్మ, యాదయ్య భార్య -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే కాలె యాదయ్య
-
అభివృద్ధికి మాత్రం అంతులేని దూరంలో..
గాజులగూడ.. శంకర్పల్లి మండలంలోని ఓ కుగ్రామం.. హైదరాబాద్ మహానగరానికి కేవలం 50 కి.మీ. దూరంలో ఉన్నా అభివృద్ధికి మాత్రం అంతులేని దూరంలో కొట్టుమిట్టాడుతోంది. 18 ఏళ్ల క్రితమే గ్రామపంచాయతీగా ఏర్పడిన గాజులగూడకు రెవెన్యూ పరిధిని నిర్ధారించకపోవడంతో రెవెన్యూ ఆదాయమంతా పాత గ్రామపంచాయతీ అయిన మహాలింగపురంనకే వెళుతోంది. దీంతో గ్రామాన్ని నిధుల కొరత వేధిస్తోంది. తాగునీటి సమస్యతో జనం అల్లాడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులను తెలుసుకునేందుకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా గాజులగూడలో పర్యటించారు. స్థానికులను ఆత్మీయంగా పలకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామానికి భవిష్యత్తులో మంచిరోజులు రానున్నాయన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రజలకు భరోసా కల్పించారు. ఎమ్మెల్యే: అమ్మా నమస్కారం. బాగున్నావా..? నీకు పింఛన్ వస్తోందా? సంగమ్మ: గతంలో పింఛన్ వచ్చేది. ఇప్పుడు వస్తలేదు. నా భర్త నన్ను వదిలేశాడు. నాకు పింఛన్ లేకపోతే ఎట్ల బతకాలె. ఎమ్మెల్యే: భర్త వదిలేసిన వారికి ఇప్పుడు పింఛన్ మంజూరు కాలేదు. మీలాంటి వారి గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. త్వరలోనే మీకు కూడా పింఛన్లు వచ్చే అవకాశం ఉంది. నీ వయసు 65 సంవత్సరాలు ఉంటే వద్ధాప్య పింఛన్ ఇప్పించే ఏర్పాటు చేస్తా. ఎమ్మెల్యే: ఏమమ్మ నీ పేరేంది. నీకు పింఛన్ వస్తోందా? వద్ధురాలు: నాపేరు శాంతమ్మ. నాకు పింఛన్ ఇస్తలేరు సారు. ఎమ్మెల్యే: గతంలో పింఛన్ ఇచ్చారా? శాంతమ్మ: గతంలో ఇచ్చారు. కానీ రెండు నెలల నుంచి రావడంలేదు. కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడంలేదు. ఎమ్మెల్యే: నీ సమస్య ఏమిటమ్మా? సాబేరాబీ: నా భర్త వదిలేసిండు. పింఛను ఇస్తలేరు. ఇల్లు లేదు. ముగ్గురు పిల్లలు చిన్నగున్నరు. నేనెట్ల బతకాలి. ఎమ్మెల్యే: పింఛన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక వస్తుంది. ఇళ్లు ఇప్పించే ఏర్పాటు చేస్తా. పిల్లలను హాస్టల్లో చదివస్తావా? సాబెరాబీ: ఊళ్లోనే చదివిస్తాను సార్. ఎమ్మెల్యే: సరేనమ్మ...బాగా చదివించు. నీ పేరేంటయ్య? సత్యనారాయణ: నా పేరు సత్యనారాయణ. ఎమ్మెల్యే: నీకు రేషన్ కార్డు ఉందా? సత్యనారాయణ: గులాబి కార్డు ఉంది. దాన్ని మార్చి తెల్లరేషన్ కార్డు ఇవ్వాలి. ఎమ్మెల్యే: తెల్లకార్డు ఎందుకు? సత్యానారాయణ: నేను ప్రైవేటు ఉద్యోగం చేస్తా. భూమిలేదు. అధికారులకు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా తెల్లరేషన్ కార్డు ఇవ్వడంలేదు. ఎమ్మెల్యే: తహసీల్దార్‌కు చెప్పి నీకు తెల్లరేషన్ కార్డు ఇప్పించే ఏర్పాటు చేస్తా. ఎమ్మెల్యే: నువ్వు చెప్పన్నా ఇంకా ఊళ్లో ఏమి సమస్యలున్నాయి? మల్లారెడ్డి: నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. చేతిపంపులే ఉన్నాయి. వాటిలో నీళ్లు ఎర్రగా వస్తున్నాయి. ఎమ్మెల్యే: నల్లాల ద్వారా నీరు సరఫరా చేస్తలేరా? మల్లారెడ్డి: బోర్లలో నీళ్లు ఎక్కువగా లేవు. బోర్లు వేసినా ధరి నిలబడక కూలిపోతున్నాయి. తాగునీటికైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎమ్మెల్యే: కొత్తగా బోర్లు వేయించి నీటి సమస్య తీరుస్తా. ఎమ్మెల్యే: నీవు చెప్పమ్మ సమస్యలేమున్నాయ్? మల్లమ్మ: మురుగు కాల్వలు సరిగా లేవు. ఉన్న మురుగు కాల్వల్లో చెత్తాచెదారం నిండిపోయింది. దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. ఎమ్మెల్యే: నీ సమస్య చెప్పమ్మా? శరీఫాబీ: రేషన్ సరుకులు సరిగా రావడంలేదు. 4 కిలోల బియ్యం ఇస్తే ఏం సరిపోతాయ్. ఎమ్మెల్యే: ఇప్పటి వరకు ఒక్కరికి నెలకు 4 కిలోల బియ్యం వచ్చేవి. జనవరి నుంచి ప్రభుత్వం ఒక్కరికి 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తుంది. ఎమ్మెల్యే: అమ్మా.. నీకు ఇల్లు వచ్చిందా? అంజమ్మ: ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కట్టుకున్నాం. ఇప్పటి వరకు బిల్లు ఇవ్వలేదు. ఎమ్మెల్యే: బేస్మెంట్ బిల్లుకూడా ఇవ్వలేదా? అంజమ్మ: ఒక్క బిల్లుకూడా ఇవ్వలేదు. అప్పు చేసి ఇల్లు కట్టుకొని ఇబ్బంది పడుతున్నాం. ఎమ్మెల్యే: బిల్లులు తప్పకుండా వస్తాయమ్మా. నెల రోజుల్లో ఇళ్ల బిల్లులు వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే: తమ్మీ ఏం సమస్యలున్నాయో చెప్పుతమ్మీ? గోవర్ధన్‌రెడ్డి: ఊళ్లో పశువైద్యశాల లేదు. పశువుల డాక్టర్ లేడు. పశువులకు ఏ రోగం వచ్చినా పక్కూరికి వెళుతున్నాం. ఎమ్మెల్యే: ఇప్పుడు నట్టల నివారణ కార్యక్రమం నడుస్తుంది. పశువైద్యులు వచ్చి గొర్రెలు, మేకలకు మందులు ఇస్తారు. అవన్నీ ఇప్పించండి. గ్రామంలో పశువైద్య ఉపకేంద్రం ఏర్పాటు చేసి డాక్టర్గాని, కాంపౌండర్గాని అందుబాటులో ఉంచేలా చూస్తాను. ఎమ్మెల్యే: గ్రామానికి బస్సు వస్తుందా? విఠల్: ఉదయం ఒక్కసారి బస్సు వస్తుంది. ఎమ్మెల్యే: ఒక్క ట్రిప్పే వస్తుందా? మరి సరిపోతుందా? విఠల్: ఒక్క ట్రిప్పు వస్తే ఊళ్లో నుంచి వెళ్లడానికి ఉంటుంది. మళ్లీ రావాలంటే ఎలా?. అందుకు ఇంకా మూడు ట్రిప్పులు బస్సు వస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే: మరిన్ని ట్రిప్పులు బస్సు వచ్చేలా చూస్తాను. ఎమ్మెల్యే: అమ్మా.. నీ సమస్యేంది చెప్పు? నవీన: మా బాబు ప్రదీప్‌కు పుట్టినప్పటి నుంచే మాటలు రావడంలేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించా. ఇప్పుడు ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఇలాంటి ఆపరేషన్లు తీసేయాలని చూస్తుందంటున్నారు. వాటిని అలాగే కొనసాగిస్తే పిల్లలకు సహాయం అందుతుంది. ఎమ్మెల్యే: మీ బాబుకిప్పుడు మాటలు వస్తున్నాయా? నవీన: మాటలు రావడంలేదు. అందుకే పింఛన్ ఇవ్వాలని కోరుతున్నా. ఎమ్మెల్యే: సరేనమ్మ పింఛన్ ఇప్పించేలా చూస్తా. ఎమ్మెల్యే: ఇంకా ఏం సమస్యలున్నాయ్? రమేష్: 18 ఏళ్ల కింద మహాలింగపురం పంచాయతీ నుంచి విడిపోయి గాజులగూడ పంచాయతీ ఏర్పడింది. కానీ గ్రామ రెవెన్యూ మాత్రం వేరు చేయలేదు. దీంతో పంచాయతీకి ఆదాయం రావడంలేదు. ఎమ్మెల్యే: రెవెన్యూ భూములు గ్రామానికి కేటాయించే విధంగా చూస్తాను. ఎమ్మెల్యే: అన్నా నీ సమస్య ఏంది చెప్పు? కిష్టయ్య: నాకు ఎవరూ లేరు. ఒక్కన్నే ఉన్నాను. పింఛన్ రావడంలేదు. రేషన్ బియ్యం ఇస్తలేరు. ఎమ్మెల్యే: నీ ఆధార్ కార్డులో వయసు ఎంతుంది చూద్దాం. కిష్టయ్య: ఇదిగో చూడండి. ఎమ్మెల్యే: ఆధార్ కార్డులో నీ వయసు తక్కువగా ఉంది. అందుకే పింఛన్ రావడంలేదు. రేషన్ బియ్యం ఇప్పించే ఏర్పాటు చేస్తా. -
చెరువుల జీవో రద్దు!
* 111 జీవోను ఉపసంహరించి 80 గ్రామాలకు ఊరటనిస్తాం: సీఎం * హిమాయత్‌సాగర్ ఎగువ గ్రామాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం * కోర్టు వివాదాల్లోని లక్షల కోట్ల విలువైన భూములను విడిపిస్తాం.. ఆ డబ్బుతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం * సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య సాక్షి, హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయని, కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని నిలబెట్టుకునేందుకు యావత్ తెలంగాణ జాతి కృషి చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆదివారం తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. లక్షల కోట్ల విలువైన భూములు కోర్టు వివాదాల్లో ఉన్నాయని, వాటిని విడిపించి ఆ డబ్బును రాష్ట్రాభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 80కి పైగా గ్రామాలకు ఇబ్బందిగా మారిన జీవో నంబర్ 111 ఉపసంహరణకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. హిమాయత్‌సాగర్ కలుషితం కాకుండా.. దాని ఎగువభాగంలో భారీ నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను నిషేధిస్తూ ఈ జీవోను తెచ్చారని, కానీ జీవో వల్ల అనేక గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయిందని సీఎం వివరించారు. అన్ని గ్రామాలకూ ఈ జీవోను వర్తింపజే యాల్సిన అవసరం లేదని, కొన్నింటిని మినహాయించేందుకు ముందుగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖల అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి తదనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. అధికారులు, శాసనసభ్యులతోనూ కమిటీ వేసి దాని నివేదిక ఆధారంగా స్పందిస్తామన్నారు. కొత్త రాష్ట్రంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. మూడేళ్ల తర్వాత నిమిషం కూడా కరెంటు కోత లేకుండా చేస్తానని ఇప్పటికే చెప్పానని, దాన్ని చేసి తీరుతానని నొక్కిచెప్పారు. అలాగే నాలుగేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఉండేలా చూస్తానని, అందరితోనూ కృష్ణా, గోదావరి నీరు తాగిస్తానని చెప్పారు. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగదని పునరుద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రైతులు లక్షాధికారులవుతారని అన్నారు. జిల్లాలోని వెయ్యి ఎకరాల్లో పాలీహౌజ్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. బిందు సేద్యం పరికరాలను దళితులకు వంద శాతం రాయితీపై, బీసీలకు 90 శాతం రాయితీపై అందజేస్తామన్నారు. రంగారెడ్డి నుంచి వచ్చే కూరగాయలు రాజధానికి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ క్రమక్రమంగా నెరవేరుస్తున్నామని తెలిపారు. చేవెళ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చేవెళ్ల, శంకరపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేయిస్తానన్నారు. రోడ్లను అభివృద్ధి చేయిస్తానని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే యాదయ్యతో పాటు పోలీస్ రామిరెడ్డి, వారి అనుచరులు కూడా అధికార పార్టీలో చేరారు. -
గులాబీ దళంలో నూతనోత్సాహం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో గులాబీ పార్టీ బలం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ టీఆర్ఎస్ పార్టీకి నలుగురు శాసనసభ్యులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ఆరుకు పెరిగింది. తెలంగాణలో అధికారం చేపట్టి ఊపుమీదున్న ఆ పార్టీ క్రమంగా ప్రతిపక్షాలను బల హీనం చేసేందుకు.. తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు ‘ఆకర్ష్’ మంత్రానికి తెరలేపింది. ఆ మంత్రానికి ఆకర్షితులై ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. తాజాగా ఆదివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అభివృద్ధి కోసమంటూనే.. అధికారంలో ఉన్న పార్టీలో చేరితే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని, ఈ క్రమంలో నిధులు ఎక్కువ రాబట్టేందుకే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కాలె యాదయ్య ప్రకటించారు. ఆదివారం కేసీఆర్ సమక్షంలో జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మారిన యాదయ్య తన మాజీ పార్టీ నేతలకు చురకలంటించారు. గతంలో మంత్రులుగా పనిచేసి చక్రం తిప్పిన నేతలు ప్రస్తుతం జిల్లాను పట్టించుకోవడంలేదని విమర్శించారు. చేవెళ్లకు భారీగా నిధులివ్వాలని సీఎంను కోరగా.. ఆయన స్పందిస్తూ వెయ్యి ఎకరాల్లో ప్రత్యేకంగా ఉద్యాన సాగుకు ప్రోత్సహిస్తామని, అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అక్కడ హంగామా.. ఇక్కడ మూగనోము.. కాలె యాదయ్య టీఆర్ఎస్లో చేరడంపై ఆయన వర్గంలో నూతనోత్సాహం కనిపించింది. ఆయనతో పాటు ఆయన వర్గీయులుగా ముద్రపడిన పలువురు నాయకులు టీఆర్ఎస్ గూటికి చేరారు. మరోవైపు ఇప్పటికే టీఆర్ఎస్ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం వర్గీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారకులైన వారిని పార్టీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని రాష్ట్ర మంత్రి హరీష్‌రావుకు వివరించగా.. ఆయన అప్పట్లో సర్ది చెప్పి పంపారు. తాజాగా ఆదివారం యాదయ్య చేరిన సమయంలోనూ తమకు ఆహ్వానం లేదంటూ రత్నం వర్గీయులు దూరంగా ఉన్నారు. ఒకవైపు బలం పెరుగుతుండడంతో ఉత్సాహంలో ఉన్న టీఆర్ఎస్కు తాజా చేరికలు ఏమేరకు కలిసివస్తాయో వేచి చూడాల్సిందే. -
ఊగిసలాట!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేవెళ్ల శాసనసభ్యుడు కాలె యాదయ్య అంతరంగం అంతు చిక్కడంలేదు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి ‘కారె’క్కనున్నట్లు ప్రకటించిన యాదయ్య...తాజాగా కాంగ్రెస్ సభ్యులతో కలిసి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న యాదయ్య.. తన రాజకీయ గాడ్‌ఫాదర్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి గులాబీ గూటికి చేరడంతో ఆ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకనుగుణంగా గతవారం సీఎంను కలిసి చేరికను ఖ రారు చేసుకున్నారు. అయితే, టీఆర్ఎస్లో తన చేరికను మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం వర్గీయులు వ్యతిరేకిస్తుండడం... కాంగ్రెస్‌లోనే కొనసాగాలనే ఒత్తిడి తీవ్రతరం కావడంతో ఆయన డోలాయమానంలో పడ్డారు. మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి, టీపీసీసీ చీప్ పొన్నాల లక్ష్మయ్యలు బుజ్జగింపులతో యాదయ్య మనసు మార్చుకునేలా చేశారు. ఈ క్రమంలోనే బుధవారం శాసనసభ బడ్జెట్ సమావేశాలకు కాంగ్రెస్ సభ్యులతో కలిసి తెలంగాణ అమరుల వీరుల స్మారక స్థూపం వద్ద దర్శనమిచ్చారు. పార్టీ కండువా కప్పుకోవడమే గాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. దీంతో యాదయ్య సొంతగూటి లోనే ఉంటాననే సంకేతాలిచ్చారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు తరలిరాగా, యాదయ్య ముఖం చాటేశారు. దీంతో ఆయన పార్టీలో కొనసాగడం సందేహమేనని రాజకీయవర్గాలు అంటున్నాయి. అంతేగాకుండా అసెంబ్లీ ముగిసిన వెంటనే జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డితో సుదీర్ఘ మంతనాలు జరపడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. గట్టి హామీ తీసుకున్న తర్వాతే టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న యాదయ్య... అది ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో మీమాంసలో పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సాయంత్రం రవాణా మంత్రి మహేందర్‌రెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు పడకుండా యాదయ్య వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, అందులోభాగంగానే కాంగ్రెస్ సభ్యులతో జత కలిశారనే చర్చ సాగుతోంది. ఇదిలావుండగా, యాదయ్య పార్టీని వీడరనే గట్టి నమ్మకాన్ని కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నా... అంతర్గతంగా మాత్రం వెనక్కి రావడం కష్టమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని ప్రచారం నేపథ్యంలో.. ఆయన మనసు మార్చుకుంటారని భావించడం దండగేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
గులాబీలో ముసలం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా గులాబీ దళంలో ముసలం పుట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరిక చేవెళ్ల నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలకు రుచించడం లేదు. మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆయన టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన స్థానిక నాయకత్వంలో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది. ఎన్నికల సమయంలో ఓటమికి కారకులైన యాదయ్యను ఇప్పుడు పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ చేవెళ్ల నియోజకవర్గ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ పెద్దలకు విషయాన్ని వివరించేందుకు సిద్ధమయ్యారు. మంత్రికి ఫిర్యాదు.. ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరికను వ్యతిరేకిస్తున్న చేవెళ్ల టీఆర్ఎస్ నేతలు పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీ ఓటమికి కారణమైన ఆయన్ను పార్టీలో చేర్చుకోవద్దనే సంకేతాలు వెళ్ళేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఓ కీలక నేత ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర మంత్రి హరీష్‌రావు వద్దకు వెళ్లి తమ గోడు వెల్లడించే ప్రయత్నం చేశారు. కానీ మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆదివారం ఆయన నివాసానికి చేరుకుని విషయాన్ని వివరించినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలపై పలు కేసులు బనాయించిన ప్రక్రియలో తాజా ఎమ్మెల్యే సహకారం ఉందని వారు ఆరోపించినట్లు తెలిసింది. చేవెళ్ల నేతల ఆందోళనను ఆలకించిన మంత్రి హరీష్‌రావు.. చివరకు ఆ నేతల్ని సర్దిచెప్పి పంపినట్లు సమాచారం. మా లెక్క తేల్చాలి.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేఎస్ రత్నం టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి కాలె యాదయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. రత్నం గతంలో టీడీపీలో ఉండి.. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓడిపోవడం.. రాష్ట్రంలో పార్టీ అధికార పగ్గాలు చేపట్టడంతో ఆయన కొంత ఆవేదనలో ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే పదవులు దక్కుతాయనుకున్న ఆయన.. ఓటమి బాధతో తీవ్ర మదనపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే యాదయ్య చేరికతో తనకు రావాల్సిన అవకాశాల్ని కొత్త నేత ఎగరేసుకుపోతారనే సందిగ్ధం రత్నం వర్గీయుల్లో ఉంది. ఈ క్రమంలో పార్టీ తరఫున ఉన్న నేతలకు పదవులివ్వాలనే డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి. ముందగా హామీ ఇచ్చిన తర్వాతే కొత్త నేతల్ని చేర్చుకోవాలని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నేత ‘సాక్షి’తో అన్నారు. -
విత్తనోత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: తెలంగాణను విత్తనోత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి పర్యటనలో భాగంగా శనివారం చేవెళ్ల మండలంలోని చనువల్లి అనుబంధ గ్రామం ఇక్కారెడ్డిగూడలోని పాలీహౌస్ (గ్రీన్హౌస్)లను సందర్శించారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామన్నారు. ఆర్థికంగా ఆదాయం చేకూర్చే పంటలను పండించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. మేనిఫెస్టోలో హామీలు నెరవేరుస్తాం రుణమాఫీపై రైతుల ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ఉంటుందని తెలిపా రు. బ్యాంక్ అధికారులకు రైతుల వివరాలను ఇవ్వమని ప్రభుత్వం అడిగిందని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో 44వేల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ సాగు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 13 నుంచి జిల్లాలవారీగా టార్గెట్లను ఇచ్చి పూర్తి చేయిస్తామన్నారు. గ్రీన్‌హౌస్‌లు రంగారెడ్డి జిల్లాలోనే 2013-14 సంవత్సరంలో 916మంది రైతులు 256 గ్రామాలలో వేసుకున్నారని వీటికి రూ.10కోట్ల 14లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలకు సంబందించి పూర్తి వివరాలలతో కూడిన ఓ బుక్‌లెట్‌ను తయారుచేసి అన్ని గ్రామపంచాయతీలకు అందిస్తామని పోచారం పేర్కొన్నారు. రైతులే విత్తనాలు తయారు చేసుకునేలా.. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అవసరమైన విత్తనాలను వారే తయారు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. ప్రస్తుతం రైతులకు అవసరమైన విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అలా కాకుండా ఎక్కడైతే ఏయే పంటలు పండిస్తారో అక్కడే ఆయా విత్తనాలు తయారు చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో మనకు అవ సరమైన విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్హౌస్ రైతులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రీన్హౌస్లకు ఇచ్చే విద్యుత్‌ను కమర్షియల్ నుంచి తొలగించాలని, బీమా సౌకర్యం కల్పించాలని, రీప్లాంటేషన్‌కు సహయం చేయాలని కోరారు. చేవెళ్ల ప్రాతంలో కూరగాయల రైతులకు ఎక్కువగా ఉన్నారని.. వారికి కోల్డ్ స్టోరేజి అవసరమని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మైక్రో ఇరిగేషన్ ఈడీ వెంకరాంరెడ్డి, ఉద్యాన శాఖ అధికారులు బాబు, ఉమాదేవి, సంజయ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు మానిక్యరెడ్డి, వసంతం,నర్సింలు, రైతులు పాల్గొన్నారు. రైతులకు 8 గంటల కరెంట్ ఇస్తాం విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన వనరులు తెలంగాణలో ఉన్నప్పటికీ ఉత్పత్తి మాత్రం లేకపోవడం రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని మంత్రి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారన్నారు. రానున్న మూడేళ్ల కాలంలో రాష్ట్రంలోనే మనకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇక్కడి వనరులతో విద్యుత్ ఉత్పత్తి చేసుకొని రైతులకు 24 గంటల కరెంటు అందించేందుకు కూడా అవకాశం ఉందన్నారు. ప్రసుత్తం రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు 8 గంటల కరెంటు అందిస్తామన్నారు. -
ఉద్యోగుల ధూంధాం
కలెక్టరేట్లో అట్టహాసంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వారోత్సవాలు స్వాతంత్య్ర సమరయోధులు, అమరుల కుటుంబసభ్యులు, వివిధ రంగాల్లో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు ఘన సన్మానం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. సాక్షి, రంగారెడ్డి జిల్లా : తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలను గురువారం కలెక్టరేట్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బి.శ్రీధర్ మాట్లాడుతూ.. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికోసం ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 29వ రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎం.సుధీర్‌రెడ్డి, కాలె యాదయ్య, సంజీవరావు, కనకారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు ప్రసంగిస్తూ ఉద్యమంలో ఉద్యోగుల కృషిని కీర్తించారు. చివరగా స్వాతంత్య్ర సమరయోధులు ఆండాలమ్మ, లక్ష్మీకాంతమ్మ, చంద్రకాంతమ్మ, సీతలను సత్కరించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులు అనిత (మంచాల), రమేష్ (గండేడ్), ప్రముఖ వాలీబాల్ క్రీడాకారుడు రవికాంత్‌రెడ్డితో పాటు జర్నలిస్టులు బి.సురేష్, గిరీష్, రాజు, విద్యావెంకట్, చందు, బాలరాజులను శాలువా, మెమెంటోలతో సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ధూంధాం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. -
నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచారు
నవాబుపేట, న్యూస్‌లైన్: ‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న’ అన్న చందంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో కోదండపాణి ఆధ్వర్యంలో సిబ్బంది ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం వీఆర్వోలు, సాక్షరభారత్ సిబ్బంది, వివిధ గ్రామాలను చెందిన సర్పంచ్‌లు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీపై టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రూ.లక్షలోపు పంట రుణాలన్నీ మాపీ చేస్తామని ఎన్నికల్లో రైతులకు మాయ మాటలు చెప్పి ఇప్పుడు షరతులు పెట్టడంపై ఆయన మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన రైతుల్ని కేసీఆర్ నట్టేట ముంచారని విమర్శించారు. అతివృష్టి , అనావృష్టికి తోడు గిట్టుబాటు ధరలు లేకనే రైతులు తీసుకున్న రుణాలు చెల్లించలేదన్నారు. అలాంటి రైతులకు అండగా నిలవాల్సింది పోయి కొద్దిపాటి రైతులకు రుణ మాపీ చేస్తామనడం భావ్యం కాదన్నారు. ఇది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పేరుమీద ఉన్న రుణాలన్నీ మాపీ చేసిందని గుర్తు చేశారు. రైతులను మోసం చేసిన వారికి గుణపాఠం తప్పదన్నారు. కేసీఆర్ పునరాలోచన చేసి రైతులందరికీ రుణ మాపీ చేయాలని డిమాండు చేశారు. లేని పక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. మండలాభివృద్ధికి కృషి.. తనను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించిన మండల ప్రజలకు, అధికారులకు కాలె యాదయ్య కృతజ్ఞతలు తెలిపారు. మండలాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తాగునీటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బదిలీపై వెళుతున్న ఎంపీడీ వో కోదండపాణిని ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు ఫలికారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి అనంత్‌రెడ్డి, డీఈలు అంజిరెడ్డి, హంసారాం, ఈవోఆర్డీ తరుణ్, సీనియర్ అసిస్టెంట్లు శేఖర్, జగన్నాథ్‌రెడ్డి, ఏపీవోలు లక్ష్మీదేవి, రఘు, సర్పంచ్‌లు తిరుపతిరెడ్డి, రాములు, గోపాల్, జంగయ్య, నర్సమ్మ, నాయకులు నాగిరెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు. -
ముదురుతున్న ‘పంచాయితీ’
చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శుల మధ్య ముదిరిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. వివాదం ముదిరి పెద్దదయినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ‘రచ్చ’ బజారున పడింది. దీంతో ఎమ్మెల్యే కాలె యాదయ్య వద్దకు పంచాయితీ చేరింది. ఈ విషయం మరీ పెద్దదవుతుందన్న ఉద్దేశంతో విలేకరులను బయటకు పంపి సోమవారం స్థానిక అతిథిగృహంలో అధికారులు, ఈఓపీఆర్డీ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. పంచాయతీ ఎటూ తేలకపోవడంతో ఎమ్మెల్యే యాదయ్య సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు నచ్చజెప్పి పంపించారు. వివరాల్లోకి వెళితే... ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎంపీడీఓగా హిమబిందు బదిలీపై వచ్చారు. అంతకుముందు ఎంపీడీఓగా పనిచేసిన రత్నమ్మకు ఇప్పుడున్న సూపరిండెంట్ విజయలక్ష్మికి మధ్య సయోధ్య ఉండేదికాదు. కొత్తగా వచ్చిన ఎంపీడీఓ హిమబిందు కలిసి ఈఓపీఆర్డీ లక్ష్మణ్‌ను, పంచాయతీ కార్యదర్శులపట్ల అసభ్యకరంగా మాట్లాడారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈఓపీఆర్డీ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శులు ఏదైనా పనిపై వారి వద్దకు వెళితే అవమానపరిచే రీతిలో మాట్లాడేవారని పేర్కొన్నారు. ఈ క్రమంలో డీపీఓ కార్యాలయం నుంచి ఆరు కంప్యూటర్లు పంపిణీ అయ్యాయి. ఒకటి ఈఓపీఆర్డీకి, ఐదు పలు గ్రామపంచాయతీలకు పంపిణీ చేయాలి. కాగా పంచాయతీలకు పంపిణీ చేయగా, ఈఓపీఆర్డీకి వచ్చిన కంప్యూటర్ను ఎంపీడీఓ చాంబర్లో బిగించాలని సూచించడంతో ఈఓపీఆర్డీ లక్ష్మణ్ అభ్యంతరం చెప్పారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈఓపీఆర్డీ ఆఫీసుకు తాళం.. తనకు కేటాయించిన కంప్యూటర్ను ఎంపీడీఓ చాంబర్లో బిగించాలని ఎంపీడీఓ హిమబిందు ఆదేశించడంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. దీంతో మెమో జారీ చేయగా, తన తప్పేమీ లేదని, మెమో ఎందుకు తీసుకోవాలంటూ ఈఓపీఆర్డీ లక్ష్మణ్ నిరాకరించారు. ఎమ్మెల్యే ముందుకు పంచాయితీ.. ఎమ్మెల్యే కాలె యాదయ్యకు అభినందనలు తెలపడానికి వచ్చిన ఈఓపీఆర్డీ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓ, సూపరిండెంట్ తీరుపై ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఆయన ఫోన్‌చేసి అతిథిగృహానికి రావాలని ఆదేశించడంతో ఎంపీడీఓ హిమబిందు, సూపరిండెంట్ విజయలక్ష్మి వచ్చారు. అందరూ కలిసిమెలిసి పనిచేయాలని, తగవులు పెట్టుకుంటే ప్రజా సంక్షేమం కుంటుపడుతుందని ఆయన హెచ్చరించి పంపించేశారు. విలేకరులను బయటకు పంపి.. మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి విలేకరులను బయటకు పంపి, అధికారుల మధ్య పంచాయితీ చెప్పారు. ఓ విలేకరి ఫోటోలు తీయడానికి ప్రయత్నించగా, ముడిమ్యాల మాజీ సర్పంచ్ ప్రభాకర్ చేతిని అడ్డంపెట్టి గన్‌మెన్‌తో తలుపులు వేయించారు. విలేకరులను బయటకు వెళ్లాలని చెప్పినప్పుడు ఎమ్మెల్యే యాదయ్య అక్కడే ఉండి వంత పాడడం విశేషం.