
సాక్షి, సిద్ధిపేట: పార్టీని వీడి దొంగలతో కలిసెటోళ్ల గురించి బాధలేదని అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మనకు ఇదో లెక్కనా అని పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో శుక్రవారం సమవేశమయ్యారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీయే నాయకులను తయారు చేస్తుంది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని తెలిపారు.. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుంది అని చెప్పారు.
రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇంకా నెరవేరని ప్రజా ఆకాంక్షలను భవిష్యత్తులో నెరవేర్చే సత్తా, డెప్త్ మనకే ఉన్నదని చెప్పారు.
బీఆర్ఎస్ శ్రేణులకు ప్రస్తుత పరిస్థితులు ఒక లెక్క కాదు. ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుంది. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకునే సత్తా.. బీఆర్ఎస్‌కు మాత్రమే ఉంది. కొన్ని సార్లు అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు మోసపోతారు. మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది. మనం ఏ హోదాలో ఉన్న ప్రజల కోసం పని చేయాల్సిందే అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment