Publicity Stunt
-
బాబును పాన్ ఇండియా స్టార్‌ను చేద్దాం!!
దేశంలో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్లు..పాన్ ఇండియా క్రికెటర్లు..పాన్ ఇండియా బిజినెస్ మెన్..పాన్ ఇండియా హీరోలు..పాన్ ఇండియా మార్కెట్ ఉన్న నటీనటులు.. ఇదీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న అంశం .అయితే పబ్లిసిటీ అంటే పీక కోసుకునే చంద్రబాబుకు కూడా ఇప్పుడు జాతీయస్థాయి లీడర్‌గా ఎదగాలనే పిచ్చి పట్టుకుంది. దేశంలో తన కన్నా సీనియర్ నాయకులు లేరని. మోడీ తదితరులు కూడా తనకన్నా జూనియర్లు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు పబ్లిసిటీతో అయినా సరే మీడియాను కొనేసి అయినా సరే.. లేకుంటే కొత్త పబ్లిసిటీ వ్యవస్థను ఏర్పాటు చేసి అయినా సరే యమర్జంట్‌గా పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అవ్వాలని తెగ ఆరాట పడుతున్నారు.ఈ క్రమంలోనే దావోస్ సదస్సుకు చంద్రబాబు లోకేష్ వెళ్లగా దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ప్రచారం చేసే నిమిత్తం ఎన్డీటీవీ.. ఐబీఎన్ వంటి జాతీయ ఇంగ్లీష్ ఛానల్ కు భారీ ఎత్తున డబ్బు గుమ్మరించారు. దీంతో ఆ చానళ్ళు చంద్రబాబు ఆహా ఓహో అంటూ జాకీలు పెట్టి లేపుతున్నాయి.👉చదవండి : భజన బ్యాచ్.. కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉండండమ్మాఆ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఏ మేరకు పెట్టుబడులు వస్తాయన్నది గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడే తేటతెల్లమైంది. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్న ఏటా దావో సదస్సుకు వెళ్లడం.. ఫోటోలు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఒక్క పరిశ్రమ కూడా వచ్చింది లేదు. కానీ అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరుగుతున్నాయి... అదిగో భారీ పరిశ్రమ.. ఇదిగో వేలల్లో ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టడం అందరికీ తెలిసిందే.వాస్తవానికి చంద్రబాబుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహా టీవీ, తోపాటు పదుల సంఖ్యలో వెబ్సైట్లు . వందల సంఖ్యలో ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్ పేజీలు.. వేలల్లో సోషల్ మీడియా కార్యకర్తలు నిత్యం భజన చేస్తూ ఎలివేషన్లు ఇస్తున్నారు.చంద్రబాబు ప్రస్తుతం ఏం చేస్తానన్నది ప్రజలకు చెప్పారు కానీ వచ్చే పాతికేళ్లు.. రానున్న 50 ఏళ్లలో రాష్ట్రాన్ని అలా మారుస్తా? ఇలా మారుస్తా అంటూ మభ్య పెట్టడం అందరికీ తెలిసిందే. 30 ఏళ్ల కిందట విజన్ 2020 అంటూ కథలు చెప్పారు కానీ ఏమీ చేసింది లేదు. ఇప్పుడు ఏకంగా విజన్ 2047 అంటున్నారు. ఈ కథలన్నీ ప్రజలతో నమ్మించడానికి సరికొత్త ఏజెన్సీ సృష్టించడానికి ప్రభుత్వం పథకం సిద్ధం చేసింది.👉చదవండి : దావోస్ వెళ్దాం.. పబ్లిసిటీ బారెడు.. దక్కేది చెంచాడు!ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు సమాచారం అందించడానికి ప్రభుత్వం తరఫున సమాచార శాఖ ఉండనే ఉన్నది. దీనిలో ఐఏఎస్ అధికారి తో పాటు ఎంతమంది సీనియర్ జర్నలిస్టులు, జేడీలు, డీడీలు, ఏడీలు, డీపిఆర్ఓ, కేడర్‌లో పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్లంతా సరిపోలేదని మరో ప్రైవేట్ ఏజెన్సీని తీసుకొచ్చి చంద్రబాబు కు ఎలివేషన్..జాతీయ స్థాయి ప్రచారం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అంటే ఆ ఏజెన్సీకి ప్రజాధనం ధారవోసి చంద్రబాబుకు పబ్లిసిటీ ఇప్పిస్తారన్నమాట. దీనికోసం కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భారీ ఎత్తున సిబ్బందిని నియమించి వారితో బాబుకి ఎలివేషన్ ఇప్పిస్తారన్నమాట.దీంతోపాటు ఇద్దరు ఉద్యోగులను ప్రోగ్రాం కోఆర్డినేటర్లుగా నియమించి వారికి రూ.లక్షన్నర జీతం ఇవ్వాలని నిర్ణయించారు. వారు చంద్రబాబు పర్యటనకు..సభలు సమావేశాలకు సంబంధించిన వివరాలను మీడియాకు అందజేస్తారు. ఇటు తమ అనుకూల మీడియాకు కోట్లు దారబోస్తూనే ప్రైవేటు ఏజన్సీ ద్వారా కూడా భారీ ఎత్తున పబ్లిసిటీ చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మొత్తానికి ఎదైనాగానీ చంద్రబాబు తక్షణం జాతీయ స్థాయి నాయకుడు అయిపోవాలి..అదే టీడీపీ లక్ష్యం. 👉చదవండి : లోకేష్‌కు ఫుల్ ఎలివేషన్.. కాబోయే డిప్యూటీ సీఎం?సిమ్మాదిరప్పన్న -
దేవినేని వారి పబ్లిసిటీ స్టంట్స్.. అరెరే.. డ్రామా చేస్తే నమ్మాలి కదా..!
చంద్రబాబు హయాంలో ఆయన రేంజే వేరు. బాస్ తర్వాతే తానే అన్నట్లుగా బిల్డప్‌లు ఇచ్చేవారు. శిలాఫలకాలు, శంకుస్థాపనలు మినహా నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. గత ఎన్నికల్లో జనం తుక్కు కింద ఓడించేశారు. ఇక కేడర్, ప్రజలు పట్టించుకోవడం మానేశారు. అయితే ఇప్పుడా నేత సానుభూతి రాజకీయాలకు తెరదీస్తున్నాడు. ప్రజల కోసం తానేదో చేస్తున్నట్లు పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు. మైలవరం గుర్తుకొచ్చింది.! దేవినేని ఉమామహేశ్వరరావు.. తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకుల్లో తానే పెద్ద సూపర్ స్టార్ అని ఓవర్ బిల్డప్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. తనంత గొప్పోడు లేడంటూ.. ప్రజలకు దూరంగా ఉంచుతూ.. కనీసం నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోకుండా లెవెల్ చూపించే ఉమకు గత ఎన్నికల్లో ప్రజలు ఆయన అసలు స్థానం ఏంటో చూపించారు. ఓడాక ఆయన్ను కేడర్ పట్టించుకోవడంలేదు. ప్రజలు అసలే మర్చిపోయారు. గతంలో పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో తళుక్కున మెరిసి మాయమైపోయే దేవినేని ఇప్పుడు మైలవరంలో అసలు కనిపించడమే మానేశారట. మరోవైపు ఆయన వ్యతిరేక వర్గం వేరు కుంపటి పెట్టడంతో ఇన్నాళ్లు మైలవరం నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యాడట దేవినేని. ఇప్పుడు హఠాత్తుగా ఆయనకు మళ్లీ మైలవరం గుర్తుకొచ్చింది. డ్రామా@టిడ్కో పార్టీలో, ప్రజల్లో తన మైలేజ్ పడిపోతుందని భావించిన దేవినేని ఉమ.. ఇప్పుడు కొత్తగా ప్రజాసమస్యలన్నీ తన భుజాన వేసుకున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారట. తాజాగా మైలవరం నియోజకవర్గం పరిధిలోని జక్కంపూడి కాలనీలో నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాల వద్ద నిరసన దీక్ష పేరుతో ఓ కొత్త డ్రామాకు తెరతీశారు దేవినేని ఉమ. నివాసయోగ్యమైన గృహాలను పేదలకు కేటాయించినందుకుగాను నిరసన తెలియచేస్తున్నా.. జగన్ ప్రభుత్వం కళ్లు తెరిపిస్తా అంటూ వీరావేశంలో స్పీచ్‌లు ఇచ్చారట. అయితే క్షేత్రస్థాయిలో ఉమాతో పాటు నిరసనలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని ముక్కున వేలేసుకోవాల్సి వచ్చిందట. ఇల్లు ఇస్తే ఎంత ఇస్తావు..? గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2018లో జక్కంపూడి కాలనీలో కొన్ని ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో టిడ్కో ఇల్లు కావాలంటే 25 వేలు కట్టాలంటూ లబ్ధిదారుల నుంచి వీఎంసీ ద్వారా రూ.15కోట్ల 90 లక్షలు వసూలు చేశారు. ఇవి కాకుండా అనధికారికంగా టీడీపీ నేతలు అందిన కాడికి లబ్ధిదారుల నుంచి దోచుకున్నారు. ప్రభుత్వం దిగిపోయే సరికి రూ.90 కోట్లు ఖర్చుచేసి 20 శాతం మాత్రమే ఇళ్లు పూర్తి చేసి.. రూ.69 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో జరిగిన పనులతో కలిపి ప్రస్తుతం 67 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. గతంలో టీడీపీ ఎగ్గొట్టిన 21 కోట్లతో పాటు ఇప్పటి వరకూ జరిగిన పనులకు రూ.270 కోట్లు వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. ఇక టీడీపీ హయాంలో లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులో 10 కోట్లను ఇప్పటికే వీఎంసీకీ తిరిగి ప్రభుత్వం చెల్లించేసింది. మిగిలిన రూ. 5కోట్ల 90 లక్షలు త్వరలో చెల్లించనుంది. అలాగే జక్కంపూడి లే అవుట్ లో 423 కోట్లతో హౌసింగ్, 139 కోట్లతో మౌలిక సదుపాయాలు మొత్తం 570 కోట్ల రూపాయలతో మార్చి నాటికి నిర్మాణాలన్నింటినీ పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని సీఎం జగన్ ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉంది. ఈ వాస్తవాలన్నింటినీ పక్కన పెట్టేసి పబ్లిసిటీ కోసం దేవినేని ఉమ టిడ్కో ఇళ్ల వద్ద నిరసన దీక్ష పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు . డ్రామా చేస్తే నమ్మాలి కదా..! తమ ప్రభుత్వంలోనే ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయిందని.. ఈ ప్రభుత్వం మూడేళ్లైనా ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వడంలో జాప్యం చేస్తోందని బురద జల్లే ప్రయత్నం చేశారు పచ్చ పార్టీ నేత దేవినేని ఉమ. ప్రభుత్వం చెబుతున్నట్లుగా అక్కడ పనులు జరుగుతుంటే.. ఇళ్లు పూర్తైనా ఇవ్వడం లేదంటూ ఈయన నిరసన చేపట్టడం వింతగా ఉందంటూ నిరసనలో పాల్గొనేందుకు వెళ్ళినవారు బాహాటంగానే చర్చించుకున్నారట. తన ఉనికిని కాపాడుకునేందుకు దేవినేని చేస్తున్న ప్రయత్నాలు చూసి సైకిల్ పార్టీ శ్రేణులు తల బాదుకుంటున్నారట. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
అవునా కాదో మీరే తేల్చండి! మౌనం వీడిన బాలీవుడ్ నటి
సాక్షి, ముంబై: దేశంలో 5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇటీవల కోర్టు తీర్పుపై బాలీవుడ్ ప్రముఖ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా ఎట్టకేలకు మౌనం వీడారు. కోర్టు తీర్పు, జరిమానాపై తొలిసారి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పబ్లిసిటీ స్టంట్, కోర్టు సమయం వృధా అంటూ 5జీ టెక్నాలజీ అమలుపై తన పిటిషన్ తిరస్కరించడంపై ఆమె నిరాశ వ్యక్తం చేశారు. అంతేకాదు దీనిపై స్పందించాల్సిన సమయం వచ్చిందని తన పోరాటం ప్రచారం, ప్రాపకం కోసం అవునో కాదో మీరే తేల్చాలని ఆమె పిలుపునిచ్చారు. ఇండియాలో 5 జీ టెక్నాలజీ అమలుకు సంబంధించి రెండు నెలల క్రితం తన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చిన తర్వాత బాలీవుడ్ నటి సోమవారం ఇన్‌స్టాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. మనుషులకు, జంతువులు 5జీ టెక్నాలజీ మొబైల్ టవర్ల దుష్పరిణామాలపై ఎంత సురక్షితమో తెలియజేయాలని ఆర్‌టీఐతోపాటు, వివిధ ఏజెన్సీలను కోరామని, ఆ వివరాలను మీరూ పరిశాలించాలని, ఓపికగా తను షేర్ చేసిన వీడియోలోని అంశాలని గమనించాలంటూ తన 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని వీడియోలో వివరించారు. దేశంలో 5జి మొబైల్ టెక్నాలజీ అమలు, రేడియో ఫ్రీకెన్సీ రేడియేషన్ (ఆర్ఎఫ్) దుష్పరిణామాలపై ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియోలో ప్రస్తావించారు. 5జీ టెక్నాలజీ వల్ల ఇటు చిన్నా పెద్దా, స్త్రీ పురుషులు, పసివాళ్లు, అటు మూగజీవాలకు కూడా సురక్షితమని సర్టిఫై చేస్తూ, తమ వాదనను బలపరచే అధ్యయనాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జుహీ చావ్లా కృషి చేస్తున్నాననీ, 5జీ టెక్నాలజీతో మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న ప్రభావం కంటే 10 నుంచి 100 రెట్ల అధిక ప్రభావం పడుతుందని జూహీ చావ్లా వెల్లడించారు. ఈ కేసులో జుహీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు 20 లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Juhi Chawla (@iamjuhichawla) -
పోలవరం ఒక త్రిశంకు స్వర్గం?
పిచ్చి కుదిరింది తలకు రోకలి చుట్టు అన్నాడొకాయన. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని భ్రమింపచేస్తూ 48 గేట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టులో 1 గేటు పెట్టి ప్రాజెక్టు పూర్తి అయిపోయిందన్న భ్రమ కల్పించి బాహుబలి సినిమాను తలదన్నేలా గ్రాఫిక్స్‌ను చూపించి ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు. కనీసం ఒక్క గేటు అమర్చటానికి 2 నెలలు పడుతుంది. మిగిలిన 47 గేట్లు పెట్టడానికి ఎంత సమయం పడుతుందో మనకు తెలుస్తుంది. పోలవరం అంచనాలను తనకు కావలసిన రీతిలో పెంచుకొని ప్రాజెక్టును 58 వేల కోట్లకు పెంచేశారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తి అయిపోయాయని ప్రకటనలు చేస్తున్నారు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఇక 40 శాతమే మిగిలింది. చంద్రబాబు వేసిన అంచనా ప్రకారం 58 వేల కోట్ల ప్రాజెక్టు 60 శాతం పూర్తి అయిందని చెబుతున్నారు. వారి లెక్కల ప్రకారం ఇంకా 23 వేల కోట్లు పని మాత్రమే మిగిలింది. నిజానికి 11,500 కోట్లు మాత్రం ఇప్పటివరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. దానిలో వై.ఎస్.ఆర్. హయాంలో దాదాపు 5,500 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 6 వేల కోట్లు కేంద్రం యిచ్చిన కేటాయింపు, ఈ తక్కువ మొత్తంతోనే 60 శాతం పని ఎలాపూర్తి చేస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. పోలవరం ప్రాజెక్టు నుంచి 2019 మే నెలలో నీరు ఇస్తాననడం ఎడారిలో ఎండమావి లెక్కే. కాపర్‌డ్యామ్ ఎత్తు 31 మీటర్లు అని ముందు అంచనా కాని ఇపుడు 41 మీటర్లు పెంచడం ప్రమాదకరం అని నిపుణులైన ఇంజనీర్లు చెబుతున్నారు. ఎందుకంటే కాపర్‌డ్యామ్ అనేది తాతాల్కిక అడ్డుకట్ట. కేవలం ఎర్త్ కమ్ రాక్పిల్ డ్యామ్ నిర్మించి స్పిల్‌వే ద్వారా నీటిని మళ్లించడానికి కాపర్డ్యామ్ను నిర్మిస్తారు. అలాగే ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌కి దిగువకూడా కాపర్‌డ్యామ్ కడతారు. 41 మీటర్లు ఎత్తు పెంచి దాని ద్వారా వచ్చే నీరు కాలువకు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి అయిందనే భ్రమ కల్పించడానికి చేస్తున్న ఎత్తుగడ ఇది. గోదావరిలో ఎక్కువ నీటి ప్రవాహం వస్తే కాపర్‌డ్యామ్ కొట్టుకొనిపోవడం ఖాయం. 31 మీటర్ల ఎత్తులో అయితే కాపర్‌డ్యామ్ కొట్టుకుపోయినా ప్రమాదం తక్కువ. అది 41 మీటర్లు కడితే ప్రమాదం జరిగితే అది గోదావరి గట్టు కంటే 5 మీటర్ల ఎత్తుకు నీరు ప్రవహించి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు వరదల ప్రమాదం ఏర్పతుంది. ఇవన్నీ ఆలోచిస్తే పోలవరం ఇప్పట్లో పూర్తి అవుతుందనేది భ్రమ. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎండాకాలంలో కాపర్‌డ్యామ్ కొట్టుకుపోయింది. తక్కువ ఎత్తు కావటం వలన క్రింద ప్రాంతానికి పెద్దగా నష్టం జరగలేదు. కానీ 41 మీటర్ల ఎత్తు కట్టబోతున్న పోలవరం కాపర్‌డ్యామ్ వర్షాకాలంలోగాని కూలిపోతే ఉభయగోదావరి జిల్లాలు మునగడం ఖాయం. ప్రాజెక్టులో అవినీతికి అంతులేకుండా పోయిందని కాగ్ చెప్పినప్పటికీ కేంద్రం దానిపై ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడం చూస్తే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా అనుమానించవలసిన పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రజల స్పందన చూసిన చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టి ఎలాగైనా గెలవాలని తాపత్రయంతో ఈ గ్రాఫిక్స్ చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మేస్థితిలో లేరు. ఏదిఏమైనా పోలవరం బాబుకు ఒక పాడి ఆవులాగ ఉంది. పునరావాస ప్యాకేజీలో జరుగుతున్న అక్రమాలకు అంతులేదు. ముంపు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూముల పరిహారం సైతం పచ్చచొక్కాలకు అందచేసిన మోసాలు, ఇలాంటి ఎన్నో రకాల మోసాలు చేస్తూ అధినాయకుడు నుంచి కింది నాయకుల వరకు చేస్తున్న అవినీతికి అంతులేకుండా పోయింది. ప్రాజెక్టులో జియోలాజికల్ సర్వే, సి.డబ్లు్య.సి ఇచ్చి మార్గదర్శకాలను తుంగలో తొక్కుతున్న వైనం చూస్తే ప్రాజెక్టులను ఎటువైపునకు తీసుకొని వస్తారో అని భయాందోళనలతో ప్రజలు వున్నారు. 2018లో పోలవరం పూర్తి అవుతుందని రాసుకో జగన్ అని పిచ్చికూతలు కూసిన సాగునీటిశాఖ మంత్రి ఇప్పుడు నిస్సిగ్గుగా 2019లో ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పడం చూస్తే వారి అవగాహన ఏ మేరకుందో తెలుస్తుంది. ప్రతిపనికి ఒక శంకుస్థాపన, ఒక గ్రాఫిక్‌తో ప్రజలను మభ్యపెట్టడం, ఎన్నికలలో ప్రజలను డబ్బుతో కొనేయవచ్చుననే భ్రమలో ఉన్నాడు. పోలవరం నాణ్యతా ప్రమాణాల విషయంలో ప్రాజెక్టు అ«థారిటీ బీటలువారిన స్పిల్‌వేను చూపిం చినా, ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాగ్ ఆధారాలతో చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టుంది. ఒక రోడ్డు వేసిన 21 రోజుల తరువాత, లోడ్ టెస్టింగ్ అనేది చెయ్యటం పరిపాటి, ఇంత పెద్ద ప్రాజెక్టుకి కాంక్రీటు వేసిన తరువాత కనీసం ప్రామాణిక పరీక్ష చెయ్యకపోవటం, మార్గదర్శకాలను పాటిం చకపోవటం ప్రాజెక్టుకే ప్రమాదంగా మారింది. ఇప్పటికైనా జిమ్మిక్కులు మాని, ప్రాజెక్టును నాణ్యతాప్రమాణాలతోను, సి.డబ్లు్య.సి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి మార్గదర్శకాలను అమలు చేస్తూ ప్రాజెక్టు నిర్మించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. -కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త రాష్ట్ర నీటి సంఘాల అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మొబైల్ : 94402 04323 -
విజయవాడ పశ్చిమ టీడీపీలో ముసలం
-
అంకెల గారడీ... అదే సంక్షేమం!
శ్వేతపత్రాల విడుదలతో తలమునకలుగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ కార్యక్రమాలకు కూడా దేశంలో తానే నంబర్ వన్ అని ఘనంగా తనను తాను పొగిడేసుకున్నారు. తెలంగాణతో సహా మరే రాష్ట్రంలోనూ మరే ముఖ్యమంత్రీ చేయనన్ని సంక్షేమ చర్యలు తన హయాంలో జరిగాయని, తన ప్రభుత్వం చేపట్టిన పథకాల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి చెందుతున్నట్లు చెప్పుకున్నారు. కానీ నాలుగున్నరేళ్ల బాబు పాలన తర్వాత చూస్తే బడ్జెట్ పేరిట అంకెల గారడీ తప్ప నిజమైన సంక్షేమం ఏపీలో గాలికి కొట్టుకుపోయిందని గణాంకాలు వివరిస్తున్నాయి. రుణమేళాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు, నిరుద్యోగ భృతి, బీసీ ఉపప్రణాళిక, ఎస్సీ ఉపప్రణాళిక, ఎస్టీ సబ్‌ప్లాన్ అన్నీ దగాకోరు చర్యలుగా మిగిలిపోయాయి. సంక్షేమంపై చెప్పిందే పదేపదే చెబుతూ ప్రజలకు ఎంతో చేశానని మెప్పుపొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ గత ప్రభుత్వాలు అమలు చేసినవే. ఈయన కొత్తగా చేసిందేమీ లేదు. 70 పేజీల శ్వేత పత్రంలో చెప్పిందే మళ్లీ చెప్పుకొచ్చారు. ఐదు సంవత్సరాల బడ్జెట్ అంకెలు చూపించి అదే సంక్షేమం అంటున్నారు.. స్కాలర్‌షిప్‌ల పంపి ణీలో తెచ్చిన మార్పేమీలేదు. సంక్షేమ హాస్టళ్లు రద్దుచేసి ఘోర తప్పిదం చేశారు. కొత్త రెసిడెన్సియల్ స్కూళ్లంటూ పచ్చి అబద్ధం ఆడుతున్నారు. నిరుద్యోగ భృతిని సీఎం ఎన్నికల ఎరగా ప్రారంభించారు. మూడేళ్లుగా రుణాల పంపిణీనే జరగకున్నా ఎన్నికల సందర్భంగా రుణమేళాలంటూ ప్రత్యేక సభలు పెడుతున్నారు. రుణాల పంపిణీ ఓ మాయ నాలుగున్నర ఏళ్ళలో రుణాల పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదు. మొదటి సంవత్సరం అసలు పట్టించుకోలేదు. ఈ మూడు సంవత్సరాలు కలిపి మెగా రుణమేళాల పేరుతో సభలు పెట్టి ఇప్పుడు హడావుడి చేస్తు న్నారు. ఒక్కో రుణమేళాలో లక్ష మందికి రుణాలు ఇస్తామని చెబుతు న్నారు. గత నెల 12, ఈనెల 6న రుణమేళాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిం చారు. ఈనెల 28న విశాఖపట్నంలో మూడో రుణమేళాను ప్రారంభిస్తా మని సీఎం సెలవిచ్చారు. 2016–17లో అన్ని కార్పొరేషన్లు, ఫెడరేష న్ల నుంచి 92,199 మందికి రూ.1,111.93 కోట్లు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. 2017–18లో 82,741 మందికి రూ.1,193.54 కోట్లు రుణంగా ఇవ్వాల్సి ఉండగా వాటిని పెండింగ్‌లో ఉంచారు. 2018–19 సంవత్సరానికి అన్ని కార్పొరేషన్లు, బీసీ ఫెడరేషన్ల నుంచి 3,52,793 మందికి రూ.6,643.90 కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 10 శాతం రుణాలు కూడా లబ్ధిదారులకు అందలేదు. 2016– 17, 2017–18 ఆర్థిక ఏడాదిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు ఈ ఆర్థిక ఏడాదిలో నిర్వహిస్తున్న భారీ రుణమేళాల్లో సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెపుతోంది. ఈ ఆర్థిక ఏడాదిలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి కేవలం 8 శాతం మందికి మాత్రమే రుణాలు అందాయి. నాలుగున్నరేళ్లుగా కళ్లు మూసుకొని పేదలకు ఆర్థిక సాయం అందించడంలో ఘోరంగా విçఫలమైన ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ఎరగా మాత్రమే ఈ మేళాలు నిర్వహిస్తున్నది. సంక్షేమ హాస్టళ్ల రద్దు ఘోరం సంక్షేమ హాస్టళ్లను రద్దు చేసి ప్రభుత్వం ఘోర తప్పిదం చేసింది. ఎస్సీ సంక్షేమ శాఖలో 648 సంక్షేమ హాస్టళ్లు రద్దు చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న మొత్తం 298 హాస్టళ్లను రద్దుచేసింది. ఎస్సీ సంక్షేమ శాఖలో రద్దయిన హాస్టల్ విద్యార్థులను ప్రస్తుతం ఉన్న గురుకుల స్కూళ్లలోనే విలీనం చేశారు. దీంతో సుమారు 20 శాతం మంది విద్యార్థులు అంటే సుమారు 15 వేల మంది చదువులు మానేశారు. ఈ విషయాన్ని ఉన్నతా ధికారులు స్వయంగా అంగీకరిస్తున్నారు. ఇక గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న 298 హాస్టళ్లను రద్దుచేసి వాటి స్థానంలో కొత్తగా 80 గురుకుల స్కూళ్ళు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతున్నది. బోర్డులు మాత్రం గురుకుల స్కూళ్లు అని ఉంటున్నాయి. అక్కడ రద్ద యిన సంక్షేమ హాస్టళ్ళ భవనాల్లోనే కనీస వసతులు లేకుండా చదువులు కొనసాగిస్తున్నారు. ఇక్కడ వీరికి తరగతి గది, పడకగది ఒక్కటిగానే ఉంది. బీసీ సంక్షేమంలోనూ 400 హాస్టళ్లు రద్దు చేశారు. వీరిని కూడా ప్రస్తుతం నడుస్తున్న గురుకుల స్కూళ్లలో చేర్పించినట్లు చెబుతున్నా 25 శాతం మంది బడిమానివేశారు. ఇంటికి దగ్గరలో తల్లిదండ్రులకు చేదో డుగా ఉంటూ హాస్టళ్లలో చదువును కొనసాగిస్తున్న పేద విద్యార్థులకు ఇది శరాఘాతంగా మారంది. బీసీ విద్యార్థుల కోసం 61 కొత్త గురుకుల స్కూళ్లు మంజూరు చేస్తున్నట్లు చెబుతున్నా కాగితాలకే పరిమితమైంది. నిరుద్యోగులను మభ్యపెట్టే యత్నం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల హామీలను పట్టించుకోని సీఎం ఎన్నికలు సమీపిస్తుండటంతో రెండు నెలల క్రితం సీఎం యువ నేస్తం పేరుతో నిరుద్యోగులకు భృతి ఇస్తున్నట్లు ప్రకటించారు. నెలకు రెండు వేలు ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఇప్పుడు వెయ్యి రూపాయ లకు కుదించారు. మొత్తం 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని లెక్కలు చెప్పిన సీఎం చివరకు లక్షన్నరకు పరిమితం చేశారు. ప్రస్తుతం 3 లక్షల మందికి భృతి ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబు తున్నది. ఇస్తున్నది మాత్రం 1.70 లక్షల మందికేనని నిరుద్యోగులు చెబుతున్నారు. ఉన్న పథకాలకు కొత్త రంగులు పెళ్ళి కానుక పథకం గతంలో అమలైనదే. గిరిపుత్రిక కళ్యాణ పథకం పేరుతో గిరిజనులకు పెళ్లి కానుక ఇచ్చేవారు. ఇది కూడా ఎన్నికలకే ముడిపెట్టాడు. నాలుగు నెలల నుంచి ఎస్సీ, బీసీ, విభిన్న ప్రతిభావం తులు, మైనార్టీలకు కూడా అమలు చేస్తున్నామని చెబుతూ సవాలక్ష ఆంక్షలు పెట్టారు. చివరకు ఎంపిక చేసే వ్యవహారాన్ని కూడా డ్వాక్రా గ్రూపులకు అప్పగించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం సాయం చేసింది పెళ్ళి కానుక కింద రూ.139.25 కోట్లు మాత్రమే. దీనిని అన్ని వర్గాల పేదలకు ఉదారంగా సాయం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. డప్పు కళాకారులకు నెలకు రూ. 1,500 పింఛన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదు. చెప్పులు కుట్టే వారికి నెలకు రూ.1000 పింఛన్ ఇస్తామని, ముడి సరుకులు కొనుగోలు చేసేందుకు సాయం అందిస్తా మని చెప్పారేగాని ఇంతవరకు పట్టించుకోలేదు. ఇంకా పాలసీలు తయారు చేసే పనిలోనే ఉన్నట్లు సర్కారు వల్లెవేస్తోంది. దళిత క్రిస్టియన్లకు మోసం దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇప్పిస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. శ్వేతపత్రం విడుదలలో దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా వచ్చేవరకు పోరాడతానని సెలవిచ్చారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా అంబే డ్కర్ సూక్తులు ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు కావస్తుంటే అమరావతి కేంద్రంగా స్మృతివనం నిర్మిస్తామని ఇప్పటికి రెండు బడ్జెట్లలో రూ.100 కోట్లు చొప్పున కేటాయించి మురిగిపోయేలా చేశారు. 2017 ఏప్రిల్ 14న స్మృతివనం నిర్మాణానికి బౌద్ధ భిక్షువులను పిలిపించి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఆ తరువాత పట్టించుకోలేదు. తిరిగి 2018 ఏప్రిల్ 14న మరోసారి భూమి పూజ చేశారు. గ్రాఫిక్ల్లో మాత్రం భూతల స్వర్గాన్ని చూపించారు. ఇప్ప టికీ ఇటుకరాయి పడలేదు. ‘ఆదరణ’ ఓ నిరాదరణ ఆదరణ పథకం కేవలం ఎన్నికల ఎత్తుగడ మాత్రమే. నాలుగు రుణ మేళాల్లో నాలుగు లక్షల మందికి ఆదరణ పథకం కింద వస్తువులు అంది స్తామని సెలవిచ్చారు. 7.49 లక్షల మంది వస్తువుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు అర్హులైన వారు 2,00,000 మందిగా తేల్చారు. అయితే ఇప్పటి వరకు కనీసం 50 వేల మందికి కూడా వస్తువులు అందించలేదు. ఈ వస్తువులతో ఆర్థిక స్థితి మెరుగుపడేది లేదని వస్తు వులు తీసుకున్న వారే చెబుతున్నారు. వస్తువులు కూడా నాసిరకంగా వుంటున్నాయి. తీసుకున్న రోజే పనికి రాకుండా పోతున్నాయని లబ్ధి దారులు చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అస్తవ్యస్థం జ్ఞానభూమి ద్వారా స్కాలర్షిప్లు ఎంతో మెరుగ్గా పంపిణీ చేస్తున్నా మని చెబుతున్న సీఎం అసలు విషయాన్ని గుర్తించడం లేదు. సాంక్షన్ వేరు, రిలీజ్ వేరు, గ్రౌండింగ్ వేరనే విషయాలను బయటకు చెప్పడం లేదు. ఈ సంవత్సరం ఇంతవరకు కాలేజీల అకౌంట్స్‌లోకి స్కాలర్షి ప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ జమకాలేదు. ఎంతో మంది విద్యార్థులు గత సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీలకు అందక సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి ఉంది. 15 లక్షల మంది విద్యార్థులకు పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.2500 కోట్లు అందిం చాల్సి ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి పలు వేదికలపై నెలనెల స్కాలర్షిప్లు ఇస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థి అడ్మిషన్ తీసుకోగానే కాలేజీకి ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఈ హామీ నెరవేరలేదు. గత సంవత్సరం మేనెలలో జ్ఞానభూమి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇప్పటికి కూడా వెబ్సైట్ బాలారిష్టాలు దాటలేదు. నిత్యం ఏదో ఒక ఎర్రర్ చూపిస్తూనే ఉంది. బీసీ ఉప ప్రణాళిక ఓ మోసం బీసీ ఉప ప్రణాళిక కింద ఏడాదికి రూ. 10 వేల కోట్లు బడ్జెట్లో ఐదేళ్లుగా కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉప ప్రణాళికకు చట్ట బద్ధత లేదు. బడ్జెట్లో నిధులు కేటాయింపు అబద్ధం. కాగితాల్లో మాత్రమే ఉంది. బీసీ ఏరి యాల్లో ఎంత మొత్తం ఖర్చుపెట్టారో లెక్కలు వేసి దానిని బీసీ సబ్‌ప్లాన్ కింద ఖర్చుపెడుతున్నట్లుగా చూపిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికా రుల వద్ద అసలు సబ్‌ప్లాన్ వివరాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. దీనిపై ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించిన దాఖ లాలు లేవు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు పర్సెంటేజీల పనులకే... ఎస్సీ ఉప ప్రణాళిక కింద అయిదు బడ్జెట్ల వివరాలు పరిశీలిస్తే భారీ స్థాయిలోనే ఖర్చుపెట్టారు. అయితే కేవలం పర్సెంటేజీలు వచ్చే పనులకే ఖర్చుచేశారు. దాదాపు పనులన్నీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా రోడ్లు, డ్రైనేజీ కాలువల కోసం ఖర్చుచేశారు. నిజానికి ఈ నిధులు ఎస్సీల జీవనోపాధులకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. నాలుగేళ్లలో 88.22 శాతం నిధులు ఖర్చు చేశారు. ఈ నిధులన్నీ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల జేబులు నింపడానికి తప్ప పేదలైన ఎస్సీలకు ఉపయోగ పడలేదు. ఎస్టీ సబ్‌ప్లాన్‌లోనూ ఇదే పరిస్థితి నాలుగు సంవత్సరాల్లో ప్రాథమిక రంగానికి రూ.769.46 కోట్లు, సామా జిక రంగానికి రూ. 3554.22 కోట్లు, మౌళిక సదుపాయాల రంగానికి రూ. 2106.33 కోట్లు, జీవనోపాధుల రంగానికి రూ. 3274.99 కోట్లు ఖర్చు చేశారు. అంటే జీవనోపాధులకు కేవలం 30 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. అసలు సబ్‌ప్లాన్ నిధులన్నీ జీవనోపాధులకే ఖర్చు చేయాలని చట్టం చెబుతున్నది. -జీపీ వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి -
ఎందుకూ కొరగాని ఆర్టీజీఎస్!
దేశంలో ఏ ముఖ్యమంత్రీ ప్రకటించుకోవడానికి సాహసించని ధోరణి ప్రదర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సాగిస్తున్న డాంబిక ప్రచారానికి అడ్డూ ఆపూలేకుండా పోతోంది. అన్నీ తానే సాధించినట్లు, అభివృద్ధికి తానే బ్రాండ్ పేరు అన్నట్లుగా నిత్యం ప్రచార మోతలో మునుగుతున్న బాబు రియల్ టైమ్ గవర్నెన్స్ అనే భావనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది తాను కనిపెట్టిన అద్భుత సాధనంగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కావడం తప్ప ఉపయోగం లేదని ఏపీ ప్రభుత్వంలోని అత్యంత సీనియర్ అధికారులే చెబుతున్నారు. ప్రభుత్వ శాఖలు ఇచ్చే నివేదికలను ఆర్టీజీ నివేదికలతో పోల్చి సరిచూడడం వల్ల యంత్రాంగంలో అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వం విని యోగించని టెక్నాలజీతో రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నానని చంద్రబాబు చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నా ఆచరణలో మాత్రం గడప దాటడంలేదు. తన పాలన ప్రపంచానికే ఆదర్శమని, తాను చేసే అన్ని కార్యక్రమాలు చారిత్రాత్మకమని, గుప్తులకాలం స్వర్ణయుగమైతే ఇప్పటి తన హయాం అంతకు మించిపోయిందని చెబుతున్న అతిశయాలు కాగితాల్లోనే కనిపిస్తున్నాయి. రియల్‌టైమ్ గవర్నెన్స్, ఈ–ప్రగతి ప్రజలకు అంతుబట్టని మిథ్యగా మారిపోయింది. సుపరిపాలన పేరుతో ఆయన విడుదల చేసిన శ్వేతపత్రంలో అంతా భ్రాంతే తప్ప వాస్తవం అణుమాత్రమైనా గోచరించడంలేదు. అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉన్నాయని ప్రకటించుకున్నా నాలుగున్నరేళ్లలో జరిగిన అనేక ఘటనలు శాంతిభద్రతల వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్)ను తాను కనిపెట్టిన ఒక అద్భుత సాధనంగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నా దానివల్ల కోట్ల రూపాయల ప్రజాధానం వృధాయే తప్ప ఉపయోగం లేదని పలువురు సీనియర్ అధికారులు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. పరిష్కార వేదిక ఒక బోగస్ ‘ఆర్టీజీఎస్’ను ఒక ప్రభుత్వ శాఖగా ఏర్పాటుచేసి మిగిలిన శాఖలన్నింటిపైనా దానికి పెత్తనం ఇవ్వడంతో ప్రభుత్వ యంత్రాంగంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ శాఖలు ఇచ్చే నివేదికలను ఆర్టీజీఎస్ నివేదికలతో పోల్చి సరిచూడడం వల్ల యంత్రాంగంలో అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. మిగిలిన శాఖలన్నింటికీ సమాం తరంగా చంద్రబాబు ఆర్టీజీఎస్‌ని ప్రోత్సహిస్తుండడంతో ఆయా శాఖల స్వతంత్రత దెబ్బతింటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆర్టీజీఎస్‌లోనే పరిష్కార వేదిక పేరుతో 1100 కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి అందులో రెండు వేల మందికిపైగా ఆపరేటర్లను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. 2017 నవంబర్‌లో ఇది ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకూ 1,72,11,367 ఫిర్యాదులు రాగా అందులో 1,41,92,898 పరిష్కారమైనట్లు ప్రకటించారు. కానీ ఇదంతా బోగస్ అని అధికారవర్గాలే చెబుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మచిలీపట్నం రూరల్ మండలానికి చెందిన ఒక వ్యక్తి తమ గ్రామంలో రోడ్డు వేయాలని కోరితే ఆర్టీజీఎస్ దాన్ని గ్రామీణ నీటిసరఫరా విభాగానికి పంపింది. ఆ పిటీషన్ వివిధ దశల్లో తిరిగి చివరికి ప్రస్తుతం నిధుల్లేవు, ఉన్నప్పుడు రోడ్డు వేస్తామనే సమాధానంతో ముగిసింది. సంబంధిత అధికారి ఇదే విషయాన్ని ఆర్టీజీఎస్ సైట్లో అప్లోడ్ చేస్తే అక్కడి నుంచి మీ సమస్య విజయవంతంగా పరిష్కారమైనట్లు పిటీషన్ పెట్టిన వ్యక్తికి మెసేజ్ వచ్చింది. ఇళ్ల నిర్మాణం, భూసమస్యల ఇతర అంశాలపై వచ్చే ఫిర్యాదుల్లో 90 శాతం ఇలాగే అధికారుల సమాధానంతోనే పరిష్కారమైనట్లు చూపిస్తున్నారు. విజయవాడలోని ఒక మాల్లో సినిమాకు వెళ్లిన కొందరు మిత్రులు అక్కడి కౌంటర్లలో తినుబండారాల ధరలు సాధారణ రేట్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తే కాల్‌సెంటర్ నమోదు చేసుకోవడానికే అరగంటకు పైగా విసిగించడంతో వారు వదిలేశారు. దీంతో పరి ష్కార వేదిక ఒక బోగస్ అనే అభిప్రాయం ఉద్యోగుల్లోనే స్పష్టంగా ఏర్పడిపోయింది. సంతృప్తి సర్వేలు సొంతానికి ఆర్టీజీఎస్ చేస్తున్న సంతృప్తి సర్వేలు ప్రభుత్వ పెద్దల అవసరానికే తప్ప ప్రజల కోసం కాదని స్పష్టమవుతోంది. రెండు వేల మందికి పైగా ఆపరేటర్లతో ఏర్పాటైన కాల్ సెంటర్ నుంచి ప్రతిరోజూ 15 లక్షల మందికి ఫోన్లు చేసి ప్రభుత్వ పథకాలపై సంతృప్తిగా ఉన్నారా, లేదా అని వివిధ రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఇవికాకుండా మరో 15 లక్షల ఐవీఆర్ఎస్ కాల్స్‌తో ఈ సర్వేలు చేస్తున్నా అవన్నీ రాజకీయ ప్రయోజనాల కోణంలోనే సాగుతున్నాయి. వీటి ఆధారంగానే ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లో ఇంత సంతృప్తి స్థాయి ఉందని, ఇంకా పెరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిజానికి ఈ సర్వేలను అధికారులే నమ్మడంలేదు. ముఖ్యమంత్రి వాయిస్‌తో వెళ్లే ఆర్టీజీఎస్ ఫోన్ కాల్స్‌ను 40 శాతం మందికిపైగా జనం తిరస్కరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కాల్ సెంటర్ ఫోన్‌రాగానే మెజారిటీ జనం కట్ చేస్తున్నట్లు ఆర్టీజీ వర్గాలే వాపోతున్నాయి. అంటే ఈ సర్వేలపై ప్రజల్లో నమ్మకం లేకపోగా విసుగుపుడుతోందని అర్థమవుతోంది. ప్రజలు ముఖ్యమంత్రిని నేరుగా సంప్రదించే కైజలా యాప్స్‌ను అభివృద్ధి చేశామని మొదట్లో గొప్పలు చెప్పిన ఆర్టీజీఎస్ అది విఫలమవడంతో దాని ఊసే ఎత్తడంలేదు. ఆర్టీజీఎస్, ఏపీ ప్రభుత్వం ఉపయోగిస్తున్న సాంకేతికతపై నీతి ఆయోగ్ పెదవి విరిచింది. నీతి ఆయోగ్ నివేదికలో ఏపీ దేశంలో నాలుగో స్థానంలో ఉందని ప్రకటించుకున్నా అదే నీతి ఆయోగ్ ఏపీ ప్రభుత్వం చేస్తున్న సర్వేలు బూటకమని కొట్టిపారేసింది. తమకు తామే సర్వేలు చేసుకుని చంకలు గుద్దుకోవడం ఏమిటనే ప్రశ్నకు రాష్ట్రం నుంచి సమాధానం కరువైంది. తుఫాను హెచ్చరికల పాత్రతో కామెడీ వాతావరణ కేంద్రం తుఫాను హెచ్చరికలను జారీ చేసే ప్రక్రియను కూడా ఆర్టీజీఎస్ హైజాక్ చేసింది. ఇటీవల పెథాయ్ తుఫానును కచ్చితంగా అంచనా వేశామని ఇది తమ సమర్థతకు నిదర్శనమని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు కొద్దిరోజుల ముందు వచ్చిన తిత్లీ తుఫానునూ తాను నియంత్రించినట్లు చెప్పారు. చంద్రబాబు ఆయన పరివారం ఎంత హడావుడిగా తిరిగినా తిత్లీ తుఫాను వల్ల తీవ్ర నష్టం ఏర్పడింది. ఈ హడావుడి వల్ల సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడగా నష్టపరిహారం చెల్లింపులు సక్రమంగా జరగలేదు. పెథాయ్ తుఫాను బాధితులకు 25వ తేదీకల్లా పరిహారం అందిస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పినా ఇంతవరకూ బాధితులకు సాయం అందలేదు. విపత్తులు వచ్చినప్పుడు వాటి గురించి హెచ్చరించే యంత్రాంగాలు ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నాయి. చంద్రబాబు మాత్రం వీటిని తాను కొత్తగా కనుగొన్నట్లు ప్రచారం చేసుకుంటూ తుఫాను ఎంత వేగంతో ప్రయాణిస్తుంది, ఎక్కడ తీరం దాటుతుంది, ఏ ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం చెప్పే విషయాలను చెబుతూ కామెడీ చేస్తుండడం అధికారులను నివ్వెరపరుస్తోంది. పిడుగులు ఎక్కడ పడతాయో ముందే చెబుతామంటూ హడావుడి చేసి కొద్దిరోజులు షో చేసినా పిడుగుపాటు మరణాలను ఆపలేకపోయారు. తాను కనిపెట్టిన టెక్నాలజీతో తుఫానుల వల్ల పంటలు దెబ్బతినకుండా కాపాడానని, రైతులను హెచ్చరించానని, మత్స్యకారులను కాపాడానని చెబుతున్నా అవన్నీ ఉత్తిదే అని పలుసార్లు స్పష్టమైంది. ఇటీవల పెథాయ్ తుఫాను సందర్భంగా కాకినాడ తీరంలో మత్స్యకారుల పడవ గల్లంతైంది. ముందే హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేస్తే వారి బోటు ఎందుకు తుఫానులో చిక్కుకుందనే దానికి ఆర్టీజీఎస్ నుంచి సమాధానం కరువైంది. ప్రజలకు దూరంగా మీ–సేవ మీ–సేవ ద్వారా అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్లైన్లోనే అందిస్తున్నట్లు చేస్తున్న ప్రచారంలోనూ వాస్తవం కనిపించడంలేదు. 37 శాఖలకు చెందిన 196 ప్రభుత్వ సేవలను మీ–సేవ పరిధిలోకి తెచ్చినా అందులో ప్రజలకు అందుబాటులో ఉన్నవి పదిలోపే. ఈ సేవలను వినియోగించుకుందామని వెళ్లిన జనానికి సర్వర్ల డౌన్ అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. సర్వర్ల సమస్యతోనే మీ–సేవ చాలా వరకూ విఫలమైంది. వాటి సంఖ్యను 3,506 నుంచి 11835కి పెంచినా సర్వర్ల సమస్యకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ–ప్రగతి పేరుతో 76 సర్వీసులను కంప్యూటరీకరించినా వాటివల్ల ఉపయోగంలేదు. ప్రధానంగా రెవెన్యూ శాఖలో భూదార్‌ను ప్రవేశపెట్టినా ప్రజలు ఇంకా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తోంది. ఆన్లైన్లోనే అంతా జరిగిపోతుందని ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితికి చాలాతేడా కనిపిస్తోంది. ఈ–ప్రగతి ఎటువంటి ప్రయోజనం కనిపించలేదని చెబుతున్నారు. గతం నుంచి ఉన్న సౌకర్యాలే తప్ప కొత్తగా ఇ–ప్రగతి ద్వారా సాధిం చింది పెద్దగా ఏమీ లేదని చెబుతున్నారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు మద్యం బెల్టు షాపులు రద్దు చేసే ఫైలుపై సంతకం చేసినా అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బెల్టు షాపుల్ని మొత్తం నిర్మూలించామని, సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ప్రకటించినా అదంతా అవాస్తవమనేది బహిరంగ రహస్యం. మద్యం అమ్మకాల్లో రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించింది. చంద్రబాబు అధికారంలోకొచ్చే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల వరకు బెల్టు షాపులుంటే, ఇప్పుడు ఈ సంఖ్య 60 వేలకు చేరిందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం షాపులుంటే, వీటికి అనుబంధంగా 40 వేలకు పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఏడాదికి మద్యం, బీరు అమ్మకాలు మొత్తం కలిపి రూ.17,291 కోట్ల మేర జరుగుతున్నాయి. ఇందులో బెల్టు దుకాణాల వ్యాపారం రూ.9 వేల కోట్లకు పైగా అంటే సగంకు పైగా మద్యం వ్యాపారం బెల్టు షాపుల ద్వారానే జరుగుతోంది. పుష్కరాల్లో ప్రచార యావ.. 29 మంది మృత్యువాత చంద్రబాబు ప్రచార యావతో 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు గోదాట్లో కలిసిపోయాయి. దీనిపై వేసిన సోమయాజులు కమిషన్ మూడేళ్ల తర్వాత ఇచ్చిన నివేదికలో వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేసింది. కృష్ణా నదిలో 2017 నవంబర్‌లో జరిగిన పడవ బోల్తా ఘటనలో ఏకంగా 22 మంది ప్రాణాలు నీటిపాలయ్యాయి. విశాఖ మన్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యే, టీడీపీ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేయడంలో భద్రతా వైఫల్యం, నిఘా నీరుగారిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి. అతిపెద్ద ఆర్థిక కుంభకోణంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు పోలీసుల మెడకు చుట్టుకున్నాయి. నిజాయితీగా విధులు నిర్వర్తించిన మహిళా తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడిచేíసినప్పటికీ ఆమెకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పక్షపాతం చూపింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడటంతోపాటు ఆయన గన్‌మెన్‌పై దౌర్జన్యం చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై కేసు నమోదు చేయకపోగా కనీసం క్రమశిక్షణ చర్యలు లేవు. శాంతిభద్రతల అదుపులో ఘోర వైఫల్యం రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉందని, ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేస్తున్నా నాలుగున్నరేళ్లుగా చోటుచేసుకున్న అనేక ఘటనలు శాంతిభద్రతల వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, ఆర్థిక నేరాల సంఖ్య పెరిగిపోయింది. జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం మహిళలపై రాష్ట్రంలో 2016లో 16,362 నేరాలు జరగ్గా 2015లో 15,967 నేరాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో ఏపీ దేశంలోనే 4.9 శాతంతో 8వ స్థానంలో ఉంది. మహిళల అక్రమ రవాణాలోను రాష్ట్రం ఏడవ స్థానంలో ఉంది. ఎస్సీలపై జరిగిన నేరాల్లో ఐదు, ఎస్టీలపై నేరాల్లో నాలుగు, ఆర్థిక నేరాల్లో పది, సైబర్ నేరాల్లో ఆరవ స్థానంలో ఉంది. మొత్తం నేరాలన్నింటిలో ఏపీ 13వ స్థానంలో ఉంది. రాష్ట్రమంతటా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను మట్టుపెట్టడం, వారిపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్న చెరుకులపాడు నారాయణరెడ్డిని 2017 మే నెలలో పెళ్లికి వెళ్లి వస్తుండగా కాపుకాసిన ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి్డపై జరిగిన హత్యాయత్నం కేసును ఏపీ పోలీసులు నీరుగార్చారన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఈ ఏడాది అక్టోబర్ 23న కత్తితో హత్యాయత్నం చేసిన ఘటనలో పోలీసులు, ప్రభుత్వం స్పందించిన తీరు ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కుట్ర కోణం వైపు దృష్టి పెట్టకుండా నిందితుడు శ్రీనివాసరావు చుట్టూనే దర్యాప్తును పరిమితం చేయడం అనుమానాలకు తావిచ్చింది. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో కుట్ర కోణాన్ని వెలికితీయాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పని పరిస్థితైంది. ప్రత్యేక హోదా కోసం 2017 జనవరి 26న విశాఖలో తలపెట్టిన కొవ్వొత్తుల నిరసనకు సంఘీభావంగా వెళ్లిన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని విమానాశ్రయం రన్‌వే పైనే అడ్డుకున్న పోలీసుల తీరు వివాదాస్పదమైంది. అమరావతిలో 2017 ఫిబ్రవరిలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటుకు హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే దౌర్జన్యంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తీసుకెళ్లి నిర్బందించారు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ఇంటి నుంచి బయటకు రాకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి, తదితర పలువురు నేతలతోపాటు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణలను పలుమార్లు గృహ నిర్బంధాలు, అరెస్టులు చేసిన తీరు విమర్శలకు తావిచ్చింది. ముఖ్యమంత్రి వస్తున్నారంటే అక్కడ ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, బాధితుల ముందస్తు అరెస్టులు, కేసులను పరిపాటిగా మార్చేశారు. కాపులకు రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా జరిగిన తుని సభ హింసాత్మకంగా మారి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, పోలీస్ స్టేషన్లు దగ్ధమైన ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైకి నెట్టి అపఖ్యాతిపాల్జేసేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం అభాసుపాలైంది. రాజధాని అమరావతిలో భూ సమీకరణకు తమ భూములు ఇవ్వని రైతులపై కక్ష సాధింపు చర్యలు జాతీయ మానవ హక్కుల నేతలను సైతం విస్మయానికి గురిచేశాయి. తమ మాట వినని రైతుల అరటితోటలు, తాటాకు పాకలు తగలబెట్టించిన కొందరు సంఘ విద్రోహశక్తులు భయాందోళనలు సృష్టించారు. తుందుర్రు, గరగపర్రు, దివీ స్లలో శాంతిభద్రతలను అదుపుచేయలేక ప్రభుత్వం ప్రజలను ఇబ్బం దులకు గురిచేసింది. -బొల్లికొండ ఫణికుమార్, సాక్షి ప్రతినిధి -
నిరుద్యోగ భృతి..ఒక ప్రచార ఆర్భాటం
సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఒక మాట..వచ్చిన తర్వాత మరో మాట చెబుతూ ముందుకు వెళుతోంది. నిరుద్యోగ భృతి విషయంలోనూ నాలుగున్నరేళ్లు గడిచే వరకు మొద్దునిద్రలో ఉన్న టీడీపీ సర్కార్ ఎన్నికల నేపథ్యంలో మేలుకుంది. అదీ కూడా ఇంటింటికి ఉద్యోగం...లేకుంటే ప్రతి నిరుద్యోగికి రూ. 2 వేలు భృతి అంటూ దండోరా వేసిన టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం రూ. 1000కే పరిమితం చేసింది. అదీ కూడా ఆగస్టు నుంచి ఇచ్చేందుకు సన్నద్ధమని, తర్వాత అక్టోబరు 2కు కథ మారింది. ఎంత మారినా మళ్లీ సవాలక్ష ఆంక్షలతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. అక్టోబరు నుంచి అమలు చేసిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో జిల్లాలో వేల మంది దరఖాస్తు చేస్తే రకరకాల నిబంధనల పేరుతో అధికశాతం మందికి నిరాకరించి కొంతమందికే భృతి ఇస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. ఓట్లే లక్ష్యంగా... జిల్లాలో నిరుద్యోగ భృతికి సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నాలుగున్నరేళ్ల తర్వాత చివరి అంకంలో ఓట్లే లక్ష్యంగా అడుగులు వేసింది. ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్సైట్లో దాదాపు 7.15 లక్షల పైచిలుకు నమోదైనా ఓటీపీ జనరేట్ చేసిన వారు 5.73 లక్షల మంది ఉన్నారు. పెద్ద ఎత్తున దరఖాస్తుకు ప్రయత్నించారు. అయితే నిబంధనల సాకుతో కోత వేశారు. కొందరికి ఓటీపీ రిజెక్ట్ అయితే, మరికొందరికి సక్సెస్ అయినా కూడా సమస్యలు వేధించాయి. సర్టిఫికెట్లు సమర్పించలేదనో లేదా వయస్సు దాటిపోయిందనో సాకులు చూపుతూ యువతకు భృతిని దూరం చేస్తున్నారు. జిల్లాలో 23 వేల మందికి భృతి ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ప్రారంభాన్ని అట్టహాసం చేసినా పరిస్థితి చూస్తే మాత్రం ఆర్భాటం మాత్రమే కనిపిస్తోంది. ఊహకు అందని స్థాయిలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించారు. వీరిని సమస్యలు వెంటాడాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 23 వేల మందిని మాత్రమే అర్హులుగా తేల్చి కేవలం ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున అందిస్తున్నారు. అదీ కూడా మే నెలలో కేబినెట్ సమావేశం జరిగినా.... జూన్ వరకు స్పష్టత ఇవ్వకపోవడం...తర్వాత మరికొన్ని రోజులకు జీఓ విడుదల చేసి....ఆగస్టు అనుకున్నా అప్పుడు కూడా అందించకుండా అక్టోబరు 2న అట్టహాసంగా ప్రారంభించారు. ఎన్నికలకు ముందు ఇంటింటికి ఉద్యోగం...లేకపోతే రూ. 2 వేలు నిరుద్యోగ భృతి అన్నా తీరా చివరలో రూ. 1000 పేరుతో అందిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అది ఎన్నికల తాయిలం..
సాక్షి, న్యూఢిల్లీ : కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఇంధన ధరలను ఇటీవల కేంద్రం స్వల్పంగా తగ్గించిందని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఎన్నికల తాయిలాలను ప్రకటించకుండా పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇంధన ధరలపై కేంద్రం ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయని ఇది ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ఆందోళన వ్యక్తం చేశారు. కర్నాటక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెట్రో ధరలను పెంచని కేంద్ర ప్రభుత్వం అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏం చేయనుందని ప్రశ్నించారు. పెట్రో దరలను ఎన్నికలతో ముడిపెట్టి తాయిలాలు ప్రకటించే కన్నా వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఘర్-ఘర్ మోదీ సమయం నుంచి బైబై మోదీ సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం ప్రజల ముఖాల్లో నవ్వులు తీసుకురావచ్చని హితవు పలికారు. ఇంధన విక్రయాల ద్వారా ప్రభుత్వానికి సమకూరే రూ 13 లక్షల కోట్లను కేంద్రం ప్రచారాలకు, ఈవెంట్ మేనేజ్మెంట్కు వెచ్చిస్తోందని ఆరోపించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫుల్‌టైమ్ బ్లాగర్లా, పార్ట్‌టైమ్ మంత్రిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. -
ఎవరెస్ట్ కలుగులో ‘డబ్బులు’
లంకెబిందెలున్నాయంటే పలుగు పారతో పరుగెత్తుకెళ్లి తవ్వుతాడు. కొండ కోనల్లో నిధి ఉందని తెలిస్తే టక్కరిదొంగలా సాహసం చేస్తాడు. డబ్బుకోసం మనిషి ఏదైనా చేస్తాడు! మనిషికి అంత ఆశ. దీనిని ఆసరాగా చేసుకుని డబ్లిన్‌లో ఆస్క్ ఎఫ్ఎం 2.0 అనే స్టార్టప్ కంపెనీ ఆ ఆశకు గాలం వేసింది. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం లోపల దాదాపు రూ.34 లక్షల విలువైన క్రిప్టోకరెన్సీ దాచేసింది. సాహసం చేసి తీసుకొచ్చిన వారు ఆ మొత్తాన్ని తమ వెంట తీసుకెళ్లవచ్చని ప్రకటించింది. ముగ్గురు ఉక్రెయిన్ పర్వతారోహకులు వాటిని సొంతం చేసుకునేందుకు పర్వతాన్ని ఎక్కారు. అయితే అందులో ఇద్దరు మాత్రమే ఆ కరెన్సీని తీసుకొచ్చారు. డబ్బునూ సొంతం చేసుకున్నారు. అయితే మూడో వ్యక్తి ఆ కరెన్సీ అన్వేషణలో ప్రాణాలు కోల్పోయాడు. తన వ్యాపారంలో భాగంగా క్రిప్టోకరెన్సీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కల్పించాలనే ఆ కంపెనీ ఈ పని చేసింది. -
రెడీ.. వన్..టూ..త్రీ స్టార్ట్!
ప్రచార పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లినట్లుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసేది గోరంత.. చూపించేది కొండంతలా మారింది. ఏ పని చేసినా పబ్లిసిటీ స్టంట్‌గానే మారింది. ఈదఫా జన్మభూమి ఎపిసోడ్లో సామాజిక పింఛన్లు అందుకొనే వృద్ధులు, వికలాంగులు, వితంతువులనూ నటులుగా చేర్చారు. ‘దర్శిలో సీఎంగారి సభ అంతా టీవీల్లో చూస్తేనే పింఛన్ ఇచ్చేది’ అంటూ అధికారులు.. పింఛన్ సొమ్ముకోసం పంచాయతీ కార్యాలయాల వద్దకు మంగళవారం వచ్చినవారికి షరతు విధించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల దాకా వాళ్ల డబ్బుమీద చేతులు పెట్టిఎటూ కదలనివ్వలేదు. గిద్దలూరు రూరల్: మండలంలో కె.ఎస్.పల్లి పంచాయతీ పరిధిలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెన్షన్ల కోసం మంగళవారం పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే అధికారులు ఎంతకూ పెన్షన్ పంపిణీ చేయకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పైగా దర్శిలో మంగళవారం చేపట్టిన సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని టీవీలో చూడాలని కార్యక్రమం అంతా పూర్తిగా చూస్తేనే పెన్షన్ల పంపిణీ చేస్తామంటు అధికారులు చెప్పారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులంతా టీవీ చూస్తు ఉండిపోయారు. పెన్షన్ కోసం దిగువమెట్ట, దిగువమెట్ట తండా, పెద్ద చెరువు, ఉప్పలపాడు గ్రామాల నుంచి వచ్చినవారితో కె.ఎస్.పల్లి పంచాయతీ కార్యాలయం నిండిపోయింది. దూర ప్రాంతాల నుంచి డబ్బులు ఖర్చు చేసుకొని ఆటోల్లో వచ్చినవారు తిండీ తిప్పలు లేకుండా సాయంత్రం వరకు ఉండిపోయారు. ఇష్టం లేకున్నా బలవంతంగా కూర్చోబెట్టి టీవీ చూడమంటే ఏం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి వద్ద పనులు మానుకుని కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి ఉండాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అధికారులు మాత్రం వేలిముద్రలు వేసే యంత్రం పనిచేయకపోవడంతో పెన్షన్లను పంపిణీ చేయలేదని.. మెషీన్‌ను గిద్దలూరుకు పంపామని వచ్చిన వెంటనే పంపిణీ చేస్తామని తెలిపారు. తిండి తిప్పలు లేకుండా ఎలా కూర్చోవాలా? దిగువమెట్ట నుంచి ఉదయం 9 గంటలకు వచ్చాను. సాయంత్రం 5 గంటలవుతున్నా పెన్షన్ ఇవ్వలేదు. ఈ రోజు ఇవ్వమని చెబితే ఇంటికి వెళుతాము కదా! ఆ టీవీలో సీఎం కార్యక్రమం వస్తుంది ఇక్కడే కూర్చోమంటున్నారు. తిండి తిప్పలు లేకుండా ఎలా కూర్చోవాలి? – తిరుపతయ్య చార్జీలు పెట్టుకుని వచ్చా దిగువమెట్ట నుంచి ఉదయం ఆటోలో వచ్చాను. గంటల తరబడి ఇక్కడే వేచి ఉండమంటే ఎలా ఉండాలి. మా పెన్షన్ డబ్బులు మాకు ఇస్తే ఇంటికి వెళ్లి పనులు చేసుకుంటాం. – రామలక్ష్మమ్మబాయి ఎప్పుడిస్తారో ఏందో! చీరాల టౌన్: ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ప్రతినెలా ఒకటో తేదీన అందాల్సిన పింఛన్ కోసం తిప్పలు పడుతున్నారు. జీవిత చరమాంకంలో ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రవేశపెట్టిన పింఛన్ పథకాన్ని పాలకులు, అధికారులు సక్రమంగా అమలు చేయకపోవడంతో పంచాయతీ కార్యాలయాల వద్ద ఒకటో తేదీ నుంచి వేచి చూడాల్సి వస్తోంది. ఆన్లైన్ కష్టాలు.. ఎన్నో రకాలుగా మారుతూ వస్తోన్న పింఛన్ పంపిణీ వ్యవహారం ప్రస్తుతం ఆన్లైన్ సమస్యతో ముందుకు సాగడంలేదు. ఉదయం 7 గంటల నుంచి ఎదురు చూస్తున్నా ఆన్లైన్ పనిచేయడం లేదంటూ అధికారులు లబ్ధిదారులతో బుకాయిస్తున్నారు. చీరాల మండంలోని 15 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 5 గ్రామాల్లోనే సక్రమంగా పింఛన్ పంపిణీ చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పింఛన్‌దారులు ఎదురు చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కనీసం బిళ్లలు కూడా కొనుక్కోలేని పరిస్థితి దాపురించింది. పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏప్పుడు ప్రారంభిస్తారో కనీసం ఆ గ్రామాల్లో కూడా ప్రచారం చేయకపోవటంతో రెండు మూడు రోజులుగా లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
పుష్కరాలను చంద్రబాబే తీసుకొస్తున్నారా?
-
పుష్కరాలను చంద్రబాబే తీసుకొస్తున్నారా?
హైదరాబాద్: 'నదుల్లో 12 ఏళ్లకు ఒకసారి సహజంగానే వచ్చే పుష్కరాలను స్వయంగా తానే తీసుకొస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్నారు. నదిలోకి పుష్కరుణ్ని సైతం ఆయనే ఆహ్వానిస్తారేమో!' అని ఏపీ ముఖ్యమంత్రి తీరును ఎద్దేవా చేశారు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. పుష్కరాల పిలుపు పేరుతో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేశారని ఆయన విమర్శించారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి.. 'రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనను పొగిడినట్లు చంద్రబాబు నాయుడు పలు పత్రికల్లో వార్తలు వేయించుకున్నారు. నిజంగా అంత పలుకుబడే ఉంటే రాష్ట్రప్రయోజనాల కోసం ఎందుకు గట్టిగా అడగరు?' అని నిలదీశారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చివల్ల 30 మంది బలైపోయారని, నాటి ఘటనపై ఏర్పాటయిన సోమయాజులు కమిటీ ఇంతవరకు ముఖ్యమంత్రిని విచారించలేదని శ్రీకాంత్ రెడ్డి గుర్తుచేశారు. కృష్ణా పుష్కరాల విషయంలోనూ చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఇకనైనా ఆ పిచ్చి మానుకొని, ప్రత్యేక హోదా కోసం పోరాడాలని హితవు పలికారు. -
వింతై వింతింతై
బ్యూటీ మీల్స్ పబ్లిసిటీ స్టంట్లు పలురకాలన్నట్లు ఉంది వాషింగ్టన్‌లోని ఓ హోటల్ తీరు. ఈ సౌత్ కొరియన్ హోటల్ కస్టమర్స్‌కి బంపర్ ఆఫర్ పెట్టింది. పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేస్తే లంచ్ ఫ్రీ అనో.. ఓ రకం చైనీస్ బ్రేక్‌ఫాస్ట్ తింటే ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ ఉచితమనో.. బిల్లులో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనో అనుకునేరు...ఇవేవీ కావు! హోటల్ తెరిచినప్పటి నుంచే వచ్చే మొదటి 50 మంది కస్టమర్లకు ఫ్రీ మీల్స్‌ని ఆఫర్ చేస్తోంది. అయితే...ఆ 50 మందీ అందంగా ఉంటేనే అని కండీషన్‌ను అప్లయ్ చేస్తోంది. కస్టమర్ల అందానికి వీళ్ల దగ్గరున్న కొలమానమేంటో అని పెదవి విరవకండి.. హోటల్ రిసెప్షన్లో ‘బ్యూటీ ఐడెంటిఫికేషన్ ఏరియా’ని ఏర్పాటు చేశారట. అక్కడ కను, ముక్కు తీరు, పెదువులు, ముఖాకృతిని పరిశీలించి టోకెన్ ఇస్తారట. ఎత్తు నుదురున్న వాళ్లకు అడ్వాంటేజ్ ఎక్కువట. వాళ్ల కనుముక్కుతీరు ఎలా ఉన్నా నుదురు ఎత్తుగా ఉంటే చాలు అందగత్తెలు, అందగాళ్ల కింద కన్సిడర్చేసి ఫ్రీ మీల్ ఆఫర్‌కి ప్రిఫర్ చేసేస్తున్నారట. ఈ ఆఫర్‌తో కస్టమర్ల తాకిడి పెరగడంతో ‘రెస్టారెంట్ ఫర్ గుడ్ లుకింగ్’ గా హోటల్ పేరునూ మార్చామని, ఫ్రీ మీల్ సౌకర్యాన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తామని అంటున్నాడు హోటల్ మేనేజర్ గ్జ్యూ హెగ్జిన్. పాండా ప్రెగ్నెన్సీ! నకరాలు, నటనలు నరులకే కాదు నాలుగు కాళ్ల జీవులకూ తెలుసు! భోగం సాగించుకోవడానికి రోగమున్నట్టు మనుషులు నటించినట్టే జంతువులూ నటిస్తాయి! ఈ విషయం రుజువైంది తైవాన్ రాజధాని తైపీలోని ఓ జూలో. రుజువు చేసింది ఓ పాండా. భోగం కోసం రోగమున్నట్టు కాదు కానీ గర్భం వచ్చినట్టు నటించింది. ఈ జూలోని ప్నెగ్నెంట్ పాండాలకు జూ సిబ్బంది ఇరవైనాలుగు గంటలు సేవలందించడం, రకరకాల పళ్లు ఇవ్వడం, సింగిల్ ఎయిర్‌కండీషన్డ్ గదిలో ఉంచడం వంటి సదుపాయాలు చూసి కన్నుకుట్టింది పదకొండేళ్ల ఆ పాండాకు. గర్భందాల్చినట్లు నటిస్తే తప్ప తనకు ఆ సౌకర్యాలు అందే ఛాన్స్లేదనుకుంది. ఇంకేముందు ఓ ఫైన్ మార్నింగ్ మొదలెట్టింది మార్నింగ్సిక్నెస్తో యాక్షన్. నీరసంగా ఉండి లేవలేనట్టుగా పడుకుండిపోయిందట. ఆకలి లేనట్టు, ఏదైనా తింటే వొమిట్ సెన్సేషన్ ఉన్నట్టు వాక్ వాక్ అనడం స్టార్ట్ చేసిందట. దీని ప్రవర్తనను చూసిన జూ సిబ్బంది అదీ ప్రెగ్నెంటేమో అనుకొని పాండాను సింగిల్ ఎయిర్ కండీషన్డ్ రూమ్‌లోకి మార్చారట. దానికిష్టమున్న తిండిని పెట్టారట. ఈలోపూ జూ లోని వెటర్నరీ డాక్టర్లకు పాండా విషయం చెప్పి టెస్ట్ చేయడం కోసం పిలిపించారట. టెస్టింగ్‌లో గుట్టు రట్టయింది. అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో పాండాకు ప్రెగ్నెన్సీ లేదన్న నిజం బయటపడింది. ఏముందీ.. అప్పటికప్పుడే దాన్ని ఎయిర్‌కండీషన్డ్ గదిలోంచి మిగిలిన పాండాలున్న చోటకి చేర్చారు. తన నాటకం తెలిసిపోయినందుకు సిగ్గుతో ముడుచుకుపోయిందట పాండా! ఇదెందుకిలా నకరాలు చేసిందని ఆరా తీస్తే ప్రత్యేకమైన సౌకర్యాల కోసమే అలా చేసి ఉంటుందని ఓ అంచనాకొచ్చారట జూ సిబ్బంది. పాపం పాండా! 120 ఏళ్లనాటి పెళ్లిగౌను పెళ్లిలో పెళ్లి కూతురికి అన్నీ కొత్తవే కాకుండా నాన్నమ్మ నెక్లెసో.. అమ్మమ్మ గాజులో, అత్తయ్య చెవి దిద్దులో వంటి కొన్ని పాతవాటినీ ఆనవాయితీగా ఇస్తారు. ఈ సంప్రదాయం పాశ్చాత్య దేశాల్లోనూ ఉంది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎబిగలి అనే పెళ్లికూతురుకీ అలాంటి వంశపారంపర్య కానుక ఒకటి వచ్చింది. ఏంటో కాదు వెడ్డింగ్ గౌనే! అదీ 120 ఏళ్ల కిందటిది. ఆ గౌన్ వేసుకున్న పదకొండో తరం పెళ్లికూతురుట ఆమె. వీళ్ల వంశంలో ఆ గౌను వేసుకున్న మొదటి వధువు మేరీ లోరీ వారెన్. 1895లో తన పెళ్లి సందర్భంగా ఈ గౌన్‌ను తనే డిజైన్ చేసుకుంది. అప్పటి నుంచి 120 ఏళ్లుగా చేతులు మారుతూ ఎబిగలి దగ్గరకు వచ్చేసరికి ముట్టుకుంటే చిరిగిపోయే స్థితిలో ఉందట ఈ పట్టుగౌను. పన్నెండు మంది డిజైనర్స్ 200 గంటలు కష్టపడి దీన్ని బాగుచేశారట. కేవలం కాక్టెయిల్ పార్టీ టైమ్‌లో అదీ పార్టీ ప్రారంభించేంత వరకు మాత్రమే ఈ డ్రెస్‌ను ధరించిందట ఎబిగలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. అందుకే అన్నేళ్లయినా దానికంత క్రేజ్ అంటుంది కొత్త పెళ్లికూతురు. ఓ మంచిదొంగ కథ యూరప్‌లోని క్రోయేషియా దేశం.. ఓ ఇంట్లో.. కాలింగ్ బెల్ మోగింది. డోర్ తెరిచాడు జెర్కోవిక్. చేతిలో పార్సిల్‌తో కొరియర్ బాయ్. అందులో ఏముందోనన్న ఉత్సుకతతో పార్సిల్ తెరిచాడు. అంతే! అతని ముఖం ఆశ్చర్యంతో నిండిపోయింది. అందులో ఉన్నది 14ఏళ్ల కిందట పోగొట్టుకున్న పర్సు. అందులోని డబ్బును తన ఇంటి పైకప్పు రిపేరింగ్ కోసం బ్యాంకు నుంచి డ్రా చేశాడట. దాన్ని ఫంక్షన్లో పోగొట్టుకున్నాడో లేక తెలిసిన వారికి ఆరోగ్యం బాలేదని ఆస్పత్రికి వెళ్తుంటే పోగొట్టుకున్నాడో గుర్తులేదట. ఇన్నేళ్ల తర్వాత అతని పర్సు, అందులోని డబ్బును చూసి జెర్కోనిక్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు తను పోగొట్టుకున్న పర్సులో కేవలం 1000 యూరోలు (రూ.73,000) ఉన్నాయట. పార్సిల్లో తనకు అందిన పర్సులో 1440 యూరోలు (రూ.1,05,120) ఉన్నాయి. దాంతో మొదట జెర్కోవిక్ అనుమానంతో అవి దొంగ నోట్లోమోనని నిర్ధారణకు కూడా వెళ్లాడట. ‘‘ఆ రోజు నా పర్సును ఎవరో అవసరార్థం దొంగిలించి ఉంటారు. ఆ డబ్బు వారిని ఆపద నుంచి కాపాడి ఉంటుంది. అందుకే వారు కృతజ్ఞతతో ఎక్కువ డబ్బు పంపించారేమో’’నని జెర్కోవిక్ అందరికీ ఆనందంగా చెబుతున్నాడు. అయితే ఫ్రమ్ అడ్రస్ లేనందుకు మాత్రం బోలెడంత నిరుత్సాహపడిపోయాడు. చల్లని మంట! ఐస్‌క్రీమ్... పేరు వింటేనే ఎవరికైనా నోరూరుతుంది కదా! ఐస్‌క్రీమ్ అంటే స్వీట్ అండ్ కూల్... అనే భ్రమతో ఈ ఫొటోలో కనిపించే పదార్థాన్ని ఏమరపాటుతో నోటపెట్టుకున్నారో... ఇక అంతే సంగతులు! దాని మంటకు నవరంధ్రాల్లోంచి ఆవిర్లు రావాల్సిందే! ఎందుకంటారా..? దీని తయారీలో రుచి కోసం వాడేది పంచదార కాదు. ప్రపంచంలోకెల్లా అత్యంత ఘాటైన ‘ఘోస్ట్ పెప్పర్’ అనే మిరపకాయలు మరి! ఈ ఐస్‌క్రీమ్ పైభాగంలో అలంకరణగా వాడే ఒక స్పూను మోతాదు భాగం మాత్రమే కాస్త తీపిగా ఉంటుంది. ఆ తర్వాత ఉండేదంతా... మంటే... మంట! ఇదెక్కడ దొరుకుతుందంటారా..? అమెరికాలోని డెలావేర్ రాష్ట్రంలో... అక్కడ రెహోబోత్ బీచ్‌లోని ‘ద ఐస్‌క్రీమ్ స్టోర్’ దీన్ని విక్రయిస్తోంది. బా.. బా.. యాక్ట్ షీప్... ‘జీవితమే ఒక నాటకరంగం... మనమంతా నటీ నటులం’ అన్నాడు షేక్స్పియర్. ‘మనమంతా’ అంటే ఎవరు? అనే ప్రశ్న ఉద్భవిస్తే, మోకాళ్లలో ఉన్న మెదళ్లతో ఆలోచించి ‘మనుషులం’ అనే సమాధానం ఇస్తాం. ఫొటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు మాత్రం కాస్త తాత్వికంగా ఆలోచించాడు. ‘మనమంతా’ అంటే మనుషులమే కాదు, గొర్రెలు కూడా అనే నిర్ధారణకు వచ్చాడు. అంతేనా..? ఈ విషయాన్ని రంగస్థలం సాక్షిగా నిరూపిస్తున్నాడు కూడా! మనుషుల్లో మెజారిటీ జనాభా గొర్రెల్లాంటి వాళ్లే అయినప్పుడు మనుషులకు, గొర్రెలకు తేడా ఏమిటనేది ఇతగాడి అభిప్రాయం కాబోలు! ఇతగాడి పేరు అలస్దైర్ సక్సేనా. భారత సంతతి వాడే గానీ, లండన్‌లో ఉంటాడితడు. రంగస్థలం అంటే వెర్రి మమకారం. పైగా, షేక్స్పియర్కు వీరాభిమాని. షేక్స్పియర్ నాటకాలను మానవమాత్రులు పాత్రధారులుగా చాలామంది చాలాసార్లు ప్రదర్శించారు. ఇందులో వెరైటీ ఏముంది..? అనుకుని, ఇతగాడు ఏకంగా గొర్రెలనే పాత్రధారులుగా తీర్చిదిద్ది, వాటి చేతే షేక్స్పియర్ నాటకాలను ప్రదర్శిస్తున్నాడు. నటించేవి గొర్రెలే అయినా, వ్యాఖ్యానం మాత్రం ఇతగాడే చెబుతాడు లెండి. గొర్రెలతో ఇటీవల ఇతగాడు ప్రదర్శించిన ‘కింగ్ లియర్’ నాటకాన్ని లండన్ ప్రేక్షకులు వేలం వెర్రిగా తిలకించారు. -
'స్వచ్ఛ హైదరాబాద్ ఓ పబ్లిసిటీ స్టంట్'
హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం పబ్లిసిటీ కార్యక్రమాన్ని చేపట్టిందని టీపీసీసీ అధికారప్రతినిధులు మల్లు రవి, కొనగాల మహేశ్, మొగుల్ల రాజిరెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయం సంక్షోభంలో ఉన్నా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు చేసిన హెచ్చరికతో హైదరాబాద్‌లో స్వచ్ఛత గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు, రైతులు రోడ్లెక్కి నిరసనలు చేసే పరిస్థితి వచ్చినా పబ్లిసిటీ కార్యక్రమాలు తప్ప సమస్యలు మాత్రం ప్రభుత్వానికి పట్టడం లేదని మల్లు రవి దుయ్యబట్టారు. -
70 శాతం ఇళ్లు ఇంకా చీకట్లోనే
జగన్ పర్యటనలో కనిపించిన దృశ్యాలు ప్రభుత్వ వైఫల్యంపై నిలదీసిన విపక్ష నేత విశాఖపట్నం: తుపాను దెబ్బకు కరెంటు పోయి 70 శాతం ఇళ్లు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. అతలాకుతలమైన సమాచార వ్యవస్థింకా గాడినపడలేదు. కూకటివేళ్లతో సహా కూలిపోయిన చెట్లు ఇప్పటికీ అలా రోడ్లమీదే ఉన్నాయి. గూడు చెదిరిన నిరుపేదలు ఆకలిదప్పులు తీరక పడిగాపులు పడుతున్నా రు. సర్కారు సాయం కోసం ఎదురుచూస్తూ... తమ వద్దకు ఇప్పటికీ ఏ ఒక్కరూ రాలేదని శాపనార్థాలు పెడుతున్నారు. గడిచిన తొమ్మిది రోజులుగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించినపుడు ఎదురుపడిన దృశ్యాలివి. బాధితులు నేరుగా ఆయన వద్దకు వచ్చి తమకిప్పటికీ ఒక్క కిలో బియ్యం కూడా అందలేదని, తమను పలకరించినవారే లేకపోయారని వాపోయినపుడు ఆయన చలించిపోయారు. సర్కారు మెడలు వంచి సహాయం అందేలా చేస్తామని వారికి భరోసానిచ్చారు. 10 రూపాయల పులిహోర ప్యాకెట్టు ఇచ్చేసి చేతులు దులుపుకుందంటూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగట్టారు. తినేందుకు వీల్లేని పాచిపదార్థాలు పంచటాన్ని వేలెత్తిచూపారు. రూ.1 కిలోబియ్యం 25 కేజీలు ఇచ్చి... అంటే కేవలం పాతిక రూపాయలు విదిలించి సహాయం చేసేశామని చెప్పుకుంటున్న ప్రభు త్వ పబ్లిసిటీ స్టంట్‌ను ఎండగట్టారు. ప్రతి బాధి త కుటుంబానికి తక్షణ సాయంగా రూ.5వేలు ఇవ్వాలని, పాడైపోయిన ఇళ్ల మరమ్మతులకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు బదులుగా తుపాన్లను తట్టుకునే సామర్థ్యంతో కొత్త ఇళ్లు కట్టిం చాలని డిమాండ్ చేశారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్ తొమ్మిది రోజుల పర్యటన అలుపెరుగకుండా, విరామంలేకుండా సాగింది. రోజులో దాదాపు 12 గంటలు తుపాను బాధితుల కష్టాలు విని భరోసానివ్వడంలోనే గడిపారు. తుపానుతీరం దాటిన పూడిమడక గ్రామానికి వెళ్లిన తొలినేత జగనే. అధికారులు, అధికార పార్టీ నేతలు సమీక్షలు, మీడియా సమావేశంలోనే కాలం గడపగా జగన్ కాలినడకన పర్యటించి ఇంటింటికీ వెళ్లి బాధితుల కష్టాలు ఆలకిం చారు. పిషింగ్‌హార్బర్, జలారిపేటలలో పర్యటించి మత్స్యకారుల కష్టాలను తెలుసుకున్నారు. తీరప్రాంత కాలనీల్లో కాలినడకన తిరిగి వేలాదిమంది మత్స్యకారులకు ధైర్యం చెప్పారు. ప్రాణాలతో బాబు పబ్లిసిటీ స్టంట్: జగన్ మనిషి ప్రాణాన్ని కూడా చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌గా మార్చి బాధితులకు తీరని అన్యాయం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. పబ్లిసిటీ ఉంటుందనుకున్న చోట రూ.5 లక్షలు పరిహారమిచ్చి, లేదనుకున్న చోట రూ.3 లక్షలు మాత్రమే ఇస్తూ కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణసంచా తయారీ కేంద్రం పేలుడులో మృతుల కుటుంబ సభ్యులను బుధవారం ఆయన పరామర్శించారు. - సాక్షి, కాకినాడ -
క్రేజీవాల్ మరో పబ్లిసిటి స్టంట్
-
పబ్లిసిటీ స్టంట్
-
నవ్విపోదురుగాక నాకేటి...
సర్వేల సర్వారాయుడు.. ప్రగల్భాల ఉత్తరకుమారుడు.. రాజీనామాల్రాయుడు.. పబ్లిసిటీ స్టంట్ మాస్టర్.. సమైక్యతా మాస్క్‌ధరుడు.. వ్యక్తిగత ఇమేజ్ తప్ప జనం కష్టనష్టాలు పట్టని విజిటింగ్ వీరుడు.. ఆయనెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిన్నపిల్లోడు సైతం ఠక్కున చెప్పేస్తాడు ఆయన ఎంపీ లగడపాటి రాజగోపాల్ అని. ఇప్పుడు ఆయన మరోకొత్త డ్రామాకు తెరలేపారు. సాక్షి, విజయవాడ : ఎంపీ లగడపాటి నగరానికి వస్తున్నారంటే.. ప్రజా సమస్యలు వినడానికో, పరిష్కరించడానికో కాదు, కేవలం ప్రచారానికి మాత్రమేననేది అందరికీ తెలిసిందే. ఆయన విమానం ఎక్కగానే మీడియాకు మెసేజ్‌లు వస్తాయి. నగరంలోకి అడుగుపెట్టిన దగ్గర్నుంచి తిరిగి విమానం ఎక్కేవరకూ మీడియాను ఏదో విధంగా తన వెంట తిప్పుకోవడం ఆయన స్టయిల్. తనకు ఓట్లేసి గెలిపించిన జనానికి ఏదో చేయాలనే ఆలోచన కంటే తన ప్రతి మాట, చేతలకు విస్తృత ప్రచారం పొందాలనేది ఆయన యావంతా. అందుకే ఆయనను విజిటింగ్ ఎంపీ అని పిలుచుకోవడానికి జనం అలవాటుపడ్డారు. ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారానికి వాడుకోవడం ఆయన బాగా తెలిసిన విద్య. జనం, రాష్ట్రం ఏమైపోయినా సరే వ్యక్తిగత ఇమేజే ఆయనకు కావాల్సిందల్లా. సమైక్య ఉద్యమాన్ని కూడా ఆయన వదిలిపెట్టలేదు. 2009లో ఉద్యమబాట పట్టినప్పుడు జనం సంతోషించారు. అది ఆవిరికావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఆస్పత్రి నుంచి అదృశ్యమై సినీఫక్కీలో హైదరాబాద్‌కు పరుగుతీయడంతో ఉద్యమం పరువు తీశారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఈసారి రాజీనామా డ్రామాతో రక్తికట్టించేందుకు తాపత్రయపడి అభాసుపాలయ్యారు. ఇప్పుడు కొత్తగా శుక్రవారం మరో పబ్లిసిటీ స్టంట్ చేశారు. ఇందుకు వన్‌టౌన్‌లోని మరుపిళ్ల చిట్టి కేంద్ర కాంగ్రెస్ కార్యాలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి చిట్టి కార్యాలయం వద్ద సభ ఏర్పాటుచేశారు. ఈ సభలో కీలకమైన నిర్ణయాలు ప్రకటిస్తారని, బ్రహ్మాండం ఊడిపడిపోతుందంటూ ఎలక్ట్రానిక్ మీడియాకు సమాచారం ఎంపీ కార్యాలయ సిబ్బంది సమాచారం ఇచ్చారు. అంతే మొత్తం మీడియా అంతా లైవ్ టెలికాస్ట్కు రంగం సిద్ధంచేసింది. న్యూస్ బులెటిన్ ఎప్పుడు ప్రారంభమవుతుందో సరిగ్గా అదే సమయానికి తన ఉపన్యాసం ప్రారంభించి అనర్గళంగా అరగంట సేపు మాట్లాడేశారు. అందులో తన రాజీనామా ప్రస్తావనగానీ, కనీసం తాను ఏం చేయబోతున్నదీగానీ ఒక్క మాట కూడా చెప్పలేదు. ఉద్యోగులు అలిసిపోయి ఉద్యమానికి విరామం ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపున గ్రామ గ్రామాన పోరాటం చేపట్టాలని మాత్రమే ఉచిత సలహా పడేశారు. తన సర్వేలతోనే సమైక్యాన్ని సాధించవచ్చంటూ ఓ కొత్త సిద్ధాంతాన్ని వెల్లడించారు. తన చిలకజోస్యాలు ఎప్పుడూ గురితప్పలేదని సోదాహరణలతో ఏకరువు పెట్టారు. త్వరలో ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలలోని ఫలితాలపై అంచనాలను ఇప్పటికే అధిష్ఠానానికి పంపానని, డిసెంబర్ ఎనిమిదిన అవి నిజం కానున్నాయని చెప్పారు. ఆ తర్వాత ఆంధ్రరాష్ట్రంలో పరిస్థితిపై కూడా అంచనాలు ఇస్తానని, అప్పుడు అధిష్ఠానం తన మాట వింటుందని ఆయన చెప్పుకొచ్చారు. అంటే తన సర్వేలతోనే సమైక్య రాష్ట్రాన్ని నిలబెడతానని పరోక్షంగా ఉద్ఘాటించారు. గురువారం రాత్రికి నగరానికి చేరుకున్న రాజగోపాల్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని వేదికగా చేసుకుని హడావిడి చేసి మధ్యాహ్నానికి వెళ్లిపోయారు. తన నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పత్తి, వరి, మిర్చి పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ఆదుకునే ఆలోచన, చర్యలను చేపట్టే విషయం పక్కనపెట్టినా.. కనీసం వారిని పరామర్శించే ప్రయత్నం కూడా చేయలేదు. తన రాజీనామా ఆమోదింపజేసుకున్న తర్వాతే నగరంలో అడుగుపెడతానని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో శపథం చేసిన ఆయన ఆ మాటే మర్చి శుక్రవారం రెండోసారి బెజవాడకు వచ్చి వెళ్లిన ఎంపీ తీరును జనం ఏవగించుకున్నారు.