హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పబ్లిసిటీ కార్యక్రమాన్ని చేపట్టిందని టీపీసీసీ అధికారప్రతినిధులు మల్లు రవి, కొనగాల మహేశ్, మొగుల్ల రాజిరెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయం సంక్షోభంలో ఉన్నా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు చేసిన హెచ్చరికతో హైదరాబాద్‌లో స్వచ్ఛత గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు, రైతులు రోడ్లెక్కి నిరసనలు చేసే పరిస్థితి వచ్చినా పబ్లిసిటీ కార్యక్రమాలు తప్ప సమస్యలు మాత్రం ప్రభుత్వానికి పట్టడం లేదని మల్లు రవి దుయ్యబట్టారు.
'స్వచ్ఛ హైదరాబాద్ ఓ పబ్లిసిటీ స్టంట్'
Published Tue, May 19 2015 1:10 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement