
తులసీ గబ్బార్డ్ హామీ
వాషింగ్టన్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది హిందువులను పొట్టనబెట్టుకున్న ముష్కరుల వేటలో భారత్‌కు తమ దేశం పూర్తిగా సహకరిస్తుందని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ స్పష్టం చేశారు.
దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆమె శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా సానుభూతి ప్రకటించారు. దాడికి కారకులైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత్‌కు సాయంగా నిలుస్తామని అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధ వారం ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. దారు ణాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.