
ప్రస్తుతం సైలెంట్ అయ్యారే అనుకుంటున్న టైంలో మంచు కుటుంబంలో(Manchu Family) మరోసారి వివాదం మొదలైంది. తాను ఇంట్లో లేనప్పుడు తన కారు, ఇతర వస్తువుల్ని ఎత్తుకెళ్లారని మనోజ్(Manchu Manoj).. అన్న విష్ణుపై కేసు పెట్టాడు. జల్‌పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదంతా మంగళవారం జరిగింది.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?)
తాజాగా బుధవారం ఉదయం.. జల్ పల్లిలోని మోహన్ బాబు(Mohan Babu) ఇంటి ముందు మనోజ్ ఆందోళనకు దిగాడు. కూతురు పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లగా.. తన ఇంట్లోని వస్తువులు ఎత్తుకెళ్లారని, దీని గురించి తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించట్లేదని మనోజ్ చెప్పాడు. దీంతో గేటు ముందే బైఠాయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొన్నాళ్ల క్రితం విష్ణు-మనోజ్ మధ్య మొదలైన గొడవ.. చాలారోజుల పాటు నడిచింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ఏమైందో ఏమో మరి సైలెంట్ అయ్యారు అనుకునేంతలోపు మళ్లీ వివాదం రాజుకున్నట్లు కనిపిస్తుంది.
(ఇదీ చదవండి: రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!)
ఇక మీడియాతో మనోజ్ మాట్లాడుతూ.. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు. కావాలనే అందరినీ పిచ్చోల్లని చేస్తున్నారు. నా కూతురు బర్త్ డే చేసుకోవడానికి ఏప్రిల్ 2 న వచ్చాము. ఇక్కడ పరిస్థితులు బాగోలేక పోవడంతో జైపూర్ కు వెళ్ళాము.
నా ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వండి. ఇంట్లో మూడు పెట్స్ ఉన్నాయి, అవి ఇవ్వమని అడుగుతున్నా. ఏరోజు నేను ఆస్తి కోసం కొట్లాడలేదు. నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నా. నేనంటే విష్ణుకి కుల్లు. కోర్టు ఆర్డర్ ఉన్నా నన్ను లోపలికి వెళ్ళి నివ్వడం లేదు. తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారు అని మనోజ్ భావోద్వేగానికి లోనయ్యాడు.