ప్యాషన్‌తో నిర్మించిన పేషన్‌ హిట్టవ్వాలి: దర్శకుడు శేఖర్‌ కమ్ముల | Passion Movie First Look Launch by Director Shekar Kammula | Sakshi
Sakshi News home page

ప్యాషన్‌తో నిర్మించిన పేషన్‌ హిట్టవ్వాలి: దర్శకుడు శేఖర్‌ కమ్ముల

Published Mon, Apr 28 2025 1:00 AM | Last Updated on Mon, Apr 28 2025 1:00 AM

Passion Movie First Look Launch by Director Shekar Kammula

అరుణ్‌కుమార్, సుధీష్, శేఖర్‌ కమ్ముల, అంకిత, అరవింద్‌

‘‘కొత్త ఫ్లేవర్‌తో వచ్చిన సినిమాలను ఆడియన్స్‌ ఆదరిస్తారు. ఈ ‘పేషన్‌’ సినిమాను కూడా అంతే అద్భుతంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. సుధీష్, అంకిత హీరో, హీరోయిన్లుగా అరవింద్‌ జాషువా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పేషన్‌’. నరసింహా యేలే, ఉమేష్‌ చిక్కు, రాజీవ్‌ సింగ్‌ ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ – ‘‘ఆనంద్‌’ సినిమా నుంచే నాకు అరవింద్‌ జాషువా పరిచయం. తనలో మంచి స్టోరీ టెల్లింగ్‌ క్రియేటర్‌ ఉన్నాడని అప్పుడే అనిపించింది. తను రాసిన పేషన్‌ నవలను చదివా. చాలా బాగుంది. ఇక అరవింద్‌ రూపొందించిన ఈ ‘పేషన్‌’ ఫస్ట్‌ ఆఫ్‌ ఇట్స్‌ కైండ్‌ ఫిల్మ్‌. కొత్త నిర్మాతలు ప్యాషన్‌తో ఈ మూవీ తీశారు’’ అన్నారు.

‘‘శేఖర్‌ కమ్ములగారి బ్లెస్సింగ్స్‌ లేకపోతే ఈ మూవీ అయ్యేది కాదు. ‘పేషన్‌’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌. ‘‘శేఖర్‌ కమ్ములగారికి నేను ఏకలవ్య శిష్ణుడ్ని. ఈ జనరేషన్‌కి కనెక్ట్‌ అయ్యే కథతో ‘పేషన్‌’ తీశాం. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అని అన్నారు అరవింద్‌ జాషువా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement