threatening messege
-
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు
-
Apple: స్పైవేర్ దాడులు జరగొచ్చు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మద్దతున్న సైబర్ నేరగాళ్లు మీ ఐఫోన్ తదితర యాపిల్ ఉత్పత్తులపై సైబర్‌దాడులు చేయొచ్చని గతంలో హెచ్చరించి తీవ్ర చర్చకు తెరలేపిన యాపిల్ సంస్థ తాజాగా మరోమారు అలాంటి హెచ్చరికనే చేసింది. పెగాసస్ తరహా అత్యంత అధునాతనమైన స్పైవేర్ దాడులు కీలకమైన పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరగొచ్చని యాపిల్ ఏప్రిల్ పదో తేదీ ఒక ‘థ్రెట్’ నోటిఫికేషన్లో పేర్కొంది. ‘‘కొనుగోలుచేసిన అధునాతన స్పైవేర్‌తో సైబర్ దాడులు జరిగే అవకాశాలను ముందే పసిగట్టి యూజర్లకు సమాచారం ఇవ్వడం, వారిని అప్రమత్తం చేయడం కోసం థ్రెట్ నోటిఫికేషన్లను రూపొందించాం. సాధారణ సైబర్‌నేరాల కంటే ఈ దాడులు చాలా సంక్షిష్టమైనవి. అత్యంత తక్కువ మందినే లక్ష్యంగా చేసుకుంటారు కాబట్టి ఎవరిపై, ఎందుకు దాడి చేస్తారో చెప్పడం కష్టం. అయితే దాడి జరిగే అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా అంచనావేసి ముందే యూజర్లను అప్రమత్తం చేస్తాం’’ అని థ్రెట్ నోటిఫికేషన్లో యాపిల్ హెచ్చరించింది. సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధమవుతున్న భారత్‌సహా 60 దేశాల్లోని యూజర్లకు యాపిల్ ఈ నోటిఫికేషన్లు పంపించింది. ఇజ్రాయెల్ తయారీ పెగాసస్ స్పైవేర్ సాయంతో మొబైల్ ఫోన్‌కు వాట్సాప్ ద్వారా మిస్డ్‌కాల్ ఇచ్చి కూడా ఆ ఫోన్‌ను సైబర్‌నేరగాళ్లు తమ నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ‘‘ఎవరైనా యూజర్‌ను సైబర్‌నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటే ముందే గుర్తించి ఆ యూజర్‌ను హెచ్చరిస్తాం. ఐఫోన్‌ను సైబర్‌భూతం నుంచి కాపాడాలంటే దానిని లాక్డౌన్ మోడ్‌లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ ఫోన్లో ఫింగర్‌ఫ్రింట్ సెన్సార్, ఫేఫియల్ రికగ్నీషన్, వాయిస్ రిగ్నీషన్ ఏవీ పనిచేయవు. ఒకవేళ మనమే మళ్లీ వాడుకోవాలంటే పిన్ లేదా పాస్‌కోడ్ లేదా ప్యాట్రన్ సాయంతోనే మళ్లీ ఫోన్‌ను పనిచేసేలా చేయొచ్చు’’ అని యాపిల్ సూచించింది. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 49 శాతం సంస్థలు తమ ఉద్యోగుల డివైజ్‌లపై సైబర్ దాడులు/ ఉల్లంఘన ఉదంతాలను పసిగట్ట లేకపోతు న్నాయి. భారత్‌లో లెక్కిస్తే మొబైల్ మాల్వే ర్ సాయంతో సగటు వారానికి 4.3 శాతం సంస్థలపై సైబర్ దాడులు జరుగుతు న్నాయి. అదే ఆసియాపసిఫిక్ ప్రాంతంలో అయితే గత ఆరు నెలల్లో సగటును 2.6 శాతం సంస్థలపై సైబర్ దాడులు చోటుచేసుకున్నాయి. -
Microsoft: సార్వత్రిక ఎన్నికలపై చైనా గురి
న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్ గ్రూప్‌లు గురిపెట్టాయని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ ఒక నివేదికలో వెల్లడించింది. సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే లక్ష్యంగా తప్పుడు సమాచారంతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి చైనా ప్రభుత్వం ఇలాంటి గ్రూప్‌లకు అండగా నిలుస్తోందని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లో ఎన్నికల విషయంలో చైనా అనుసరిస్తున్న ఎత్తుగడలపై మైక్రోసాఫ్ట్‌కు చెందిన ‘థ్రెట్ ఇంటెలిజెన్స్’ అధ్యయనం నిర్వహించింది. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి కృత్రిమ మేధ(ఏఐ)తో యాంకర్లను, మీమ్స్, ఆడియోలు, వీడియోలను సృష్టించి, సోషల్ మీడియాలో పోస్టు చేసే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ తెలియజేసింది. కొన్ని నెలల క్రితం జరిగిన తైవాన్ పార్లమెంట్ ఎన్నికల్లో చైనా సైబర్ గ్రూప్‌లు క్రియాశీలకంగా పని చేశాయని వెల్లడించింది. వీటికి చైనా మిత్రదేశమైన ఉత్తర కొరియా కూడా మద్దతిస్తోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేధ సాయంతో సృష్టించిన సమాచారంతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు స్వల్పమేనని తేలి్చచెప్పింది. ► చైనాకు చెందిన ఫ్లాక్స్ టైఫNన్ అనే సైబర్ కంపెనీ ఇండియా ఎన్నికలపై దృష్టి పెట్టిందని మైక్రోసాఫ్ట్ నివేదిక స్పష్టం చేసింది. ఈ కంపెనీ ప్రధానంగా టెలికమ్యూనికేషన్ల వ్యవస్థపై దాడులు చేస్తూ ఉంటుంది. ► భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)తోపాటు కేంద్ర హోంశాఖ కార్యాల యం, రిలయన్స్, ఎయిర్ ఇండియా వంటి కార్పొరేట్ సంస్థల ఆఫీసులను టార్గెట్ చేశామని చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న ఓ హ్యాకింగ్ గ్రూప్ ఫిబ్రవరిలో బహిరంగంగా ప్రకటించింది. ► భారత ప్రభుత్వానికి చెందిన 95.2 గిగాబైట్ల ఇమ్మిగ్రేషన్ డేటాలోకి హ్యాకర్లు చొరబడినట్లు ‘వాషింగ్టన్ పోస్టు’ పత్రిక అధ్యయనంలో వెల్లడయ్యింది. లీక్ చేసిన ఫైళ్లను హ్యాకర్లు గిట్‌హబ్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ► మయన్మార్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న అశాంతికి, సంక్షోభానికి భారత్, అమెరికా బాధ్యత వహించాలంటూ చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతున్న స్టార్మ్–1376 అనే సైబర్ కంపెనీ మాండరిన్, ఇంగ్లిష్ భాషల్లో ఏఐతో ఇటీవల వీడియోలు సృష్టించింది. ► మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో సమావేశమయ్యారు. కృత్రిమ మేధతో తలెత్తుతున్న ముప్పు, ఏఐతో సృష్టిస్తున్న డీప్‌ఫేక్ కంటెంట్‌పై చర్చించారు. ► కేవలం ఇండియా మాత్రమే కాదు, త్వరలో జరుగనున్న అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికలపైనా చైనా సైబర్ సంస్థలు దృష్టి పెట్టాయని మైక్రోసాఫ్ట్ గుర్తించింది. -
‘‘చంపేస్తాం’’.. మహిళా జడ్జికి బెదిరింపు లేఖ
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ మహిళా జడ్జికి చంపేస్తామని బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై ఆ మహాళా జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ మహిళా జడ్జి గతంలో తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపుల్లో భాగంగానే తనకు తాజాగా బెదిరింపు లేఖ వచ్చిందని ఆమె ఫిర్యాదులో తెలిపారు. లేఖ కవర్‌పై ఉన్న ఫ్రమ్ చిరునామా మొత్తం ఫేక్ అని, లేఖ వచ్చిన పోస్టాఫీసులో సీసీ టీవీ కెమెరా పరిశీలించాలని పోలీసులను జడ్జి కోరారు. ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటే ఫుటేజ్ పరిశీలించి నిందితుడిని అరెస్టు చేస్తామని తెలిపారు. జడ్జి గతంలో నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసు ప్రయాగ్‌రాజ్ పోలీసుల వద్ద పెండింగ్‌లోనే ఉంది. ఇదీ చదవండి.. అతనికి 35, ఆమెకు 42 -
ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీపై బాంబు పేలుడు? లేఖ లభ్యం
ఢ్లిలీ: ఢ్లిలీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద బాంబు బెదిరింపుల ఘటనలో ఢిల్లీ పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించారు. దీంతోపాటు గాజాపై ఇజ్రాయెల్ దాడులను విమర్శిస్తూ ఓ లేఖ కూడా లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. లేఖను ఇజ్రాయెల్ జెండాలో చుట్టారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ చర్యను ఎండగడుతూ ఢిల్లీలో ఆదేశ దౌత్యవేత్తకు దుండగులు లేఖ రాశారని వెల్లడించారు. ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఎంబసీపై బాంబు పేలుళ్లు జరుపుతామని బెదిరింపు కాల్ప్ వచ్చాయి. పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. కానీ ఆ శబ్దం పేలుళ్లకు సంబంధించిందేనని ఇజ్రాయెల్ ఎంబసీ స్పష్టం చేసింది. ఎంబసీపై దాడిగానే పరిగణించింది. ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది. #WATCH | Forensic teams and Dog squad of NSG carry out an investigation near the Israel Embassy. As per the Israel Embassy, there was a blast near the embassy at around 5:10 pm yesterday pic.twitter.com/X4lMPD2FR8 — ANI (@ANI) December 27, 2023 ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు సహా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) విస్తృతంగా గాలింపు చేపట్టగా ఓ లేఖ లభ్యమైంది. గాజాపై ఇజ్రాయెల్ చర్యను విమర్శిస్తూ అందులో పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటనపై నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఎంబసీ ప్రాంతంలో శబ్దం రసాయన పేలుడు అయి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎన్ఐఏ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. సమగ్రంగా దర్యాప్తు చేపడుతోంది. ఇదీ చదవండి: అమ్మోనియా గ్యాస్ లీక్.. 12 మందికి అస్వస్థత -
యాపిల్ బెదిరింపు నోటిఫికేషన్లు.. విచారణకు హాజరవనున్న అధికారులు
ప్రపంచ టెక్‌దిగ్గజ సంస్థ యాపిల్ ఇటీవల కొందరు ప్రతిపక్ష రాజకీయ నాయకులు, జర్నలిస్టులకు బెదిరింపు నోటిఫికేషన్లను పంపిన విషయం తెలిసిందే. దానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా సంస్థకు చెందిన విదేశాల్లోని సాంకేతిక, సైబర్ సెక్యూరిటీ నిపుణులు విచారణకు హాజరవనున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అక్టోబర్ 31న టీఎంసీకు చెందిన మహువా మోయిత్రా, శివసేన పార్టీకి చెందిన ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్‌లోని శశి థరూర్, ఆప్‌కు చెందిన రాఘవ్ చద్దా సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ నుంచి బెదిరింపు నోటిఫికేషన్ వచ్చిందని వివిధ సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. వారి ఫోన్లను స్థానికులు కొందరు తప్పుగా వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నోటిఫికేషన్ సారాశం. ఇదీ చదవండి: గూగుల్‌పేలో రీఛార్జిపై ఫీజు.. ఎంతంటే..? ఇదిలాఉండగా ప్రభుత్వమే ఈ చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో రాజకీయ దుమారం చలరేగింది. వారి వాదనలు ఖండించిన ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. దాంతోపాటు ఆ నోటిఫికేషన్లకు సంబంధించి యాపిల్ సంస్థ నుంచి వివరణ కోరింది. ఇప్పటికే దేశంలోని యాపిల్ ప్రతినిధులను ప్రభుత్వ అధికారులు విచారించారు. కానీ సంస్థ సాంకేతిక నిపుణులు విదేశాల్లో ఉండడంతో వారూ విచారణకు హాజరవ్వాలని ప్రభుత్వం కోరింది. వీసా సమస్య కారణంగా వారు ఇండియాకు రావడం ఆలస్యమైందని అధికారులు చెప్పారు. త్వరలో విచారణకు హాజరవుతారని చెప్పారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఈ విచారణను నిర్వహిస్తోంది. -
చంపుతామంటూ బెదిరిస్తున్నారు
ముంబై: తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనను, తన భార్యను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతూ చంపుతామంటూ గత నాలుగు రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని వాంఖడే పేర్కొన్నారు. వాంఖడే తన ప్రతినిధి ద్వారా ఈ మేరకు ఒక లేఖను దక్షిణ ముంబై పోలీస్ కమిషనరేట్‌కు పంపినట్లు ఒక అధికారి తెలిపారు. ‘క్రూయిజ్ డ్రగ్స్’ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను ఇరికించకుండా ఉండేందుకు రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సమీర్ వాంఖడేను శని, ఆదివారాల్లో సీబీఐ ప్రశ్నించింది. -
'ఏప్రిల్ 30న సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం'.. బెదిరింపు ఫోన్‌కాల్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఈనెల 30న సల్మాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. రాకీ భాయ్‌గా తనను పరిచయం చేసుకున్న అతను తనది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ అని చెప్పాడట. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా సల్మాన్ ఖాన్‌కు హత్యా బెదిరింపులు రావడం ఇదేం మొదటిసారి కాదు. గత నెలలోనూ రెండుసార్లు సల్మాన్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ వచ్చాయి. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ ఎదుర్కొన్న సల్మాన్‌ను హత్య చేస్తానంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కోర్టు ఆవరణలోనే బెదిరించిన సంగతి తెలిసిందే. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను చంపినట్లే సల్మాన్‌ను కూడా చంపేస్తామని బిష్ణోయ్ సన్నిహితుడు బెదిరించాడు. తాజాగా మరోసారి సల్మాన్ హత్యా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజులుగా కట్టుదిట్టమైన భద్రత మధ్యే బయటకు వెళ్తున్నారు. ఈ పరిణామాల మధ్య రీసెంట్గా సల్మాన్ హై సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
హస్తినకొస్తే అంతం చేస్తాం
ముంబై: ఓ గ్యాంగ్‌స్టర్ బృందం తనను చంపేస్తానని బెదిరించిందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. బెదిరింపుల అంశంపై వెంటనే ముంబైలో పోలీసులకు ఆయన ఫిర్యాదుచేశారు. ముంబైలో ఉండే సంజయ్‌రౌత్ ఢిల్లీకొస్తే ఏకే47 తుపాకీతో కాల్చిపడేస్తామని హెచ్చరిస్తూ ఆయనకు వాట్సాప్‌లో సందేశం పంపారు. ఈ ఘటనలో ముంబై పోలీసులు పుణేకు చెందిన 23 ఏళ్ల రాహుల్ తలేకర్‌ను అరెస్ట్‌చేశారు. కంజుర్మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో రౌత్ సోదరుడు, ఎమ్మెల్యే సునీల్ ఇచ్చిన ఫిర్యాదు, పోలీసు అధికారి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ రౌత్‌కు రాహుల్ తలేకర్ ముందుగా ఫోన్లో బెదిరించేందుకు ప్రయత్నించాడు. అది కుదరకపోవడంతో వాట్సాప్‌లో బెదిరిస్తూ మెసేజ్ చేశాడు. ‘రౌత్ హిందువులకు శత్రువు. నువ్వు ఢిల్లీలో కనిపించావంటే ఏకే47తో చంపేస్తా. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే నీకు పడుతుంది. లారెన్స్ నుంచి వచ్చిన హెచ్చరిక ఇది. నీ, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ల మరణం తథ్యం. ఇది ఫిక్స్’ అని హెచ్చరించాడు. మూసేవాలాను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బృందం చంపేసిందని ఆరోపణలు ఉన్న విషయం తెల్సిందే. దీంతో మెసేజ్‌లో పేర్కొన్న లారెన్స్‌ను లారెన్స్ బిష్ణోయ్‌గా పోలీసులు భావిస్తున్నారు. తలేకర్‌ను అరెస్ట్‌చేసిన పోలీసులు అతనిని విచారిస్తున్నారు. సోషల్‌మీడియా ద్వారా బిష్ణోయ్ గురించి తెల్సుకుని, మద్యం తాగిన మైకంలో అతను రౌత్‌కు బెదిరింపు సందేశం పంపినట్లు కేసు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు వార్తలొచ్చాయి. పాత్రా చావల్ కేసులో అరెస్టయి కస్టడీలో ఉన్నప్పుడు తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని, వీటిని భయపడేది లేదని రౌత్ స్పష్టంచేశారు. రౌత్‌ను హత్య చేస్తామని బెదిరింపులు రావడాన్ని మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రమైన అంశంగా పరిగణించాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్‌చేశారు. -
ఏకే-47తో కాల్చి చంపుతాం’.. సంజయ్ రౌత్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు
ముంబై: ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా మాదిరిగానే తనను కూడా హిందూ వ్యతిరేకిగా పేర్కొంటూ హత్య చేస్తామని బెదిరించినట్లు సంజయ్ రౌత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..ఢిల్లీలో కనపడితే, నిన్ను ఏకే-47తో కాల్చి చంపుతా. సిద్దూ ముసావాలాకు పట్టిన గతే నీకు పడుతుందనిని బెదిరించినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం (ఏక్నాథ్ షిండే) మా క్యాంపు నాయకులకు భద్రత తగ్గించింది. దీని గురించి నేను ఎప్పుడూ లేఖ రాయలేదు, కానీ పదే పదే సీఎం కుమారుడు గూండాలతో మాపై కుట్రకు ప్లాన్ చేసాడు. ఈ నేపథ్యంలో మా భద్రత విషయంగా ఎన్ని సార్లు తెలియజేస్తున్న హోం మంత్రిత్వ శాఖ, వీటన్నింటిని స్టంట్‌గా పరిగణిస్తోంది’ ప్రతిపక్ష నేతల భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బెదిరింపుల గురించి నేను పోలీసులకు తెలియజేశాను. నేను ఎవరికీ భయపడను. నేను జైలులో ఉన్నప్పుడు నాకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని’ సంజయ్ రౌత్ తెలిపారు. కాగా పంజాబీ గాయకుడు సిద్ధూ మూసావాలా భద్రతను తగ్గించిన తర్వాత గతేడాది మేలో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో ఆయన్ను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ఈ దాడికి బాధ్యత వహించారు. కాగా..రౌత్ ఫిర్యాదుపై ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులు వచ్చిన ఫోన్ నంబరును ట్రేస్ చేస్తున్నామన్న పోలీసులు.. ఓ అనుమానితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. -
Bhagwant Mann Daughter: ‘చంపేస్తాం’
ఢిల్లీ: పాక్ ప్రేరేపిత ఖలీస్తానీ సానుభూతిపరుడు, వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ కోసం గాలింపు ఉధృతం అయిన తరుణంలో.. ఖలీస్తానీ మద్దతుదారులు తీవ్ర చర్యలకు దిగుతున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులపై దాడులు చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ మేరకు తమకు బెదిరింపు లేఖలు, మెయిల్స్, సందేశాలు వచ్చినట్లు పలువురు విద్యార్థులు, రాజకీయ నేపథ్యం ఉన్న పలు భారతీయ కుటుంబాలు వాపోతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూతురు సీరత్ కౌర్‌కు సైతం ఈ బెదిరింపులు వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ చెప్పారు. సియాటెల్(సీటెల్)లో ఉంటున్న సీరత్ కౌర్‌కు చంపేస్తామని బెదిరింపులు వెళ్లాయట. ఈ మేరకు ఆమెకు భద్రత కల్పించాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని స్వాతి మలివాల్ కోరుతున్నారు. మరోవైపు ఈ బెదిరింపులకు సంబంధించిన విషయాన్ని హర్మీత్ బ్రార్ అనే అడ్వొకేట్ తన ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రస్తావించారు. బెదిరించినంత మాత్రానా?.. పిల్లలను తిట్టినంత మాత్రానా మీకు ఖలీస్తాన్ సిద్ధిస్తుందా? అని ఖలీస్తానీ మద్దతుదారులను ఉద్దేశించి పోస్ట్‌చేశారు. బెదిరింపులను సీరత్ కౌర్ తల్లి ఇందర్‌ప్రీత్ కౌర్ గ్రెవాల్ ధృవీకరించారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, తమను వదిలేయాలంటూ ఆమె ఖలీస్తానీలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇక.. స్థానిక గురుద్వారా నుంచే ఈ బెదిరింపులు వచ్చినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. ఇందర్‌ప్రీత్, భగవంత్ మాన్కు మొదటి భార్య. వీళ్లకు ఇద్దరు సంతానం. కూతురు సీరత్, కొడుకు దిల్షాన్ ఉన్నారు. 2015 నుంచి వీళ్లిద్దరూ విడిగా ఉంటుండగా.. తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆపై కొడుకు, కూతురితో ఇందర్‌ప్రీత్ విదేశాలకు వెళ్లి స్థిరపడింది. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది మాన్, గుర్ప్రీత్ కౌర్ అనే వైద్యురాలిని రెండో వివాహం చేసుకున్నారు. ఖలీస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అమెరికాకు చెందిన వేర్పాటువాద గ్రూప్, ‘సిక్స్ ఫర్ జస్టిస్’.. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు, రాజకీయ నేపథ్యం ఉన్న పలు భారతీయ కుటుంబాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్స్ బయటకు వచ్చాయి కూడా. అమెరికాతో పాటు యూరప్, ఆస్ట్రేలియాలో ఉన్న పలు ప్రాంతాల్లోనూ ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఖలీస్తానీ నేత(ఉగ్రవాది) జర్నైల్ సింగ్ భింద్రావాలేకు ప్రతిరూపంగా.. భింద్రావాలే 2.0 గా అమృత్‌పాల్‌సింగ్‌ను పిలుచుకుంటున్నారు ఖలీస్తానీ మద్దతుదారులు. గత 14 రోజులుగా అతని ఆచూకీ కోసం పంజాబ్ పోలీసులు విస్తృతంగా గాలింపు చేస్తున్నారు. ఈ క్రమంలో అతని అనుచరులను వంద మందికిపైగా అరెస్ట్ చేసి.. జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు పలు ప్రాంతాలు తిరుగుతూ, వేషాలు మారుస్తున్న అమృత్‌పాల్ సింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చక్కర్లు కొడుతున్నాయి. -
Nature Astronomy: కృత్రిమ ఉపగ్రహ కాంతితో భూమికి ముప్పు!
ఆధునిక సాంకేతిక యుగంలో మనషుల మనుగడ కృత్రిమ ఉపగ్రహాల (శాటిలైట్లు)పై ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. అన్ని రంగాల్లోనూ వీటి అవసరం పెరిగిపోతోంది. అయితే ఈ ఉపగ్రహాల కాంతి, విద్యుత్ బల్బుల వెలుగుతో పుడమికి పెద్ద ముప్పు వాటిల్లుతున్నట్లు ఇటలీ, చిలీ, గేలిసియా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. అధ్యయనం వివరాలను ‘నేచర్ అస్ట్రానమీ’ పత్రికలో ప్రచురించారు. రానున్న రోజుల్లో విపరిణామాలే: భూగోళం చుట్టూ ప్రస్తుతం 8,000కు పైగా శాటిలైట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి భూమిపై ప్రతి అంగుళాన్ని కవర్ చేస్తున్నాయి. స్పేక్‌ఎక్స్ సంస్థ 3,000కు పైగా చిన్నపాటి ఇంటర్నెట్ శాటిలైట్లను ప్రయోగించింది. వన్‌వెబ్ కూడా వందలాది కృత్రిమ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. దేశాల మధ్య పోటీ నేపథ్యంలో భవిష్యత్తులోనూ వీటి సంఖ్య పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు విద్యుత్ లైట్ల అవసరం పెరుగుతూనే ఉంది. శాటిలైట్ల నుంచి వెలువడే కాంతి, కరెంటు దీపాల నుంచి కాంతి వల్ల భూమిపై ప్రకృతికి విఘాతం వాటిల్లుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. వీటివల్ల రాత్రిపూట ఆకాశం స్పష్టంగా కనిపించడం లేదని తేల్చారు. ‘‘అంతేగాక ఖగోళ శాస్త్రవేత్తల విధులకూ ఆటంకం కలుగుతోంది. అస్ట్రానామికల్ అబ్జర్వేటరీల పనితీరు మందగిస్తున్నట్లు తేలింది. ఈ కాంతి కాలుష్యం కారణంగా రాత్రివేళలో అనంతమైన విశ్వాన్ని కళ్లతో, పరికరాలతో స్పష్టంగా చూడగలిగే అవకాశం తగ్గుతోంది. అంతేగాక భూమిపై జీవుల అలవాట్లలో, ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయి’’ అని వెల్లడించారు. దీనికి అడ్డుకట్ట వేసి సహజ ప్రకృతిని పరిరక్షించుకొనే దిశగా దృష్టి పెట్టాలని సూచించారు. పరిష్కారం ఏమిటి? కాంతి కాలుష్యానికి ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి పరిష్కార మార్గం లేదని నిపుణులు అంటున్నారు. దాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టడం మేలు. ‘‘శాటిలైట్లలో బ్రైట్నెస్ తగ్గించాలి. టెలిస్కోప్ పరికరాల్లోని షట్టర్లను కాసేపు మూసేయడం ద్వారా కాంతి తీవ్రతను తగ్గించవచ్చు’’ అని సూచిస్తున్నారు. కృత్రిమ ఉపగ్రహాలతో కాంతి కాలుష్యమే గాక మరెన్నో సమస్యలున్నాయి. కాలం తీరిన శాటిలైట్లు అంతరిక్షంలోనే వ్యర్థాలుగా పోగుపడుతున్నాయి. అంతరిక్ష కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. పైగా వీటినుంచి ప్రమాదకర విష వాయవులు వెలువడుతుంటాయి. ఆర్బిటాల్ ట్రాఫిక్ మరో పెను సమస్య. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీకేయూ నేత తికాయత్‌కు బెదిరింపులు
ముజఫర్‌నగర్(యూపీ): భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్, ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. రైతు సంఘాల ఆందోళనల నుంచి దూరంగా ఉండకుంటే రాకేశ్ తికాయత్, ఆయన కుటుంబాన్ని బాంబు వేసి చంపుతామంటూ ఓ ఆగంతకుడు ఫోన్ ద్వారా హెచ్చరించాడు. ఈ మేరకు రాకేశ్ తికాయత్ సోదరుడు గౌరవ్ తికాయత్, బీకేయూ అధ్యక్షుడు నరేశ్ తికాయత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిని గుర్తించి, పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని భవురా కలాన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో అక్షయ్ శర్మ చెప్పారు. రద్దయిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు సాగిన ఆందోళనలకు నాయకత్వం వహించిన రైతు నేతల్లో రాకేశ్ తికాయత్ ఒకరు. చట్టాలు రద్దయిన తర్వాత కూడా ఆయన దేశవ్యాప్తంగా వివిధ సమస్యలపై రైతు సంఘాలు చేపట్టే నిరసనల్లో పాల్గొంటున్నారు. -
కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. చెరుకు సుధాకర్, ఆయన తనయుడిని ఫోన్లో బెదిరించిన వ్యవహారానికి సంబంధించి ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నల్లగొండ వన్ టౌన్లో సుధాకర్ తనయుడు సుహాన్ నిన్న(సోమవారమే) ఫిర్యాదు చేశారు.దీంతో ఐపీసీ 506(నేరపూరిత బెదిరింపులు)తో పటు పలు సెక్షన్ల కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడైన డాక్టర్ చెరుకు సుధాకర్, ఆయన తనయుడు డాక్టర్ సుహాస్‌ను.. తన(కోమటిరెడ్డి) వాళ్లు చంపేస్తారంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్‌కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు తాను భావోద్వేగంతో చేసినవేనని, తనపై విమర్శలు చేయొద్దని మాత్రమే సుధాకర్ కొడుక్కి చెప్పానని కోమటిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాదు.. సంభాషణల్లో కొన్ని మాటలనే కట్ చేసి.. ఆడియోను లీక్ చేశారని, కాల్ రికార్డు చేస్తున్న విషయం కూడా తనకు తెలుసని కోమటిరెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఈ ఫోన్ సంభాషణను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్‌రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పంపించారు చెరుకు సుధాకర్. అలాగే.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారాయన. -
'నీకోసం ఎదురుచూస్తున్నాం'.. మెస్సీకి బెదిరింపులు
గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ జట్టు కప్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. గురువారం ఫిఫా వరల్డ్‌కప్ సాధించిన అర్జెంటీనా జట్టుతో పాటు సపోర్ట్ స్టాఫ్‌కు కలిపి మొత్తంగా 35 గోల్డ్ ఐఫోన్స్ ఆర్డర్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ దెబ్బకు మెస్సీపై ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. అంతేకాదు ఫిఫా వరల్డ్‌కప్ అందుకున్నప్పటి నుంచి మెస్సీ ఖాతాలో అవార్డులు వచ్చి చేరుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్‌కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. మెస్సీని లక్ష్యంగా చేసుకొని గుర్తుతెలియని దుండగులు బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. అర్జెంటీనాలోని రోసారియో నగరంలో మెస్సీ భార్య కుటుంబానికి చెందిన ఒక సూపర్ మార్కెట్‌పై అర్థరాత్రి వేళ కాల్పులు జరిపారు. 14 రౌండ్ల బులెట్లు పేల్చినట్లు సమాచారం. అనంతరం ''మెస్సీ.. నీకోసం ఎదురుచూస్తున్నాం'' అని నేలపై రాసి వెళ్లారు. రోసారియో నగర మేయర్ పాబ్లో జావ్కిన్ ఒక మాదకద్రవ్యాల డీలర్. అతను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోలేడు అని కూడా పేర్కొన్నారు. దీనిపై నగర్ మేయర్ జావ్కిన్ స్పందించాడు. దాడి జరిగింది నిజమేనని ఆయన ధ్రువీకరించారు. స్థానికంగా గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు భావిస్తున్నామన్నారు. ప్రపంచానికి మెస్సీపై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే కొంతమంది దుండగులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మెస్సీ పేరు వాడుకుంటే పాపులర్ కావొచ్చన్న ఉద్దేశంతో ఇలా చేసి ఉండొచ్చన్నారు. కొంతకాలంగా ఇలాంటి దాడులు వరుసగా జరుగతున్నాయన్నారు. పోలీసులు సైతం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే ఇలాంటివి చేస్తున్నారన్నారు. కాగా రొసారియో నగరం మెస్సీ స్వస్థలం. అయితే కొన్నేళ్లుగా రొసారియో నగరం మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది. 2022లో రొసారియో నగరంలో 287 హత్యలు జరగడం సంచలనం రేపింది. చదవండి: మెస్సీనా మజాకా.. జట్టు కోసం గోల్డ్-ఐఫోన్స్ మళ్లీ ఓడిన ఎంబాపె.. మెస్సీదే పైచేయి -
పోలీస్ అధికారిణికే తప్పని వేధింపులు...కీచక పోలీస్ అరెస్టు
ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట మహిళలు, చిన్నారులు లైంగిక వేధింపులు గురువుతూనే ఉంటున్నారు. సాధారణ మహిళలకే ఈ వేధింపులు అనుకుంటే తప్పే అవుతుంది. మహిళా పోలీసులు కూడా అందుకు అతీతం కాదు. ఇక్కడొక కీచక పోలీసు సాక్షాత్తు మహిళా పోలీస్ అధికారినే వేధింపులకు గురి చేసి కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకెళ్తే...ఒక అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ మహిళా పోలీసు అధికారిని లైంగిక వేధింపులకు గురిచేస్తూ... అసభ్యకరమైన సందేశాలు పంపించి బెదింపులకు గురి చేశాడు. దీంతో సదరు వ్యక్తి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. మహిళా పోలీస్ అధికారి ఫిర్యాదు మేరకు నిందితుడుని దీపక్ దేశముఖ్‌గా గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సదరు మహిళా అధికారి నిందితుడిపై ఫిర్యాదులు చేసినందుకే కోపంతో అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ సందేశాలు పంపిచనట్లు అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: అత్తారింటికి వెళ్లి కాల్పులు.. ఘరానా భర్త హల్చల్) -
వైరలైన తమ్మినేని కృష్ణయ్య పాత వీడియో.. ‘చావు ఎటునుంచైనా రావొచ్చు’
సాక్షి, ఖమ్మం రూరల్: తెల్దారుపల్లికి చెందిన తమ్మినేని కృష్ణయ్య హత్యకు ముందే గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో కృష్ణయ్యను పీక కొరికి చంపుతా అంటూ ప్రత్యర్థులు హెచ్చరించిన వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది. ఏడాదిన్నర క్రితం జరిగిన గ్రామసభలో కృష్ణయ్యకు–ప్రత్యర్థులకు నడుమ ఘర్షణ జరిగింది. ఇందులో ప్రత్యర్థులు చంపుతానని బెదిరించగా, ‘నేను ఎవరికీ భయపడేది లేదు, ప్రజల కోసం చావడానికైనా సిద్ధమే, నన్ను ఎవరైనా చంపొచ్చు లేదా యాక్సిడెంట్ రూపంలో చావచ్చు లేదా కాల్వలో పడి చావొచ్చు.. చావుకు భయపడే పిరికి వాడిని కాదు’ అన్న మాటలే నేడు నిజమయ్యాయని వీడియో చూసిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య (60)ను దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తల, చేతులపై తల్వార్లతో దాడి చేయడంతో తల ఛిద్రం కాగా రెండు చేతులు తెగిపడ్డాయి. అయితే ఈ వీడియో ఆధారంగా రాజకీయ కోణంలోనే కృష్ణయ్య హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: నారాయణ కాలేజీ వద్ద టెన్షన్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం -
కలకలం,ముఖేష్ అంబానీకి బెదిరింపు కాల్స్! అప్పుడు జిలెటిన్ స్టిక్స్..ఇప్పుడు
దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ పారశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన హరికిషన్ దాస్ హాస్పిటల్ ఫోన్ నెంబర్ నుంచి గుర్తు తెలియని దుండగుడు ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబసభ్యులకు 3సార్ల కంటే ఎక్కువ సార్లు ఫోన్ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన అంబానీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. థ్రెట్ కాల్స్‌పై సమచారం అందుకున్న డీబీ మార్గ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానితుల కోసం దర్యాప్తు ముమ్మం చేశారు. కాగా గతేడాది ముకేశ్ అంబానీ నివాసం 'ఆంటిలియా' వెలుపల 20 పేలుడు జిలెటిన్ స్టిక్స్ ఉన్న స్కార్పియో కారుతో పాటు బెదిరింపు లేఖ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ బెదిరింపులపై సమాచారం అందుకున్న పోలీసులు ముంబై ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ హిందూరావ్ వాజే (సచిన్ వాజే) నేతృత్వంలోని ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్‌తో సహా పలువురు పోలీసులు విచారణ కోసం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సచిన్ వాజే ఈ కేసును దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు జరుగుతుండగా..ఈ కేసులో సంబంధం ఉన్న థానేకు చెందిన వ్యాపారవేత్త మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పదగా మరణించారు. హిరేన్ మరణంగా ఆ కేసు ఎన్ఐఏ చేతిలోకి వెళ్లింది. కాగా, అంబానీ నివాసం వెలుపల దొరికిన స్కార్పియో తనదేనని యజమాని హిరేన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఆ తర్వాత అంటే మార్చి 5,2021న థానే సమీపంలో ఓ ముళ్ల పొదల్లో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆ కేసు విచారణ జరుగుతుండగా..ఈరోజు ముఖేష్ అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతుంది. చదవండి👉 ‘ప్రదీప్ శర్మకు నా భర్త కలెక్షన్ ఏజెంట్’ -
జనాల మీదకు యుద్ధ ట్యాంకర్లు.. మళ్లీ మారణహోమం?!
బీజింగ్: చైనాలో వరుస సంక్షోభాలు అక్కడి ప్రజలను అరిగోస పెడుతున్నాయి. తాజాగా కొన్ని బ్యాంకులు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో.. ఖాతాదారులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోనుపోనూ ఈ నిరసనలు పెను ఉద్యమంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రజలను నిలువరించేందుకు యద్ధ ట్యాంకర్లను రంగంలోకి దించించి జింగ్‌పిన్ సర్కార్. కొన్ని బ్యాంకులు ఏప్రిల్ నుంచి తమ ఖాతాదారులు నగదును విత్‌డ్రా చేసుకోకుండా అడ్డుకుంటున్నాయి.హెనన్ ప్రావిన్స్‌లో గ్రామీణ, పట్టణ బ్యాంకులు కారణాలు చెప్పకుండా ఖాతాదారులకు షాకులు ఇస్తున్నాయి. ఈ బ్యాంకుల స్కామ్‌కు ప్రభుత్వం నుంచి అండ లభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్నివారాలుగా బ్యాంక్ ఖాతాదారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదాలుచోటు చేసుకుంటున్నాయి. బ్యాంకుల మీద దాడులు జరుగుతాయనే ఉద్దేశం, బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవద్దనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో.. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ ట్యాంకర్లను బ్యాంకుల వద్ద మోహరిస్తోంది. నిరసనకారులు దాడులకు పాల్పడకుండా భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే నిరసనకారులు మాత్రం ఎంతకీ తగ్గడం లేదు. నిధుల నిలిపివేతను ఉపసంహరించుకుని.. తమ డబ్బుల్ని ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 🚨🚨🚨🚨Breaking news🚨🚨🚨🚨 Tanks are being put on the streets in China to protect the banks. This is because the Henan branch of the Bank of China declaring that people's savings in their branch are now 'investment products' and can't be withdrawn. 🔊sound pic.twitter.com/cwTPjGz84K — Wall Street Silver (@WallStreetSilv) July 20, 2022 చరిత్ర పునరావృతం అయ్యేనా.. తాజా వీడియోలతో అక్కడి జనాల వెన్నులో వణుకుపుడుతోంది. అందుకు కారణం.. టియానన్మెన్ స్క్వేర్ మారణహోమం గుర్తుకు రావడం. ప్రజాస్వామ్య పద్దతులు కావాలని, స్వేచ్ఛను కోరుతూ వేల మంది విద్యార్థులు బీజింగ్‌లోని టియానన్మెన్ స్క్వేర్ వద్ద నిరసనలు కొనసాగించారు. వాళ్లను అక్కడి నుంచి క్లియర్ చేయడానికి భారీగా ఆర్మీని రంగంలోకి దించింది ప్రభుత్వం. సుమారు నెలపాటు జరిగిన మారణ హోమంలో వందల మంది(వేల మంది అని చెప్తుంటారు) మరణించారు. వాళ్లకు స్మారకంగా.. అక్కడొక స్థూపాన్ని సైతం నిర్మించేందుకు అనుమతించలేదు. దీంతో హాంకాంగ్‌లో ఓ యూనివర్సిటీ బయట ఏర్పాటు చేశారు. అయితే.. ఆ స్మారకాన్ని సైతం బలవంతంగా తొలగించింది చైనా. అన్నట్లు మొన్న జూన్ 4వ తేదీకి టియానన్ మారణహోమానికి 33 ఏళ్లు నిండాయి. ఆ ఘటనలో.. యుద్ధ ట్యాంకర్ల ఎదురుగా ఓ వ్యక్తి ధైర్యంగా నిల్చున్న ఫొటో ఒకటి చరిత్రకెక్కింది కూడా. -
Hyderabad: యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోతో సినీనటి బ్లాక్మెయిల్
అమీర్‌పేట: ఓ వ్యక్తి యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోలను చూపించి బెదిరింపులకు పాల్పడిన సినీ నటిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల మేరకు.. సినీ పరిశ్రమలో పనిచేసే 28 ఏళ్ల యువరాజ్కుమార్కు అదే పరిశ్రమకు చెందిన 25 ఏళ్ల పడాల లక్ష్మి ఓ వీడియో పంపింది. అందులో అతడు ఓ యువతితో సన్నితంగా ఉన్న వీడియో ఉంది. తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో సామాజిక మాధ్యమాలలో వీడియోలను వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగింది. దీంతో అతడు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఏసీబీ అవినీతిపై ఆరోపణలు.. హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు
సాక్షి, బెంగళూరు: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అనేది కలెక్షన్ సెంటర్‌గా మారిందని, అదో అవినీతి కూపమైందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌పీ సందేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా ఆరోపించడం వల్ల తనకు బదిలీ బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సు, న్యాయం కోసం బదిలీ బెదరింపును ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు. 2021 మేలో రూ.5 లక్షల లంచంతీసుకుంటూ అరెస్టయిన బెంగళూరు అర్బన్ కలెక్టరేట్లోని డిప్యూటీ తహశీల్దార్ పీ.ఎస్.మహేశ్ సమర్పించిన బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో జస్టిస్ హెచ్.పీ.సందేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఏసీబీలో అక్రమాలను ప్రశ్నించినందుకు నాకు బదిలీ బెదిరింపు వచ్చాయి. గతంలో కూడా ఓ న్యాయమూర్తి ఇలా బదిలీ అయ్యారు. నాకు ఎవరైనా భయం లేదు. పిల్లికి గంట కట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. జడ్జి అయిన తరువాత ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదు. ఉద్యోగం పోయినా పర్వాలేదు. నేను రైతు కొడుకును. ఎలా జీవించాలో నాకు తెలుసు. 50 రూపాయలతో బతకగలను. అలాగే రూ.50 వేలతోనూ జీవించడం తెలుసు. నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు. రాజ్యాంగానికి మాత్రం కట్టుబడి ఉంటాను. ఏ పార్టీకి లొంగను’ అని స్పష్టం చేశారు. చదవండి: కేటీఆర్ సెటైర్, దేశ ప్రజలకు మోదీ అందించిన బహుమతి ఇదే! జడ్జి లకే భద్రత లేదు ఎస్ఐ నియామక అక్రమాలకు సంబంధించి ఏడీజీపీ అరెస్ట్ అయినే నేపథ్యంలో హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్రను సస్పెండ్ చేయాలని, సీఎం బసవరాజ బొమ్మై రాజీనామా చేయాలని సీఎల్పీ నేత సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కేపీసీసీ కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కళంకం వచ్చిందని, న్యాయ వ్యవస్థకు భద్రత లేని పరిస్థితి ఉద్భవించిందన్నారు. సోమవారం ప్రభుత్వ అధికారులు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. అధికారి అరెస్ట్ అయిన అర్ధ గంటలో ఆరోగ్య పరీక్షలకు పంపించారు. అంత త్వరగా విచారణ పూర్తి చేసింది ఎందుకు? అని అన్నారు. కుంభకోణానికి బాధ్యత వహించి సీఎం, హోంమంత్రి తప్పుకోవాలన్నారు. యడ్డి కొడుకుపై ఆరోపణలు మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర, మంత్రి అశ్వత్థ్ నారాయణ పీఎస్ఐ అక్రమ నియామకాల్లో ప్రమేయముందని, వీరిని సీఎం కాపాడుతున్నారని ఆరోపించారు. ఇక హైకోర్టు న్యాయమూర్తిని బెదరించారని, బదిలీ చేస్తామని భయపెట్టారని, న్యాయమూర్తికే భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. ఏసీబీ కలెక్షన్ బ్యూరో అయిందని విమర్శించారు. -
స్ఫూర్తి: తలవంచని పాట
పాడటం తప్పు కాదు... అదొక అద్భుతమైన కళ అయితే ఆ కళ కొందరికి కంటగింపుగా మారింది కశ్మీర్లో బహిరంగ వేదిక ఎక్కి ఒక అమ్మాయి పాట పాడటం అనేది అంత తేలికైన విషయం కాదు! వెర్రితలలు వేసే వెక్కిరింపులతో పాటు, ‘ప్రాణాలు తీస్తాం’ అని బెదిరింపులు కూడా ఎదురవుతుంటాయి. ఆ బెదిరింపులకు భయపడి ఉంటే కశ్మీర్‌లోని మారుమూల పల్లెలో పుట్టిన షాజియా బషీర్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించేది కాదు. ఎంతోమంది యువకళాకారులకు స్ఫూర్తిని ఇచ్చి ఉండేది కాదు... దక్షిణ కశ్మీర్‌లోని తాజివర అనే ఊళ్లో పుట్టింది షాజియ. చిన్నప్పటి నుంచి పాటలు అద్భుతంగా పాడేది. సంగీతంలో ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా, ఆ అందమైన ప్రకృతే ఆమెకు రాగాలు నేర్పిందేమో అన్నట్లుగా ఉండేది. పెరిగి పెద్దయ్యాక కూడా ఆమె పాట బాటను వీడలేదు. మిలే సుర్ (డిడి కశ్మీర్) అనే టీవీ కార్యక్రమానికి ఎంపిక కావడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. రకరకాల వడపోతల తరువాత ఎంపికైన నలుగురిలో తానొక్కతే అమ్మాయి. ఈ కార్యక్రమంతో షాజియాకు గాయనిగా ఎంతో పేరు వచ్చింది. మరోవైపు ‘రేడియో కశ్మీర్’ కోసం తాను పాడిన పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఏ ఊళ్లో సంగీత కార్యక్రమం జరిగినా తనను పిలిపించి పాడించేవారు. బాలీవుడ్ మసాలా పాటలు కాకుండా కశ్మీరి సంప్రదాయ జానపదగీతాలను పాడి అలరించేది. కొత్తతరానికి అవి కొత్త పాటలు, పాతతరానికి అవి మళ్లీ గుర్తు చేసుకునే మధురమైన పాటలు. ఎక్కడికైనా బస్‌లోనే వెళ్లేది. ఎంత రాత్రయినా తల్లిదండ్రులు తన కోసం బస్‌స్టాప్‌లో ఎదురు చూసేవారు. ఒకవైపు షాజియా గానమాధుర్యానికి అబ్బురపడి మెచ్చుకునేవాళ్లతో పాటు, మరోవైపు ‘వేదికలు ఎక్కి పాడడం ఏమిటి. ఊరూరూ తిరగడం ఏమిటీ’ అని విమర్శించేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. బెదిరింపులు కూడా వచ్చాయి. ఆ రోజులన్నీ తనకు నిద్రలేని రాత్రులే. ఈ వెక్కిరింపులు, బెదిరింపులను తట్టుకోవడం తన వల్ల కాదనుకొని ఒకానొక సమయంలో ‘పాట’కు శాశ్వతంగా దూరంగా జరగాలని అనుకుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు, సోదరుడు ధైర్యం చెప్పారు. తనను పాటకు మరింత దగ్గర చేశారు. ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నెన్నో దేశాల్లో తన పాటల అమృతాన్ని పంచింది షాజియ. నసీమ్ అక్తర్ మెమోరియల్ అవార్డ్, బక్షీ మెమోరియల్ కమిటీ అవార్డ్, సంగీత్ నాటక్ అకాడమీ... లాంటి ఎన్నో అవార్డ్లు అందుకున్న షాజియ సూఫీగీతాలతో పాటు హిందూ భక్తిగీతాలను మధురంగా ఆలపించడంలో అద్భుతం అనిపించుకుంది. 2014లో తండ్రి చనిపోవడంతో షాజియ గొంతులో దుఃఖం తప్ప ఏమీ లేకుండా పోయింది. అవి తనకు చీకటి రోజులు. అదేసమయంలో తండ్రి మాట ‘నువ్వు పాట ఎప్పుడూ ఆపవద్దు’ గుర్తుకు వచ్చి మళ్లీ పాడటం మొదలుపెట్టింది. తన పాట ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చింది. షాజియాను ఆదర్శంగా తీసుకొని ఈ తరం యువతులు సంగీతరంగంలో రాణిస్తున్నారు. ‘ఏ రంగంలో అయినా కష్టపడడం తప్ప విజయానికి దగ్గరి దారి అనేది లేదు’ అంటున్న షాజియా కష్టపడే తత్వానికి ఆత్మస్థైర్యాన్ని కూడా జోడించింది. -
కాల్చి చంపేస్తా.. భార్య, పిల్లలకు రివాల్వర్‌తో బెదిరింపులు
సాక్షి,,హైదరాబాద్: తాగిన మైకంలో భార్య పిల్లలను రివాల్వర్‌తో కాల్చి చంపేస్తానని బెదిరించిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వనస్థలిపురం సీఐ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గద్వాల పట్టణానికి బానాల అజయ్‌కుమార్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీబీఐ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతను 2004 నుంచి 2010 వరకు హైకోర్టులో పీపీగా పని చేశాడు. 2002లో అతను రమాదేవిని వివాహం చేసకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. నాంపల్లి కోర్టులో పీపీగా పని చేస్తున్న సమయంలో అతను వ్యక్తిగత భద్రత కోసం గన్‌లైసెన్స్ తీసుకున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన అజయ్‌కుమార్ మద్యం మత్తులో భార్య, పిల్లలను వేధిస్తున్నాడు. ఈ నెల 19న రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అతను కుమార్తె శారదను చంపేస్తానని నుదుటిపై రివాల్వర్ పెట్టి బెదిరించాడు. దీంతో అతడి భార్య రమాదేవి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రివాల్వర్, కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. రివాల్వర్ లైసెన్స్‌ను రాచకొండ సీపీ రద్దుచేసినట్లు సీఐ తెలిపారు. -
చంపేస్తామని బెదిరించారు: తనికెళ్ల భరణి
తనికెళ్ల భరణి.. నటుడిగా, రచయితగా తెలుగువారందరికీ సుపరిచితమే. తన విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఆయన నిజ జీవితంలోబెదిరింపులను సైతం ఎదుర్కొన్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ విషయాలను వెల్లడించాడు. ఊహ సినిమాలో కీలక పాత్ర పోషించిన తనికెళ్ల భరణి.. ఆ సినిమాలో కాస్త విలనిజం కనబరుస్తాడు. భర్త చనిపోయిన మరదలిపై కన్నేసిన ఊహ బావ పాత్రలో తనికెళ్ల నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నటనకు ఎంత గుర్తింపు వచ్చిందో అదే స్థాయిలో బెదిరింపులు కూడా వచ్చాయట. ఆ సినిమా అనంతరం కొందరు మహిళలు తనను చంపేస్తామంటూ బెదిరించారు. అది నిజం కాదు.. కేవలం నటన మాత్రమే అని చెప్పినా కొందరు వినిపించుకునేవాళ్లు కాదు. నటన అంటే ప్రేక్షకులు అంతలా మమేకమైపోతారు అంటూ చెప్పుకొచ్చారు. -
‘మీతో ఇంపార్టెంట్ మ్యా టర్ ఉంది. మీకు నేను చెప్పాలి, మీరు నాకు ఒక మ్యాటర్ పంపాలి’
హిమాయత్‌నగర్: ‘మీతో ఇంపార్టెంట్ మ్యా టర్ ఉంది. మీకు నేను చెప్పాలి, మీరు నాకు ఒక మ్యాటర్ పంపాలి’ అంటూ టీఎస్ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జీవన్ ప్రసాద్ కు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నుంచి ఈ నెల 4న మెయిల్ వచ్చింది. మంత్రి నుంచి మెయిల్ రావడమేమిటనుకుని చూసిన సదరు అధికారి ఇదేదో సైబర్ నేరగాడు చేసిన పని కావొచ్చని భావించి అప్రమత్తమయ్యారు. సోమవారం జీవన్ ప్రసాద్ సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: కౌన్సిలర్లకు ‘కరెంటు’షాక్!) -
నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు: గౌతం గంభీర్
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ పోలీసులను ఆశ్రయించాడు. ఐసిస్ కశ్మీర్ నుంచి బెదరింపు కాల్స్ వస్తున్నాయని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో.. ఐఎస్ఐఎస్ కశ్మీర్ ఉగ్రవాదుల నుంచి తనకు ఈ-మెయిల్ ద్వారా హత్య బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. బెదిరింపులకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గంభీర్ నివాసం వెలుపల పోలీసులు భద్రతను పెంచారు. కాగా గంభీర్ ఈస్ట్ ఢిల్లీకి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: ఫ్రాన్స్ అమ్మాయితో బిహార్ కుర్రాడి ప్రేమ.. కట్ చేస్తే ఒక్కటైన జంట -
కోహ్లి కుమార్తెకు బెదిరింపులు: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్
-
కోహ్లి కుమార్తెకు బెదిరింపులు: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్
Person Arrest In Hyderabad For Threatening Virat Kohli.. విరాట్ కోహ్లీపై బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు బుధవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. విషయంలోకి వెళితే.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అనంతరం.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని టార్గెట్ చేస్తూ.. కోహ్లి కూతురు వామికాను అత్యాచారం పేరుతో సోషల్ మీడియాలో కొందరు దుండగులు అసభ్యకర పోస్టులు చేశారు. చదవండి: Virat Kohli- Vamika: కోహ్లి కూతురిపై విషం చిమ్మిన నెటిజన్.. ఛీ ఇంతకు దిగజారుతారా? తాజాగా కోహ్లి కూతుర్ని అత్యాచారం పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ వారిలో హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల రామ్‌నగేష్ ఉన్నట్లు సైబర్ క్రైమ్ గుర్తించింది. ఈ మేరకు బుధవారం ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా పాక్‌తో మ్యాచ్ ఓడిన తర్వాత నగేష్ సోషల్ మీడియాలో కోహ్లి కూతురు గురించి అసభ్యకర మెసేజ్‌లు పెట్టినట్లు తేలింది. కాగా నగేష్ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. -
షూటింగ్ చేస్తుండగా చంపేస్తామని బెదిరించారు: సత్యదేవ్
సత్యదేవ్ ఈ పేరుకి తెలుగు పరిశ్రమలో పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదట్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఈ నటుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే గాక ఇటీవలే బాలీవుడ్ లోనూ అడుగు పెట్టాడు. ప్రస్తుతం సత్యదేవ్ తీవ్రవాదం నేపథ్యంలో రూపొందుతున్న హబీబ్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. హబీబ్ చిత్రం చిత్రీకరణ సమయంలో.. తీవ్ర ఆటంకాలు, ప్రమాదాల నడుమ భయపడుతూ రూపొందించినట్లు తెలిపాడు. ఎందుకంటే గత కొంత కాలంగా ఆఫ్ఘన్ దేశాన్ని తాలిబన్లు తిరిగి దక్కించుకునేందుకు భీకరంగా పోరాటం సాగిస్తున్న క్రమంలో చిత్ర బృందం ఆ దేశానికి వెళ్లి షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఇందులో ప్రాణాలకు రిస్కీ అని తెలిసినా సత్యదేవ్ కథ కోసం షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇదిలా వుండగా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు కాల్ చేసి చంపేస్తామంటూ బెదిరించారని తెలిపాడు. ఆర్మీ తరహా దుస్తులు ధరించి సత్యదేవ్ పై చిత్రీకరణను చేయగా అతడి వేషధారణ కారణంగా ఒక దశలో తాలిబాన్ అని పొరపాటు పడ్డారట. స్థానిక పోలీసుల కోసం సందేహాలను నివృత్తి చేయడానికి భారత రాయబార కార్యాలయం వారి ఆధారాలను చూపించాల్సి వచ్చిందట. ప్రమాదకర ప్రాణహాని ఉన్నా సినిమా పై తనకు ఉన్న ఫ్యాషన్‌ని ఈ నటుడు విడవకపోవడం విశేషం. ఇటీవల సత్యదేవ్ తిమ్మరసు చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
సాస్ ఇవ్వలేదని రెస్టారెంట్‌ను బాంబులతో పేల్చేస్తానన్నాడు.. చివరికి
ఆహారం విషయంలో కొంతమంది భోజన ప్రియులు కచ్చితంగా ఉంటారు. అలాగే వారికి నచ్చిన ఆహారం కోసం గతంలో కొందరు వందల కిలోమీటర్లు వెళ్లిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇంత వరకు ఓకే గానీ ఏదైనా సృతి మించకూడదని అంటారు. కాగా ఓ వ్యక్తి ఆ విషయంలో చాలా దూరం వెళ్లాడు. ఎంతంటే ఏకంగా రెస్టారెంట్‌ను బాంబులతో పేల్చేస్తానంటూ ఆ యజమానికే కాల్ చేసి బెదిరిస్తూ రెచ్చిపోయాడు. అసలు అతనికి అంతలా ఆగ్రహానికి గల కారణం తెలిస్తే షాక్ అవుతారు. మరేమీ లేదండీ.. సాస్ ఇవ్వడం మరిచిపోయాడని అతను అంత రచ్చ చేశాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లోవాలో నివసిస్తున్న రోబర్ట్ గాల్విట్జెర్ ఫుడ్ రెస్టారెంట్ సంస్థ మెక్ డొనాల్డ్స్‌కు ఫోన్ చేసి చికెన్ నగ్గెట్స్ ఆర్డర్ చేశాడు. మెక్‌డొనాల అంటేనే చికెన్ నగ్గెట్స్, బర్గర్స్కి ప్రత్యేకమని అందరికీ తెలిసిన విషయమే. ఇంకేముంది రుచికరమైన వంటకం వస్తోంది, ఓ పట్టు పట్టాలి అని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అతనికి చికెన్ నగ్గెట్స్ అందాయి. కానీ, అవి డిప్ చేసి తినేందుకు అందులో సాస్ ఇవ్వడం ఆ రెస్టారెంట్ సిబ్బంది మరిచిపోయారు. అసలు సాస్ లేకుండా ఎలా డెలివరీ చేస్తారని మనోడికి కోపం వచ్చింది. వెంటనే డెలివరీ సిబ్బందిని కొట్టడమే కాకుండా, రెస్టారెంట్‌కు ఫోన్ చేసి.. బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గాల్విట్జెర్‌ను అరెస్టు చేశారు. చదవండి: వాంటెడ్ క్రిమినల్‌గా ‘మార్క్ జుకర్‌బర్గ్’.. పట్టిస్తే రూ.22కోట్లు -
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి: ఐఏఎస్ అధికారి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న యువ ఐఏఎస్ అధికారి ఒకరు తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉంది.. పోలీసు ప్రొటేక్షన్ కల్సించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సదరు ఐఏఎస్ అధికారి సిగ్నల్ యాప్ మెసేజింగ్ గ్రూప్‌లో రాష్ట్ర అధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో సదరు ఐఏఎస్ అధికారికి బెదిరంపు కాల్స్ వస్తున్నాయట. ఈ క్రమంలో తనకు, తన కుటుంబానికి పోలీస్ ప్రోటెక్షన్ కల్సించాల్సిందిగా కోరుతున్నాడు. ఆ వివరాలు.. 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి లోకేశ్ కుమార్ జంగిడ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ కుమార్ ఓ మేసేజింగ్ గ్రూప్‌లో కొందరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. అవి కాస్త లీక్ అవ్వడంతో ఇప్పటికే ప్రభుత్వం ఆయనకు నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణారహిత్య చర్యలుగా పేర్కొంటూ.. వారం లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాత్రి 11 గంటల సమయంలో ఓ కొత్త నంబర్‌నుంచి తనకు కాల్ వచ్చిందని.. ఫోన్లో సదరు వ్యక్తి తనను మీడియాతో మాట్లాడటం మానేయాలని.. ఆరు నెలల పాటు లీవ్ మీద వెళ్లాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించినట్లు లోకేశ్ కుమార్ తెలిపాడు. ఈ క్రమంలో తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని.. పోలీస్ ప్రోటెక్షన్ కల్సించాల్సిందిగా కోరుతూ లోకేశ్ కుమార్, మధ్యప్రదేశ్ డీజీపీకి వివేక్ జోహ్రికి లేఖ రాశారు. భోపాల్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఇక వ్యక్తిగత కారణాలను చూపుతూ లోకేశ్ తన సొంత రాష్ట్రం మహారాష్ట్రకు తనను డిప్యూటేషన్ మీద పంపించాల్సిందిగా కోరాడు. ఇక లీకైన చాట్‌లో లోకేశ్ తాను అవినీతిని ఏమాత్రం సహించలేనని.. అందుకే తనను తరచుగా బదిలీ చేస్తారని తెలిపారు. నాలుగేళ్ల తన సర్వీసులో ఇప్పటికే తనను 9సార్లు ట్రాన్స్ఫర్ చేశారని తెలిపాడు. చదవండి: ఐఏఎస్ భావోద్వేగం.. ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా -
‘ఒంటిపై ఉన్న ఖాకీ చొక్కాను తొలగిస్తా జాగ్రత్త’
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఇన్స్పెక్టర్ను వాట్సాప్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన రౌడీషీటర్‌పై మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఒంటిపై ఉన్న ఖాకీ చొక్కాను తొలగిస్తా జాగ్రత్త... అంటూ దురుసుగా మాట్లాడటమే కాకుండా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఆర్ఎస్ఎస్ నాయకుడిలా వ్యవహరిస్తున్న మీరు మాతో పెట్టుకుంటే తగిన మూల్యం చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్ సంభాషణ వైరలైంది. వివరాల ప్రకారం... రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా నమోదైన ఆసిఫ్ ఇక్బాల్ రెండు రోజుల క్రితం మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ రవి కుమార్‌ను దూషిస్తూ హెచ్చరించారు. మొఘల్‌పురా పరిధిలో జరిగిన ఒక సంఘటన విషయంలో స్థానిక మజ్లిస్ పార్టీ కార్పొరేటర్‌తో పాటు రౌడీషీటర్ ఆసిఫ్ ఇక్బాల్ ఫోన్లో అమర్యాదగా మాట్లాడారు. పోలీసుల విచారణలో ఆసిఫ్ ఇక్బాల్‌గా రౌడీషీటర్ అని గుర్తించారు. ఇతనిపై ఇప్పటికే రెయిన్‌బజార్, చాంద్రాయణగుట్ట, మొఘల్‌పురా పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసిఫ్ ఇక్బాల్ యెమెన్ దేశంలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ రవి కుమార్ తెలిపారు. ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. చదవండి: కరోనాతో గాంధీ భవన్ అటెండర్ షబ్బీర్ మృతి నాన్నా.. ఇక రావా..? మమ్మల్ని ఎవరు చూస్తారు? -
అమిత్, యోగీలను చంపేస్తాం
సాక్షి ముంబై: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను చంపేస్తామని బెదిరిస్తూ సీఆర్పీఎఫ్కు కార్యాలయానికి ఒక మెయిల్ అందింది. ముంబైలోని సీఆర్పీఎఫ్ కేంద్ర కార్యాలయానికి ఇటీవల అందిన ఆ మెయిల్ విషయం మంగళవారం బయటకు పొక్కింది. షా, యోగిలతోపాటు దేశంలోని ప్రార్థనా స్థలాలు, ప్రాముఖ్యం ఉన్న ప్రాంతాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడతామనీ, ఇందుకోసం 11 మంది ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. మెయిల్‌ను సీఆర్పీఎఫ్ అధికారులు విచారణ నిమిత్తం దర్యాప్తు సంస్థలకు పంపడంతోపాటు ఆ ఇద్దరు వీవీఐపీ నేతల భద్రతను పటిష్టం చేశారు. అయితే, బీజేపీ సీనియర్ నేతలైన వీరిద్దరికీ బెదిరింపు లేఖలు గతంలోనూ వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో యోగిని చంపుతామంటూ ‘డయల్ 112’కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. గత ఏడాది నవంబర్‌లో కూడా యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ వాట్సాప్ మెసేజీ రాగా పోలీసులు విచారణ చేపట్టి ఆగ్రాకు చెందిన ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఉండగా, మావోయిస్టులపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మూడు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మంగళవారం ఆయన బాసగూడ సీఆర్పీఎఫ్ క్యాంపును సందర్శించి, జవాన్లనుద్దేశించి మాట్లాడారు. (ఇది ఆరంభం మాత్రమే : కంగనా సంచలన వ్యాఖ్యలు) -
ఆస్ట్రేలియాకు గూగుల్ బెదిరింపులు
వెల్లింగ్టన్: ‘బెదిరింపులపై మేం స్పందించం. కానీ మీరు చేయగలిగే స్థాయిలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టాలు చేస్తుంది’.. ఇదీ గూగుల్ బెదిరింపులకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇచ్చిన సమాధానం. వివరాల్లోకెల్తే.. ఆస్ట్రేలియాలోని మీడియా సంస్థలకు చెందిన వార్తలను గూగుల్ ఉపయోగించు కుంటున్నందుకుగానూ ఆయా మీడియా సంస్థలకు డబ్బు చెల్లించేలా ఆస్ట్రేలియా ఇటీవల కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ చట్టాలపై గూగుల్ బెదిరింపు వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ల గూగుల్ డైరెక్టర్ మెల్ సిల్వా మాట్లాడుతూ.. ‘ఈ కోడ్ గనక చట్టంగా మారితే, గూగుల్ సెర్చ్‌ను ఆస్ట్రేలియాలో లేకుండా చేయడం తప్ప ఇంకేమీ చేయలేం. అప్పుడు మా ప్రొడక్ట్‌లను ఉపయోగించే దేశ ప్రజలకు అది బ్యాడ్ న్యూస్’ అంటూ ఆ దేశ సెనెటర్లకు చెప్పారు. మీడియా సంస్థలకు డబ్బు చెల్లించడానికి తాము సిద్ధమేనని, అయితే చట్టంలో ఉన్న నియమాల ప్రకారం కాదని చెప్పారు. -
‘ది కశ్మీరీ ఫైల్స్’.. బెదిరింపులకు భయపడను
వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మించిన చిత్రం ‘ది కశ్మీరీ ఫైల్స్’. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, ప్రకాశ్ బెల్వాడి, మృణాల్ కులకర్ణి, పునీత్ ఇస్సార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తీసినవాళ్లను, చూసే ప్రేక్షకులను వదిలేదు లేదంటూ కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ బెదిరించినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘కశ్మీరీ హిందువులపై సాగిన మారణహోమం గురించిన నిజాలు ఇప్పటి తరంలో చాలామందికి తెలియదు. అందుకే ఈ సినిమా తీయాలనుకున్నాను. ఏప్రిల్‌లో సినిమా రిలీజ్ అనుకుంటున్నాం. ఈ సినిమా షూటింగ్‌ను జమ్మూ–కశ్మీర్లో చేసినప్పుడు ఇబ్బందులు ఎదురవలేదు. కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ నన్ను డైరెక్ట్‌గా బెదిరించలేదు. కానీ బెదిరిస్తున్నట్లు ముంబైలో ఉన్న నా స్నేహితులు చెప్పారు. మా సినిమా పోస్టర్, టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. అలాంటప్పుడు సినిమా ఎలా ఉంటుందో వారి కెలా తెలుస్తుంది? ప్రజలకు వాస్తవాలు చూపిస్తున్నప్పుడు భయమెందుకు? ఎవరి బెదిరింపులకూ భయపడి సినిమా రిలీజ్ ఆపం. ఈ సినిమా వెనక ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలం లేదు. ఇలాంటి వాస్తవ కథలను తెరకెక్కిస్తున్నప్పుడు ప్రభుత్వాలు అండగా ఉండాలి. అప్పుడే మరిన్ని సినిమాలను ధైర్యంగా తీయగలుగుతాం. ప్రస్తుతం ‘ది కశ్మీరీ ఫైల్స్, ఏ1 ఎక్స్‌ప్రెస్’, ‘రాజ రాజ చోర’ చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘కార్తికేయ 2, గూఢచారి 2, అబ్దుల్ కలాం బయోపిక్’ త్వరలో ఆరంభమవుతాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌ని హిందీ–తెలుగులో నిర్మిస్తాం’’ అన్నారు. -
చంపేస్తాం! బాలీవుడ్ భామకు బెదిరింపు కాల్స్..
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బ్యూటీ భామ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఎమ్ఎస్ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం భాయిజాన్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఓ వైపు చేతినిండా సినిమాలతోపాటు మరోవైపు ఫోటో షూట్లతో అభిమానులను ఊర్రూతలుగిస్తోంది దిశా. ఆమె ఏ డ్రెస్ ధరించిన తన అందాలతో కుర్రకారులను మత్తెక్కిస్తుంటుంది. ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో తరుచూగా పోస్టు చేస్తుంటుంది. అలా లైఫ్‌ను హ్యపీగా లీడ్ చేస్తున్నఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రమాదంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. చదవండి: నాలుగు నెలల్లో సలార్ పూర్తి దిశాపటానీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. హీరోయిన్‌కు ఫోన్ చేసి తనను చంపేస్తామని భయపెడుతున్నట్లు సమాచారం. అంతేగాక పోలీస్ స్టేషన్లకు కూడా కాల్స్ చేసి మీ అమ్మాయి(దిశా పటానీ) ఇంకా ఎవరూ రక్షించలేరని బెదిరిస్తున్నారట. ఈ కాల్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్నట్లు, కాల్ చేసిన వ్యక్తి దిశాను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ వల్ల దిశా ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లు సమాచారం. అయితే బెదిరింపు కాల్స్‌పై పోలీసులు దృష్టి పెట్టినట్లు, దీని వెనుక ఉన్న సూత్రధారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు కూడా తెలుస్తోంది. చదవండి: మహేశ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనా.. వీడియో వైరల్ -
ఆ హీరోయిన్ నాలుక కోసేయండి : పొలిటీషియన్
బాలీవుడ్ నటి రీచా చద్దా మెయిన్‌లీడ్‌గా నటిస్తోన్న చిత్రం 'మేడమ్ చీఫ్ మినిస్టర్' విడుదలకు ముందే వివాదాస్పదం అవుతోంది. తాజాగా రిలీజైన ఈ సినిమా పోస్టర్ దళితులను అవమానించేలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటరానివారు అనే పదాన్ని ఈ చిత్రంలో ఉపయోగించారని, మెయిన్‌లీడ్ పోషించిన రీచా చీపురు పట్టుకున్నట్లు చూపించడం కూడా అభ్యంతరకంగా ఉందని, దీన్ని చిత్రం నుంచి తీసేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే తనకు వందల సంఖ్యలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నటి రీచా పేర్కొన్నారు. ఆమె నాలుకను కోసేయండంటూ ఓ రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ..మేం ఎవరికీ భయపడం అంటూ రీచా ట్వీట్ చేశారు. (నటిపై ఆరోపణలు; రూ. కోటి పరువు నష్టం దావా) View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) మరోవైపు నటి స్వర భాస్కర్ సహా పలువురు రీచాకు మద్దతు తెలుపుతున్నారు. సినిమా పరంగా విమర్శించే హక్కు ఉంటుంది కానీ ఇలా హింసకు ప్రేరేపించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఇలాంటి నేరపూరిత బెదిరింపులకు వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ నిలబడాలని తెలుపుతూ నాట్ ఓకే (not ok)అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఓ సాధారణ మహిళ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగిందనే కథాంశంతో పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇందులో హీరోయిన్గా నటించిన రీచా చద్దా పాత్ర మాయావతిలా కనిపిస్తుండం ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈనెల 22న విడుదల కానున్న ఈ చిత్రంలో సౌరభ్ శుక్లా, మనావ్ కౌల్, అక్షయ్ఒబేరాయ్ ముఖ్యపాత్రలు పోషించారు. (ఆ రెండింటి విషయంలో కంట్రోల్‌గా ఉండలేను) -
అత్యాచారం చేసి చంపేసేవాడు: అమీషా పటేల్
ముంబై: బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తనకు భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయని.. ఒకానొక సమయంలో తనపై అత్యాచారం చేసి చంపేస్తారేమో అని భయపడ్డానని తెలిపారు బాలీవుడ్ నటి అమీషా పటేల్. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్ జన్‌శక్తి పార్టీ అభ్యర్థి ప్రకాశ్ చంద్ర తరఫున బిహార్‌లోని దౌద్‌నగర్‌లో ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపారు. ప్రాణాలు కాపాడుకోవటానికి.. క్షేమంగా బయటపడటానికి వారు చెప్పినట్లు ఆడాల్సి వచ్చింది అన్నారు. ఈ మేరకు ఓ ఆడియో క్లిప్‌ని విడుదల చేశారు. తనకు ఎదురయిన భయానక అనుభావాలను ఓ పీడకలగా వర్ణించారు అమీషా పటేల్. (చదవండి: ఆయనే సంపన్న అభ్యర్థి.. ఆస్తి ఎంతంటే!) ఈ సందర్భంగా అమీషా మాట్లాడుతూ.. ‘దౌద్ నగర్లో ప్రకాశ్ చంద్ర కోసం ప్రచారం చేస్తున్నప్పుడు అతడు నన్ను బెదిరించాడు.. బ్లాక్ మెయిల్ చేశాడు. నిన్న సాయంత్రం ముంబై వచ్చాక కూడా అతడు బెదిరింపు కాల్స్ చేయడం, సందేశాలు పంపడం చేశాడు. తన గురించి గొప్పగా మాట్లాడాలని కోరాడు. అతని వల్ల నిన్న సాయంత్రం నాకు ఫ్టైట్ మిస్ అయ్యింది. దాంతో అతడు నన్ను ఓ గ్రామంలో ఉంచాడు. తను చెప్పినట్లు వినకపోతే అక్కడే వదిలేసి వెళ్తానని బెదిరించాడు. ఆ సమయంలో అతడు చెప్పినట్లు వినకపోతే నాపై అత్యాచారం చేసేవాడు.. చంపేసేవాడు. నా కారును అతడి మద్దతుదారులు అడ్డగించేవారు. అతడి మాట వినేంతవరకు నా కారును కదలనిచ్చేవారు కాదు. అతడు నన్ను ట్రాప్ చేసి నా జీవితాన్ని ప్రమాదంలో పెట్టాడు ఇది అతడి ఆపరేటింగ్ సిస్టం’ అంటూ అమీషా ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: మేనిఫెస్టోలు–‘ఉచితా’నుచితాలు) అయితే ఈ వ్యాఖ్యలను ఎల్జేపీ అభ్యర్థి ప్రకాశ్ చంద్ర ఖండించారు. ఆమె కార్ షో కోసం అన్ని రకాల భద్రతా నిబంధనలు చేసినట్లు తెలిపారు. ప్రజల మద్దతుతో నేను గెలవాలనుకున్నాను. కానీ నా బంధువుల్లో ఒకరు ఒబ్రాలో అమీషా పటేల్ ర్యాలీ నిర్వహించారు. దౌద్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అమీషా పటేల్ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆమె ఆరోపించిన సంఘటనలు ఏవి జరగలేదు. బిహార్‌లో ఆర్టిస్టులు లేరా.. సోనాక్షి సిన్హా కూడా ఇక్కడి నుంచే ఉన్నారు. అమీషా విమానాశ్రయంలో పప్పు యాదవ్‌ను కలిశారు. వారు 15 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారు” అని తెలిపాడు. అంతేకాక తనకు అనుకూలంగా వీడియో చేయడానికి అమీషా పటేల్ ఎక్కువ డబ్బు కోరినట్లు ప్రకాశ్ చంద్ర పేర్కొన్నారు. ‘నా డ్రైవర్ ఈ రోజు అమీషా పటేల్ పీఏతో మాట్లాడాడు. ఆమె నాకు అనుకూలంగా మరో వీడియో చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దాని కోసం ఆమె 10 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు. నేను చదువుకున్న వ్యక్తిని, చదువుకున్న సంస్థ నుంచి వచ్చాను. ఆమెకు ఇక్కడ పూర్తి రక్షణ లభించింది. అమీషా ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి’ అన్నారాయన. -
ఆ హీరో ఫ్యాన్స్‌తో నాకు ప్రమాదం..
చెన్నై: ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తలపెట్టిన బయోపిక్ 800 తమిళనాట పెను వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలు ప్రముఖ దర్శకుడు భారతీ రాజా వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విజయ్ సేతుపతిని ఈ సినిమాలో నటించవద్దని కోరారు. చివరకు మురళీధరన్ కూడా తన బయోపిక్ కోసం కెరీర్‌ని నాశనం చేసుకోవద్దంటూ విజయ్‌ని కోరడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఆ తర్వాత కూడా విజయ్ కుమార్తెకి అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ దర్శకుడు ఆర్ సీను రామసామి తాను కూడా బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. జీవితం ప్రమాదంలో పడింది సాయం చేయండి అంటూ ముఖ్యమంత్రి పళని స్వామిని కోరుతున్నారు. సినిమా నుంచి తప్పుకోవాల్సిందిగా విజయ్ సేతుపతిని కోరిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు రావడం ప్రారంభం అయ్యిందని తెలిపారు. ఈ సందర్భంగా రామసామి మాట్లాడుతూ.. ‘చాలా మందిలాగే నేను కూడా విజయ్ సేతుపతిని 800 సినిమా నుంచి వైదొలగాలని కోరాను. ఆ తర్వాత కొద్ది రోజులకు విజయ్ కుమార్తె లాగే నాకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. నోటితో పలకలేని పదాలను ఉపయోగించారు. వాట్సాప్ ఒపెన్ చేయాలంటేనే ఒణుకుపుడుతుంది’ అన్నారు. అలానే ఈ బెదిరింపుల వెనక విజయ్ ఫ్యాన్స్ ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే తమ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బెదిరింపుల నేపథ్యంలో రోడ్డు మీద నడవాలన్న భయంగా ఉందన్నారు. దీనిపై ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ.. దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. (విమర్శలకు చెక్: విజయ్ అనూహ్య నిర్ణయం) ఇక 800 చిత్రం ప్రకటించిన నాటి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. తమిళ ద్రోహి చిత్రంలో ఎలా నటిస్తారంటూ విజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటించవద్దంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలోని ప్రముఖలు సైతం విజయ్‌కు సూచించారు. శ్రీలంకలో తమిళులను ఊచకోతకోసిన 2009 ఏడాది తనక అత్యంత సంతోషకరమైనది వ్యాఖ్యానించిన తమిళుల వ్యతిరేకి చిత్రంలో నటించవద్దని నిరసన వ్యక్తం చేశాయి. విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతారాంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే బయోపిక్కు వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై మురళీధరన్ ఓ లేఖ విడుదల చేశారు. తమిళుల తీరును తప్పుబడ్డారు. దీంతో వివాదం కాస్తా పెద్దదిగా మారడంతో 800 బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి ప్రకటించారు. -
హత్రాస్ ఉదంతం: పోలీసుల ఎదుటే బెదిరింపులు
లక్నో: హత్రాస్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాధితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మీడియాలో ఒక వీడియో తెగ వైరలవుతోంది. ఠాకూర్ల సామాజిక వర్గానికి చెందిన కొందరు ఎలాంటి భయం లేకుండా.. పోలీసుల ఎదుటే భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను బెదిరించారు. ఇక యోగి ప్రభుత్వం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే వారికి అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. 144 సెక్షన్ విధించారు. గుంపులు గుంపులుగా చేరడాన్ని నిషేధించారు. చివరకు రాహుల్ గాంధీ, ప్రియాంకలను కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిండానికి వెళ్లిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో పాటు మరో 400 మందిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కానీ దారుణానికి పాల్పడిన నిందుతులకు మద్దతుగా 500 వ్యక్తులు చేరడమే కాక ఆజాద్‌ను బహిరంగంగా హెచ్చరించారు. అయితే పోలీసులు వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. (చదవండి: బాధిత కుటుంబంపై కేసు పెట్టాలి) దీనిపై ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిందితులకు మద్దతుగా ఎలాంటి సమావేశాలు జరిపినా చర్యలు ఉండవు. బాధితురాలి కుటుంబం ప్రమాదంలో ఉంది. వారికి ప్రత్యేక భద్రత కల్పించండి’ అని డిమాండ్ చేశారు. ఇక గ్రామంలోని ఉన్నత కులస్తులు రాష్ట్రీయ సావర్న్ పరిషత్ అధ్వర్యంలో సమావేశం అయ్యారు. బాధితురాలి కుటుంబం సదరు వ్యక్తుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. యోగి ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. కానీ వారు మాత్రం నమ్మడం లేదు. రాజకీయాలు చేయడానికి ఇక్కడకు వచ్చారంటూ చంద్రశేఖర్ ఆజాద్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఓ వ్యక్తి ‘దెబ్బలను తట్టుకునేందుకు ఠాకూర్లు పుట్టారు.. బయటకు రండి మీ పెద్ద సోదరులు మిమ్మల్ని కలవడానికి ఇక్కడ ఉన్నారు రండి’ అంటూ భీమ్ ఆర్మీ నాయకుడిని ఆహ్వానించారు. -
‘ఈ వీడియో చూపిస్తే కేసు క్లోజ్ అవుతుంది’
లక్నో: హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ దారుణం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది అంటూ యూపీ పోలీసు ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాధితురాలి కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేస్తోన్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం చూడవచ్చు. జిల్లా మేజిస్ట్రేట్ ఒకరు ‘మీ విశ్వసనీయతను పూర్తి చేయవద్దు. ఈ మీడియా వాళ్లు ఈ రోజు ఉంటారు.. రేపు వెళ్తారు. మేము మాత్రం ఇక్కడే ఉంటాం. స్టేట్మెంట్ను మార్చడం.. మార్చకపోవడం మీ ఇష్టం. కానీ మేం మార్చగలం’ అన్నారు. ఇంతలో బాధితురాలి బంధువు ఒకరు కెమరా వైపు చూసి ఏడుస్తూ.. ‘వారు మాపై ఒత్తిడి తెస్తున్నారు. మీ కుమార్తె కరోనాతో చనిపోయి ఉంటే కనీసం పరిహారం అయినా దక్కేది అంటున్నారు. మా తండ్రిని, మమ్మల్ని బెదిరిస్తున్నారు’ అంటూ వాపోయింది. (చదవండి: అమ్మను బాధపడవద్దని చెప్పండి..) అంతేకాక వారు ‘మా తల్లి వీడియోలు తయారు చేశారు. వీటిని చూపిస్తే.. కేసు క్లోజ్ అవుతుంది అంటున్నారు. వారు మమ్మల్ని ఇక్కడ బతకనివ్వరు. డీఎం మమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు. మాపై ఒత్తిడి తెస్తున్నారు.. బలవంతం చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్డీ టీవీలో ప్రసారం చేశారు. ఇక హత్రాస్‌కు చెందిన 20 ఏళ్ల దళిత యువతి పొలంలో పని చేసుకుంటూ ఉండగా.. నలుగురు వ్యక్తులు ఆమెను లాక్కెళ్లి దారుణంగా హింసించారు. బాధితురాలు రెండు వారాల పాటు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడి మంగళవారం కన్ను మూసింది. -
'షమీ భార్యకు భద్రత కల్పించండి'
కోల్‌కత : టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ నుంచి విడిపోయి కూతురుతో కలిసి వేరుగా ఉంటున్న హసీన్ జహాన్‌కు భద్రత కల్పించాలంటూ కలకత్తా హైకోర్టు సిటీ పోలీసులను ఆదేశించింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇటీవల రామ్ మందిర్ నిర్మాణానికి భూమి పూజ జరగ్గా.. హిందువులకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వివాదం రేపింది. దీనిపై సోషల్ మీడియా కొందరి నుంచి తనకు వేధింపులు వస్తున్నాయని.. తన కూతురుకు,తనకు ప్రాణహాని ఉందని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో తనకు భద్రత కల్పించాలంటూ కలకత్తా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. (చదవండి : చిట్టితల్లి నిన్ను చాలా మిస్సవుతున్నా) తాజాగా కలకత్తా హైకోర్టు మంగళవారం హసీన్ పిటీషన్‌ను పరీశీలించింది. హసీన్ తరపు లాయర్ ఆశిష్ చక్రవర్తి.. ఆమెకు సోషల్‌మీడియాలో వచ్చిన బెదిరింపులతో పాటు పోలీసులకు అందించిన ఫిర్యాదును రిపోర్టు రూపంలో కోర్టుకు సమర్పించారు. హసీన్ తనకు బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కాగా సీనియర్ న్యాయవాది అమితేష్ బెనర్జీ చక్రవర్తి వాదనలను తోసిపుచ్చుతూ.. హసీన్ జహాన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ దేబాంగ్సు బసక్.. హసీన్ జహాన్ ఆస్తికి, ఆమె జీవితానికి ఎటువంటి హాని జరగకుండా రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందంటూ మంగళవారం తెలిపారు. అంతేగాక హసీన్ ఫిర్యాదుతో తీసుకున్న చర్యలను రిపోర్టు రూపంలో కోర్టుకు అందించాలంటూ పోలీసులను ఆదేశించింది. కాగా కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు అనంతరం జస్టిస్ పేర్కొన్నారు. కాగా రెండేళ్ల క్రితం షమీపై గృహ హింస కేసు పెట్టిన హసీన్.. అతను అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని మీడియా ముందు చెప్పడమే కాకుండా మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడుతున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది. దాంతో.. షమీపై విచారణ జరిపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడ్ని నిర్దోషిగా తేల్చగా.. ప్రస్తుతం ఈ ఇద్దరూ విడిగా ఉంటున్నారు. షమీ ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ ఆడేందుకు దుబాయ్‌లో ఉన్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున షమీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. (చదవండి : మాకు రక్షణ కల్పించండి: షమీ భార్య) -
డబ్బులిస్తావా.. మ్యారేజ్ హాల్ తగలబెట్టనా?
సాక్షి, న్యూఢిల్లీ: ఓ వ్యాపారవేత్తను బెదిరించి, లక్షల్లో డబ్బు వసూలకు ప్రయత్నించిన కేసులో ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతోన్న వ్యక్తిని ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం వెల్లడించారు. నిందితుడు 2015లో తనకు 15 లక్షల రూపాయలు ఇవ్వకుంటే కళ్యాణ మండపాన్ని పేల్చేస్తానని ఓ వ్యాపారవేత్తను బెదిరించాడు. వివరాలు.. ఉత్తర్ ప్రదేశ్‌లోని రామ్‌పూర్ జిల్లాకు చెందిన విష్ణు (36) ఢిల్లీ వ్యాపారవేత్త ప్రణబ్ సేథ్ నుంచి డబ్బులు వసూలుచేయడానికి పథకం వేశాడు. తనకు 15 లక్షల రూపాయలు ఇవ్వకుంటే రూప్ నగర్లో ఉన్న ప్రణబ్ కళ్యాణ మండపాన్ని పేల్చివేస్తానని బెదిరించాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టులో నేరం రుజువయ్యింది. దీనిపై 2015లో తీర్పు వెలువరించిన ఢిల్లీ కోర్టు విష్ణుని దోషిగా నిర్ధారించింది. (చదవండి: కారుతో గుద్దింది గాక పోలీసులకే కట్టుకథ) దాంతో అప్పటి నుంచి విష్ణు పరారీలో ఉన్నాడు. తాజాగా, నిందితుడిని రామ్‌పూర్ జిల్లాలోని అతడి స్వగ్రామంలో అరెస్ట్ చేశారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నేరస్థుడు తన స్వగ్రామంలో ఉన్నట్టు గుర్తించామని, సెప్టెంబరు 4న అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు విష్ణుపై రాజౌరీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 384, 506 కింద కేసులు నమోదుచేశారు. -
భవ్య రామాలయం: పూజారికి బెదిరింపులు
అయోధ్య : భవ్య రామ మందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసిన పూజారికి బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం కర్ణాటకకు చెందిన 75 ఏళ్ల పూజారి ఎన్ఆర్ విజయేంద్ర శర్మ ఆగస్టు 5న జరుగనున్న రామ మందిర నిర్మాణం భూమిపూజకు ముహార్తాన్ని నిర్ణయించారు. బెళగావిలో ఉండే విజయేంద్ర శర్మ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు స్వామి గోవింద్ దేవ్ గిరిజకి సన్నిహతులు. విజయేంద్రకు గత మూడు, నాలుగు రోజులుగా తనకు దాదాపు 60 బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తనకు కాల్స్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. (150 నదుల జలాలతో అయోధ్యకు..) దీంతో విజయేంద్ర శర్మ ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను మోహరించారు. గతంలో మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయిలకు, పీవీ నరసింహరావులకు శర్మ సలహాదారునిగా వ్యవహరించారు. అంతేకాకుండా వాజ్‌పేయి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలోనూ శర్మనే ముహూర్తం పెట్టారు. ఇక బుధవారం నాడు జరగనున్న భూమి పూజ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు మరికొంత మంది ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా, ఏప్రిల్‌లోనే రామాలయ నిర్మాణ వేడుకలు జరగాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. (అయోధ్య భూమి పూజకు మోదీ, షెడ్యూల్ ఇదే!) -
చస్తావా? లేదా చంపమంటావా?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ఎందరో సెలబ్రిటీలు ముఖ్యంగా ఖాన్, కపూర్ కుటుంబాలపై అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ బాధితుల లిస్టులో ఇప్పుడు రియా చక్రవర్తి కూడా చేరిపోయారు. ఈమె సుశాంత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉంది. ఆమె సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రెండు రోజుల క్రితం ఎమోషనల్ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'నువ్వు దూరమై నెలరోజులవుతోంది. అయినా నిన్ను నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను' అని రాసుకొచ్చారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం సుశాంత్ చావుకు రియా కూడా కారణమంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. (అయితే వారిద్దరి ప్రేమాయణం నిజమా..?!) "నిన్ను కచ్చితంగా అత్యాచారం చేసి చంపేస్తాం. కాబట్టి నీ అంతట నీవుగా ఆత్మహత్య చేసుకోవడం మంచిది. లేకపోతే మేమే నిన్ను చంపేస్తాం" అంటూ బెదిరిస్తూ మెసేజ్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను రియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "నన్ను గోల్డ్ డిగ్గర్ అన్నారు, సహించాను.. హంతకురాలని నిందించారు.. భరించాను, సిగ్గు లేదని మొహం మీదే తిట్టిపోశారు.. మౌనంగా ఊరుకుండిపోయాను.. కానీ నేను ఆత్మహత్య చేసుకోవాలని, లేకపోతే అత్యాచారం చేసి చంపేస్తానని బెదిరించే హక్కు మీకెక్కడిది? అది ఎంత పెద్ద నేరమో మీకైనా అర్థమవుతోందా? ఇలాంటి దుర్మార్గమైన బెదిరింపులకు ఎవరూ పాల్పడవద్దు. ఇలాంటివి పునరావృతం కాకూడదు. ఇక జరిగింది చాలు.. ఆపేయండి" అని పోస్ట్ చేశారు. తనపై బెదిరింపు వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోండంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ట్యాగ్ చేశారు. (జీవితాంతం ప్రేమిస్తూ ఉంటాను: సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్) View this post on Instagram I was called a gold digger ..I kept quiet I was called a murderer ....I kept quiet I was slut shamed ....I kept quiet But how does my silence give you the right to tell me that you will get me RAPED and MURDERED if I don’t commit suicide @mannu_raaut ? Do you realize the seriousness of what you have said? These are crimes, and by law no one, I repeat NO ONE should be subjected to this kind of toxicity and harassment . I request @cyber_crime_helpline @cybercrimeindia to please take necessary action . ENOUGH IS ENOUGH A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on Jul 15, 2020 at 11:20pm PDT -
‘నిన్ను చంపేస్తాం.. అత్యాచారం చేస్తాం’
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో బంధుప్రీతి మీద విపరీతమైన చర్చ జరిగింది. ముఖ్యంగా ఖాన్లు, కపూర్ల కుటుంబాలతో పాటు కరణ్ జోహర్ మీద కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వీరి వల్ల టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు రాక.. ఎందరో కుంగి పోతున్నారని.. కొందరు సుశాంత్ లాగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని నెటిజనులు ఆరోపించారు. బాలీవుడ్లో ఓ పెద్ద మాఫియా ఉందని దాని వలనే సుశాంత్ మరణించాడంటూ కంగనాతో పాటు పలువురు.. ఇండస్ట్రీలోని పెద్దలపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇన్ని రోజులు మహేష్ భట్, ఆలియా భట్‌లపై విమర్శలు చేసిన వారు తాజాగా ఆమె సోదరి షాహీన్ భట్‌ను వేధిస్తున్నారట. (నేను రోబో కాదు) ఆమెను చంపేస్తామని.. అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు షాహీన్. ఇవి తనను ఎలాంటి ఆశ్చర్యానికి గురి చేయడం లేదన్నారు. అంతేకాక ఈ తరహా విద్వేష పూరిత బెదిరింపుల్ని సీరియస్‌గా తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. గుర్తు తెలియని సైట్ల నుంచి ఇలాంటి బెదిరింపులు పాల్పడే వారిని ఐపీ అడ్రెస్‌లతో గుర్తించడం ఖాయమని అంటున్నారు షాహీన్.(కనీసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి: నటి) -
ఇంకోసారి కనిపిస్తే, దాని పీడ వదిలించుకుంటా
లండన్: మనుషులకే ఓ చోట కాలు నిలవదు. అలాంటిది జంతువులకు ఉన్నచోటే ఉండాలంటే సాధ్యమవుతుందా? అందులోనూ 'కాలు కాలిన పిల్లి' అని మార్జాలం స్వభావం గురించి ఓ సామెత కూడా ఉంది. అయితే సౌత్వేల్కు చెందిన క్రిస్, అతని గర్ల్‌ఫ్రెండ్ గండాల్ఫ్ అనే పిల్లిని పెంచుకుంటున్నారు. దాన్ని గారాబం చేస్తూ బాగానే చూసుకుంటున్నారు. కానీ పక్కింటి పుల్లకూర రుచి అన్న చందంగా అది ఎప్పుడూ పక్కింట్లోకి వెళ్లేది. అక్కడున్న ఆహారాన్ని సుష్టుగా లాగించేసి యమ దర్జాగా బయటకొచ్చేది. దీని చేష్టలకు చిరాకొచ్చిన సదరు కుటుంబం ఈసారి పిల్లి ఇంట్లోకి వచ్చినప్పుడు దాని మెడకు వార్నిగ్ లెటర్‌ను వేలాడదీశారు. ఎప్పటిలాగే ఆ నాలుగేళ్ల పిల్లి తన కడుపు నింపుకున్న తర్వాత తన ఇంటికి వచ్చింది. అయితే దాని మెడలో వేలాడుతున్న లేఖను యజమాని తీసి చదవగా.. (ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?) "దయచేసి మీ పిల్లిని మీ ఇంట్లోనే ఉంచండి. అది ఎప్పుడూ మా ఇంటి చుట్టే తిరుగుతోంది. ఇంట్లో ఆహారాన్ని తింటూ, సోఫాను గీరుతూ నాశనం చేస్తోంది. రాత్రిళ్లు కూడా వంటగదిని విడిచిపెట్టకుండా అక్కడే పడుకుంటోంది. మీరు దానికి తిండి పెడితే మంచిదనుకుంటా! ఈ పిల్లి గోల నా వల్ల కావడం లేదు, నేను విసిగిపోయాను. ఇంకోసారి మీ పిల్లి నా ఇంట్లో కనిపిస్తే దాన్ని ఎక్కడ విడిచిపెట్టి వస్తానో నాకే తెలీదు" అని హెచ్చరించి ఉంది. అంతేకాదు.. 'పిల్లికి తిండి కూడా పెట్టకండి' అని దాని మెడకు వేలాడదీసిన దానిపై రాసి ఉంది. అయితే తన పిల్లి గురించి ఇంతవరకెన్నడూ ఇలాంటి ఫిర్యాదులు అందలేదని దాని యజమాని క్రిస్ వాపోయాడు. అది అందరితో బాగా కలిసిపోయేదని, మిగతావారికి కూడా ఇదంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. (ఆ కారణానికి కూడా విడాకులు ఇచ్చేస్తారా?) -
బాంబు పెట్టి చంపేస్తానంటూ ఎమ్పీకి బెదిరింపు
లక్నో: ఉన్నావో పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్‌ను బాంబు పెట్టి చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బిజ్నోర్ జిల్లాకు చెందిన గఫర్‌గా గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ.. గఫర్ కువైట్‌లో ఉండగా సాక్షి మహారాజ్‌కు ఫోన్ చేసి బాంబు పెట్టి ఆయనను చంపేస్తానని బెదిరించాడు. ఎమ్పీ పిర్యాదుతో గఫర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి మీద సెక్షన్ 504 (శాంతిని ఉల్లంఘించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), సెక్షన్ 507 (క్రిమినల్ బెదిరింపు), ఐపీసీసెక్షన్ 66, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. గఫర్ వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, సివిల్ ఐడి కార్డు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కుమారుడి హత్య.. తండ్రి ఆత్మహత్య
జైపూర్: కుమారుడిని చంపేశారు.. న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించడంతో మిగతా కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని బెదిరించారు. నిందితుల బెదిరింపులకు భయపడి కళ్లు లేని ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. రత్తిరన్ జాతవ్ అనే వ్యక్తి అంధుడు. అతడికి ఇద్దరు కుమారులున్నారు. వీరిలో పెద్ద కుమారుడు హరీశ్ జాతవ్ గత నెలలో ఓ యాక్సిడెంట్ చేశాడు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. దాంతో సదరు మహిళ బంధువులు హరీశ్ మీద దాడి చేసి చంపేశారు. దీని గురించి అతడి తండ్రి రత్తిరన్ పోలీసుకుల ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో హరీశ్‌పై దాడి చేసి, అతని చావుకు కారణమయిన వ్యక్తులు కేసు వాపసు తీసుకోవాలని.. లేదంటే రత్తిరన్ కుటంబ సభ్యుల్లో ఎవ్వరిని వదలమని బెదిరించారు. ఈ బెదిరింపులకు భయపడిన రత్తిరన్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం గురించి హరీశ్ సోదరుడు మాట్లాడుతూ.. ‘న్యాయం చేయాలంటూ మా నాన్న పోలీసులను ఎంతో వేడుకున్నాడు. కానీ వారు కనికరించలేదు. మమ్మల్ని చంపుతామంటూ బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ వారు మా మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ వారు ముందుగానే స్పందించి ఉంటే.. ఈ రోజు మా నాన్న మరణించేవారు కాదు. మాకు న్యాయం జరగదనే భయంతోనే మా నాన్న విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు’ అని వాపోయారు. -
ప్రభుత్వ ఆఫీసులు, ఈవీఎంలు పేల్చేస్తామంటూ..
సాక్షి, విశాఖపట్నం : బ్యాంకును పేల్చేస్తామంటూ మేనేజర్‌ను బెదిరింపులకు గురిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెదిరింపులకు పాల్పడింది అనకాపల్లి మండలం వెలుగు కమ్యూనిటీలో క్లస్టర్ ఏజెంట్‌గా పనిచేస్తున్న రాచేపల్లి వీర శివరంజనిగా గుర్తించారు. వివరాలు.. అనకాపల్లి విశాఖ గ్రామీణ బ్యాంకును పేల్చేస్తామంటూ.. ఆ బ్యాంకు మేనేజర్‌కు మెసేజ్ వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఈవీఎంలే టార్గెట్‌గా పేలుళ్లకు పాల్పడతామంటూ మెసేజ్‌లో పేర్కొనడంతో సదరు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి తిగిన పోలీసులు శివరంజనిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు మేనేజర్‌తో సహా మరో 16మందిని కూడా ఇదే విధంగా బెదిరిస్తూ మెసేజ్‌లు పెట్టినట్లు గుర్తించారు. -
టీడీపీకే ఓటేయాలంటూ పింఛన్ల పేరుతో బెదిరింపు
-
‘కంటపడిన ప్రతి అమ్మాయిని చంపుతాను’
వాషింగ్టన్ : నేను చూసిన ప్రతి అమ్మాయిని చంపడమే నా ధ్యేయం అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన ఓ యువకున్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. అమెరికాలోని ప్రోవో ప్రాంతానికి చెందిన క్రిస్టోఫర్ డబ్ల్యూ క్లిరీ అనే యువకుడు ‘ఇంపల్స్ కంట్రోల్ డిసర్డార్’తో బాధపడుతున్నాడు. దాంతో పాటు ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవాలనే స్వభావం కలిగి ఉన్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం తన ఫేస్బుక్లో కొన్ని వివాదాస్పద పోస్టులు పెడుతూ.. అనుమానాలు రేకిత్తించాడు. ‘అతి త్వరలోనే ఎక్కువ మందిని చంపిన వ్యక్తిగా నిలవబోతున్నాను. నేను చూసిన ప్రతి అమ్మాయిని చంపడమే నా ధ్యేయం. ఎందుకంటే నాకు ఇంతవరకూ ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. ఇప్పటికి నేను వర్జిన్‌నే. ఇందుకు కారణం వారు నన్ను రిజెక్ట్ చేయడమే. అందుకే నన్ను తిరస్కరించిన అమ్మాయిలకు సరైన గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను. నేను చావడానికి సిద్ధమయ్యాను. చనిపోవడానికి సిద్ధమైన వ్యక్తి కంటే ప్రమాదకరమైనది ఏదీ లేదు’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అయితే క్లిరీ ఇలా పోస్ట్ చేసిన వారాంతంలోనే ప్రోవోలో ఓ భారీ మహిళా ర్యాలీ జరగనుంది. ఈ పోస్ట్‌లతో అప్రమత్తమైన పోలీసులు ఎఫ్‌బీఐ సాయంతో ట్రేస్ చేసి క్లిరీని అరెస్ట్ చేశారు. ఈ విషయం గురించి క్లిరీ తాను పోస్టులు పెట్టిన మాట వాస్తవమే అని ఒప్పుకొన్నాడు. కానీ బెదిరింపు మెసేజ్‌లు రావడంతో వెంటనే వాటిని తొలగించినట్లు తెలిపాడు. -
బిగ్‌బాస్ విన్నర్‌కి శ్రీశాంత్ ఫ్యాన్ బెదిరింపులు
దీపికా కకార్ హింది బిగ్‌బాస్ 12 విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే దీపిక మీద యాసిడ్ పోస్తానంటూ శ్రీశాంత్ అభిమాని ఒకరు ట్విటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నరంట. దాంతో దీపిక అభిమానులు ఈ విషయాన్ని ముంబై పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి.. దీపికను రక్షించాలంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి స్పందించారు. దీని గురించి భువనేశ్వరి ‘శ్రీఫామ్ పేరు చెప్పి ఎవరో దీపిక మీద యాసిడ్ దాడి చేస్తామంటూ బెదిరిస్తున్నారనే విషయం గురించి నాకు తెలిసింది. ఈ సందర్భంగా మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను.. నేను, నా భర్త ఖచ్చితంగా చెప్పగలం శ్రీఫామ్కు చెందిన వారు ఎవరు ఇలాంటి పనులు చేయరు’ అంటూ ట్వీట్ చేశారు. My dear #SreeFam,came to know about the Acid attack news yesterday.We want to tell you all that Me and Sree are very sure that no one from #SreeFam can ever write such a thing & we believe You all. It could be any one portraying as Sreefam. — Bhuvneshwari Sreesanth (@Bhuvneshwarisr1) January 7, 2019 -
‘ఎద్దు మాంసం తిని మతానికి తీరని కళంకం తెచ్చావ్’
న్యూఢిల్లీ : ప్రముఖ చరిత్రకారుడు.. బీజేపీ పార్టీ విమర్శకుడు రామచంద్ర గుహను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్ యూజర్లు. వివరాలు.. శనివారం రామచంద్ర గుహ గోవాలో దిగిన ఓ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ‘పనాజీలో ఎద్దు మాంసం తింటూ ఎంజాయ్ చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. దాంతో ఆగ్రహించిన నెటిజన్లు గుహను విపరీతంగా ట్రోల్ చేయడమే కాక.. ఫోన్ చేసి మరి బెదిరించినట్లు తెలిపారు గుహ. విమర్శలు ఎక్కవ అవడంతో ఆ ఫోటోను డిలీట్ చేశానని తెలిపారు. ఈ విషయం గురించి గుహ మాట్లాడుతూ.. ఆర్కే యాదవ్ అనే మాజీ రా(రిసెర్చ్ అనాలసిస్ వింగ్) ఉద్యోగి ‘ఒక హిందువు ఎద్దు మాసం తినడమే కాక.. ఆ విషయం గురించి ప్రచారం చేసుకుంటూ మతానికి తీరని కళంకం తెచ్చావు. ఈ దారుణ చర్య ద్వారా నువ్వు హిందువులను బాధించావు. ఇందుకు తగిన సమాధానం చెప్తాం’ అంటూ ట్వీట్ చేశాడని వెల్లడించారు. This threatening tweet below is from a former official of the Research and Analysis Wing. I would like to place it on record, and will do with every subsequent threat received. https://t.co/MrG7AVL15U — Ramachandra Guha (@Ram_Guha) December 9, 2018 అంతేకాక ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి ఫోన్ చేసి తనను, తన భార్యను బెదిరించారని పేర్కొన్నారు గుహ. తనకు వచ్చిన ఈ బెదిరింపు సందేశాలను, ఫోన్ కాల్స్‌ని రికార్డ్ చేసినట్లు ఆయన తెలిపారు. మరికొన్ని విమర్శలు కూడా రావడంతో ఆ ఫోటోను తొలగించారు. అనంతరం బీజేపీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు గుహ. ‘నేను గోవాలో లంచ్ చేస్తున్నప్పటి ఫోటోను డిలీట్ చేశాను. ఈ సందర్భంగా ఎద్దు మాంసం పట్ల బీజేపీ సృష్టించిన హిపోకస్రీని మెచ్చుకుంటున్నాను. ఆహారం, దుస్తులు, ప్రేమ విషయంలో మనషులు తమ మనసుకు నచ్చినట్లు చేసే హక్కు ఉందని’ తెలిపారు. I have deleted the photo of my lunch in Goa as it was in poor taste. I do wish however to again highlight the absolute hypocrisy of the BJP in the matter of beef, and to reiterate my own belief that humans must have the right to eat, dress, and fall in love as they choose. — Ramachandra Guha (@Ram_Guha) December 9, 2018 ప్రస్తుతం దేశంలో రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, వంటి రాష్ట్రాల్లో గొడ్డు మాంసాన్ని పూర్తిగా నిషేధించారు. కానీ కేరళ, పశ్చిమ బెంగాల్, గోవా వంటి రాష్ట్రాల్లో దీని మీద ఎటువంటి నిషేధం లేదు. -
ఇంక్ చల్లుతామంటూ స్టార్ హీరోకి బెదిరింపులు
ఈ నెల 27న మెన్స్ హాకీ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఒడిషాలోని కళింగ స్టేడియంలో ప్రారంభంకాబోతుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌ను ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. అయితే తమకు క్షమాపణలు చెప్పకుండా.. షారుక్ ఈ వేడుకలకు హాజరైతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందంటూ బెదిరింపులకు దిగారు స్థానిక కళింగ సేన నాయకులు. విషయం ఏంటంటే 17 ఏళ్ల క్రితం షారుక్ ఖాన్ ‘అశోక’ అనే చిత్రంలో నటించారు. చరిత్ర గతినే కాక అశోకుని పథాన్ని మార్చిన కళింగ యుద్ధం నేపథ్యంలో వచ్చిన చిత్రం అశోక. 2001లో షారుక్ ఖాన్, కరీనా కపూర్, జుహీ చావ్లా ప్రధాన ప్రాతధారులుగా సంతోష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదల సమయంలోనే అంటే 2001లోనే ఈ సినిమా పట్ల తీవ్ర నిరసలను వ్యక్తమయ్యాయి. ఈ చిత్రం ఒడిషా సంస్కృతిని, ఆ రాష్ట్ర ప్రజలను కించపరిచేలా ఉందని నిరసనల వ్యక్తం చేశారు. ఈ సినిమా ఒడిషాలో కేవలం వారం రోజుల పాటే నడించిందంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సినిమా విడుదలయ్యి దాదాపు 17 ఏళ్లు పూర్తయిన కూడా ఇప్పటికి షారుక్ పట్ల నిరసనలు వ్యక్తమవుతుండటం ఆశ్చర్యం. ఈ క్రమంలోనే కళింగ సేన షారుక్‌కు బెదరింపు సందేశాలు పంపుతోంది. మీ అశోక సినిమాలో మా రాష్ట్ర ప్రజలను కించపరిచేలా చూపించారు. ఇందుకు మీరు క్షమాపణలు చెప్పాలి. లేదంటే మీ మీద ఇంక్ చల్లడమే కాక నలుపు రంగు జెండా ఎగురవేసి నిరసనలు తెలుపుతాం. మా కార్యకర్తలు దారి పొడవునా ఉంటారు జాగ్రత్త అంటూ షారుక్‌ని బెదిరిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. -
సల్మాన్‌తో మాట్లాడించకపోయావో...
ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలోనే కాకా విదేశాల్లో కూడా సల్మాన్‌కు అభిమానులున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సల్మాన్ వీరాభిమాని ఒకరు భాయ్‌ను కలవాలని భావించాడు. అందుకోసం సల్మాన్ దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి ఫోన్ నంబర్ సంపాదించి.. బెదిరింపులకు పాల్పడ్డాడు. సదరు వ్యక్తి సల్మాన్ ఉద్యోగికి ఫోన్ చేసి ఎలాగైనా తనను సల్మాన్‌ని కలిసేలా చూడాలని.. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కల్పించాలని అడిగాడు. ఒకవేళ తాను చెప్పినట్లు చేయకపోతే.. తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో సదరు ఉద్యోగి ఈ విషయాన్ని ముంబై పోలీసలు దృష్టికి తీసుకెళ్లాడు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. బెదిరింపులకు పాల్పడిన అభిమానిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సల్మాన్ అలీ అబ్బాస్ దర్శకత్వంలో వస్తోన్న భరత్ చిత్రంలో నటిస్తున్నారు. -
రేప్ బెదిరింపులు : టీసీఎస్ ఉద్యోగిపై వేటు
సాక్షి, కోలకతా: దేశంలో ఒకవైపు మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై తీవ్ర చర్చ కొనసాగుతుండగా దేశీయ ఐటీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఉద్యోగి ఒకరు ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన అంశం వెలుగులోకి వచ్చింది. టీసీఎస్ ఉద్యోగి రాహుల్ సింగ్ ఇద్దరు మహిళలకు అత్యాచారం, హత్య బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన సంస్థ రాహుల్‌ని విధులనుంచి తొలగించింది. వివరాల్లోకి వెళితే టీసీఎస్‌కు చెందిన రాహుల్ సింగ్ ఇద్దరు మహిళలకు అభ్యంతరకరమైన,అసభ్య సందేశాలతోపాటు, మీ భర్త, పిల్లలను హత్య చేస్తానంటు బెదరింపులకు దిగాడు. అయితే బాధిత మహిళల్లో ఒకరు ఆ స్ర్కీన్ షాట్లను సోషల్ మీడియాలో(ట్విటర్, ఫేస్బుక్) షేర్ చేశారు. ఇవి వైరల్ అయ్యాయి (ఈ పోస్టులను రాహుల్ తర్వాత డిలీట్ చేశాడు.) దీంతో రాహుల్‌ని తక్షణమే ఉద్యోగంనుంచి తొలగించడంతోపాటు, ఈ విషయాన్ని పరిశీలించేందుకు దర్యాప్తును ప్రారంభించింది టీసీఎస్. మహిళలపై లైంగిక వేధింపులు, ఇతర అసంబద్ధ చర్యలను క్షమించేది లేదని టీసీఎస్ ప్రతినిధి వెల్లడించారు. ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులకు స్పందించిన రాహుల్ అభ్యంతరమైన మెసేజ్‌లతో వేధించాడని అసోంకు చెందిన మహిళ తెలిపారు. తను భర్తను, కొడుకును చంపుతానని హెచ్చరించడంతోపాటు, రేప్ చేస్తానంటూ బెదిరింపులకు దిగడంతో పోలీసులకు ఫిర్యాదు చేసానని పేర్కొన్నారు. కాగా ఉద్యోగులు అనుచితంగా ప్రవర్తించిన సందర్భాల్లో భారతీయ సంస్థలు తీవ్రంగా స్పందించిన ఘటనలు గతంలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా గత రెండు నెలల కాలంలో ఇది రెండో సంఘటన. మాజీ ఉద్యోగిపై అనైతికంగా వ్యాఖ్యానించిన రిచా గౌతంను టెక్ మహీంద్రా ఉద్యోగం నుంచి తొలగించింది. మరో ఘనటలో కతువా అత్యాచార ఘటనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తన ఉద్యోగిని కోటక్ మహీంద్రా బ్యాంకు సంస్థనుంచి తొలగించింది. -
ఆ మెసేజ్‌లు పంపింది మహిళేనట!
అనంతపురం : అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ ఎం. స్వరూప, ఎమ్మెల్యే వి.ప్రభాకర్‌చౌదరిలకు సెల్‌ఫోన్ ద్వారా బెదిరింపులతో కూడిన సందేశాలను పంపింది ఓ మహిళ అని తేలింది. అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మెసేజ్‌లు పంపుతున్న మహిళ పూర్తి వివరాలను మరో రెండు రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. (చదవండి : మేయర్‌కు బెదిరింపు మెసేజ్‌లు..టీడీపీలో కలకలం)