
ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలోనే కాకా విదేశాల్లో కూడా సల్మాన్‌కు అభిమానులున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సల్మాన్ వీరాభిమాని ఒకరు భాయ్‌ను కలవాలని భావించాడు. అందుకోసం సల్మాన్ దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి ఫోన్ నంబర్ సంపాదించి.. బెదిరింపులకు పాల్పడ్డాడు. సదరు వ్యక్తి సల్మాన్ ఉద్యోగికి ఫోన్ చేసి ఎలాగైనా తనను సల్మాన్‌ని కలిసేలా చూడాలని.. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కల్పించాలని అడిగాడు.
ఒకవేళ తాను చెప్పినట్లు చేయకపోతే.. తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో సదరు ఉద్యోగి ఈ విషయాన్ని ముంబై పోలీసలు దృష్టికి తీసుకెళ్లాడు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. బెదిరింపులకు పాల్పడిన అభిమానిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సల్మాన్ అలీ అబ్బాస్ దర్శకత్వంలో వస్తోన్న భరత్ చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment