fan arrest
-
సల్మాన్‌తో మాట్లాడించకపోయావో...
ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలోనే కాకా విదేశాల్లో కూడా సల్మాన్‌కు అభిమానులున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సల్మాన్ వీరాభిమాని ఒకరు భాయ్‌ను కలవాలని భావించాడు. అందుకోసం సల్మాన్ దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి ఫోన్ నంబర్ సంపాదించి.. బెదిరింపులకు పాల్పడ్డాడు. సదరు వ్యక్తి సల్మాన్ ఉద్యోగికి ఫోన్ చేసి ఎలాగైనా తనను సల్మాన్‌ని కలిసేలా చూడాలని.. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కల్పించాలని అడిగాడు. ఒకవేళ తాను చెప్పినట్లు చేయకపోతే.. తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో సదరు ఉద్యోగి ఈ విషయాన్ని ముంబై పోలీసలు దృష్టికి తీసుకెళ్లాడు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. బెదిరింపులకు పాల్పడిన అభిమానిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సల్మాన్ అలీ అబ్బాస్ దర్శకత్వంలో వస్తోన్న భరత్ చిత్రంలో నటిస్తున్నారు. -
వీరాభిమాని అశ్లీల వీడియోలు.. సింగర్ షాక్!
ముంబై : వీరాభిమానం తప్పుదోవ పడితే చివరికి కటకటాలపాలు కావాల్సిందే. తనను కలుసుకోవడం లేదన్న కారణంగా ఓ ఫీమేల్ సింగర్‌కు అసభ్య సందేశాలు, వీడియోలు పంపండంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అంబోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. 26 ఏళ్ల యువతి పలు బాలీవుడ్ మూవీలకు ప్లే బ్లాక్ సింగర్‌గా చేశారు. ఆమెకు బిహార్‌కు చెందిన రాజేశ్‌కుమార్ శుక్లా(30) వీరాభిమాని. తన ఆరాధ్య సింగర్‌ను ఎలాగైనా కలవాలని రెండు వారాల కిందట ముంబైకి వచ్చాడు. ఎలాగోలా కష్టపడి ఆమె ఫోన్ నెంబర్, అడ్రస్ సేకరించాడు. మిమ్మల్ని కలుసుకోవాలని ఉందని పలుమార్లు సందేశాలు పంపినా సింగర్ పట్టించుకోలేదు. ఇదే అదునుగా భావించిన ఆ వీరాభిమాని కీచకపర్వం మొదలుపెట్టాడు. నన్ను కలుసుకోవా నీ పని చెబుతానంటూ ఆమెకు అసభ్య సందేశాలు, అశ్లీ వీడియోలు పంపసాగాడు. వేధింపులను భరించలేని సింగర్ తన తల్లితో కలిసి అంబోలీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వీరాభిమాని అని చెప్పి ఓ వ్యక్తి వేధిస్తున్నాడని, తనను కలవడానికి బిహార్ నుంచి వచ్చా అని ఫోన్లు, మెస్సేజ్‌లు చేస్తున్నాడన్నారు. ఐపీసీ 354డీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తన ఆరాధ్య సింగర్ కలుసుకునేందుకు నిరాకరించడంతో ఈ పిచ్చి చేష్టలకు పాల్పడినట్లు నిందితుడు శుక్లా అంగీకరించాడు. -
ప్రధాని మోదీ సాయం కోరిన పాక్ మాజీ క్రికెటర్
కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది భారత ప్రధాని నరేంద్రమోదీని సాయం కోరారు. అసోంలో తన అభిమానిని పోలీసులు అకారణంగా నిర్బంధించారని, అతడిపై భారత శిక్షా స్మృతిప్రకారం పలు కేసులు పెట్టి జైలులో వేశారని, దయచేసి అతడిని విడిపించాలంటూ కోరారు. ఆయన విన్నపం ప్రకారం రిపాన్ చౌదరీ అనే వ్యక్తి అఫ్రిదిపై ఉన్న అభిమానంతో అతడి జెర్సీని వేసుకున్నాడు. అది చూసిన కొంతమంది బీజేపీ యువ విభాగానికి చెందిన వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి ఐపీసీ 120(బీ), 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అఫ్రిది ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. భారత్ దేశంలో పాక్ క్రికెటర్లకు అభిమానులు ఉన్నారని, అలాగే, పాక్ లో భారత క్రికెటర్లకు అభిమానులు ఉన్నారని, అంతమాత్రాన వారిని అరెస్టులు చేయడం సరికాదని అన్నారు. రెండు దేశాల్లో వారిని కేవలం క్రికెట్ అభిమానులుగా మాత్రమే చూడాలని కోరారు. అసహనాన్ని పెంచే ఇలాంటి చర్యలను ఏమాత్రం అంగీకరించకూడదని, అది ఎవరైనా సరే ఖండించాల్సిందేనని చెప్పారు. ఈ విషయంలో మోదీ కలగజేసుకొని న్యాయం చేస్తారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. గతంలో పాక్‌లో కూడా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమాని ఒకరు తన ఇంటిపై భారత జాతీయ పతాకం ఎగురవేసినందుకు అక్కడ పదేళ్ల శిక్షకు గురైన విషయం తెలిసిందే. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.