వీరాభిమాని అశ్లీల వీడియోలు.. సింగర్‌ షాక్‌! | Bollywood Female Singer Fan Arrested In Harassment Case | Sakshi
Sakshi News home page

వీరాభిమాని అశ్లీల వీడియోలు.. సింగర్‌ షాక్‌!

Published Fri, Jun 8 2018 11:42 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Bollywood Female Singer Fan Arrested In Harassment Case - Sakshi

ముంబై : వీరాభిమానం తప్పుదోవ పడితే చివరికి కటకటాలపాలు కావాల్సిందే. తనను కలుసుకోవడం లేదన్న కారణంగా ఓ ఫీమేల్‌ సింగర్‌కు అసభ్య సందేశాలు, వీడియోలు పంపండంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అంబోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ వివరాలిలా ఉన్నాయి.. 26 ఏళ్ల యువతి పలు బాలీవుడ్‌ మూవీలకు ప్లే బ్లాక్‌ సింగర్‌గా చేశారు. ఆమెకు బిహార్‌కు చెందిన రాజేశ్‌కుమార్‌ శుక్లా(30) వీరాభిమాని. తన ఆరాధ్య సింగర్‌ను ఎలాగైనా కలవాలని రెండు వారాల కిందట ముంబైకి వచ్చాడు. ఎలాగోలా కష్టపడి ఆమె ఫోన్‌ నెంబర్‌, అడ్రస్‌ సేకరించాడు. మిమ్మల్ని కలుసుకోవాలని ఉందని పలుమార్లు సందేశాలు పంపినా సింగర్‌ పట్టించుకోలేదు. ఇదే అదునుగా భావించిన ఆ వీరాభిమాని కీచకపర్వం మొదలుపెట్టాడు. నన్ను కలుసుకోవా నీ పని చెబుతానంటూ ఆమెకు అసభ్య సందేశాలు, అశ్లీ వీడియోలు పంపసాగాడు.

వేధింపులను భరించలేని సింగర్‌ తన తల్లితో కలిసి అంబోలీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వీరాభిమాని అని చెప్పి ఓ వ్యక్తి వేధిస్తున్నాడని, తనను కలవడానికి బిహార్‌ నుంచి వచ్చా అని ఫోన్లు, మెస్సేజ్‌లు చేస్తున్నాడన్నారు. ఐపీసీ 354డీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నెంబర్‌ ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. తన ఆరాధ్య సింగర్‌ కలుసుకునేందుకు నిరాకరించడంతో ఈ పిచ్చి చేష్టలకు పాల్పడినట్లు నిందితుడు శుక్లా అంగీకరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement