
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బ్యూటీ భామ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఎమ్‌ఎస్ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం భాయిజాన్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఓ వైపు చేతినిండా సినిమాలతోపాటు మరోవైపు ఫోటో షూట్‌లతో అభిమానులను ఊర్రూతలుగిస్తోంది దిశా. ఆమె ఏ డ్రెస్ ధరించిన తన అందాలతో కుర్రకారులను మత్తెక్కిస్తుంటుంది. ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో తరుచూగా పోస్టు చేస్తుంటుంది. అలా లైఫ్‌ను హ్యపీగా లీడ్ చేస్తున్నఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రమాదంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. చదవండి: నాలుగు నెలల్లో సలార్ పూర్తి
దిశాపటానీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. హీరోయిన్‌కు ఫోన్ చేసి తనను చంపేస్తామని భయపెడుతున్నట్లు సమాచారం. అంతేగాక పోలీస్ స్టేషన్లకు కూడా కాల్స్ చేసి మీ అమ్మాయి(దిశా పటానీ) ఇంకా ఎవరూ రక్షించలేరని బెదిరిస్తున్నారట. ఈ కాల్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్నట్లు, కాల్ చేసిన వ్యక్తి దిశాను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ వల్ల దిశా ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లు సమాచారం. అయితే బెదిరింపు కాల్స్‌పై పోలీసులు దృష్టి పెట్టినట్లు, దీని వెనుక ఉన్న సూత్రధారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు కూడా తెలుస్తోంది. చదవండి: మహేశ్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనా.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment