
ప్రపంచ టెక్‌దిగ్గజ సంస్థ యాపిల్ ఇటీవల కొందరు ప్రతిపక్ష రాజకీయ నాయకులు, జర్నలిస్టులకు బెదిరింపు నోటిఫికేషన్‌లను పంపిన విషయం తెలిసిందే. దానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా సంస్థకు చెందిన విదేశాల్లోని సాంకేతిక, సైబర్ సెక్యూరిటీ నిపుణులు విచారణకు హాజరవనున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.
అక్టోబర్ 31న టీఎంసీకు చెందిన మహువా మోయిత్రా, శివసేన పార్టీకి చెందిన ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్‌లోని శశి థరూర్, ఆప్‌కు చెందిన రాఘవ్ చద్దా సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ నుంచి బెదిరింపు నోటిఫికేషన్ వచ్చిందని వివిధ సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. వారి ఫోన్‌లను స్థానికులు కొందరు తప్పుగా వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నోటిఫికేషన్ సారాశం.
ఇదీ చదవండి: గూగుల్‌పేలో రీఛార్జిపై ఫీజు.. ఎంతంటే..?
ఇదిలాఉండగా ప్రభుత్వమే ఈ చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో రాజకీయ దుమారం చలరేగింది. వారి వాదనలు ఖండించిన ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. దాంతోపాటు ఆ నోటిఫికేషన్లకు సంబంధించి యాపిల్ సంస్థ నుంచి వివరణ కోరింది. ఇప్పటికే దేశంలోని యాపిల్ ప్రతినిధులను ప్రభుత్వ అధికారులు విచారించారు. కానీ సంస్థ సాంకేతిక నిపుణులు విదేశాల్లో ఉండడంతో వారూ విచారణకు హాజరవ్వాలని ప్రభుత్వం కోరింది. వీసా సమస్య కారణంగా వారు ఇండియాకు రావడం ఆలస్యమైందని అధికారులు చెప్పారు. త్వరలో విచారణకు హాజరవుతారని చెప్పారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఈ విచారణను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment